newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ఆమంచి.. ఇప్పుడు మీరు మాజీ..!

28-11-201928-11-2019 08:06:21 IST
2019-11-28T02:36:21.367Z28-11-2019 2019-11-28T02:36:07.445Z - - 04-08-2020

ఆమంచి.. ఇప్పుడు మీరు మాజీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌కాశం జిల్లా చీరాలలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీల మ‌ధ్య రాజ‌కీయం భ‌గ్గుమంటోంది. రెండు పార్టీల క్యాడ‌ర్ మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. రెండు పార్టీల నేత‌లూ సై అంటే సై అంటుండ‌టంతో త‌ర‌చూ ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ త‌ర‌పున సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రాం గెలిచిన నియోజ‌క‌వ‌ర్గ‌మిది. ఎమ్మెల్యేగా గెలిచినా బ‌ల‌రాంకు అడుగ‌డుగునా వైసీపీ అడ్డుప‌డుతోంది.

వ‌రుస‌గా రెండుసారి చీరాల నుంచి గెలిచిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టుంది. దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం ఆయ‌న స్వ‌భావం. గ‌త ఎన్నిక‌ల ముందు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరి పోటీ చేశారు. టీడీపీని వీడే స‌మ‌యంలో టీడీపీపై, చంద్ర‌బాబుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

దీంతో చంద్ర‌బాబు.. చీరాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ను ఓడించాల‌నే ఉద్దేశ్యంతో అద్దంకి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రాంను చీరాల‌లో పోటీ చేయించారు.

రాష్ట్ర‌వ్యాప్తంగా వైసీపీ ప్ర‌భంజ‌నం వీచినా చీరాల‌లో మాత్రం ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఓడిపోగా, క‌ర‌ణం బ‌ల‌రాం విజ‌యం సాధించారు. ఆమంచి ఓడినా పార్టీ అధికారంలోకి రావ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్రం తిప్పాల‌నే ఆలోచ‌న‌తో ఉన్నారు.

కానీ, క‌ర‌ణం బ‌ల‌రాం మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలో ఆమంచి ఆధిప‌త్యాన్ని స‌హించ‌డం లేదు. ఎమ్మెల్యేగా గెలిచిన త‌న మాటే న‌డ‌వాల‌ని ఆయ‌న ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. దీంతో ఇప్ప‌టికే ప‌లుమార్లు నియోజ‌క‌వ‌ర్గంలో క‌ర‌ణం వ‌ర్సెస్ ఆమంచి అన్న‌ట్లుగా గొడ‌వలు జ‌రిగాయి.

గ్రామ వాలంటీర్ల నియామ‌కం, అధికారుల బ‌దిలీలు వంటి వ్య‌వ‌హారాల్లో క‌ర‌ణం, ఆమంచి మ‌ధ్య ఆధిపత్య పోరు కార‌ణంగా అధికారులు ఇబ్బందులు ప‌డుతున్నారు. క‌ర‌ణం బ‌ల‌రాం ఎమ్మెల్యే హోదాలో ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న‌ప్పుడు కూడా ఆమంచి అనుచ‌రులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

దీంతో గొడ‌వ‌లు త‌లెత్తుతున్నాయి. మంగ‌ళ‌వారం కూడా వైఎస్సార్ న‌వ‌శ‌కం కార్య‌క్ర‌మం ప్రారంభోత్స‌వానికి వెళ్లిన ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాంను వైసీపీ వ‌ర్గీయులు అడ్డుకున్నారు.

క‌ర‌ణంకు వ్య‌తిరేకంగా, ఆమంచికి అనుకూలంగా నినాదాలు చేశారు. క‌ర‌ణం బాల‌రాంకు మ‌ద్ద‌తుగా టీడీపీ శ్రేణులు కూడా త‌ర‌లిరావ‌డంతో గొడ‌వ మొద‌లైంది. దీంతో చీరాల‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి.

ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఓడినా త‌న‌దే పైచేయి అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందుకే గొడ‌వ‌లు వ‌స్తున్నాయ‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ప్రోటోకాల్ ప్ర‌కారం ఎమ్మెల్యే వెళ్లే కార్య‌క్ర‌మాల్లో గొడ‌వ‌లు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

2014 - 2019 వ‌ర‌కు వైసీపీ ఎమ్మెల్యేల‌ను టీడీపీ ఇలానే అవ‌మానించింది. అడ్డుకుంది. ఎమ్మెల్యేగా ఇవ్వాల్సిన గౌర‌వం కూడా ఇవ్వ‌లేదు. అప్పుడు ఈ వైఖ‌రిని వైసీపీ తీవ్రంగా విమ‌ర్శించింది.

అదే వైసీపీ ఇప్పుడు టీడీపీ బాట‌లోనే వెళుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. 24 మంది ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇటువంటి ప‌రిస్థితి ఉన్నా చీరాల‌లో మాత్రం ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వైఖ‌రితో మ‌రీ ఎక్కువ‌గా ఉంది.

ఇప్ప‌టికే ఓ జ‌ర్న‌లిస్టుపై దాడి చేసిన ఘ‌ట‌న‌లో ఆమంచిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇలా నిత్యం వివాదాల‌తో ఆమంచి స‌హ‌వాసం చేస్తున్నారు. ఆయ‌న‌ను కంట్రోల్ చేయ‌క‌పోతే వైసీపీకి న‌ష్టం త‌ప్పదు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle