newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

ఆమంచికి టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

14-02-201914-02-2019 16:48:28 IST
2019-02-14T11:18:28.535Z14-02-2019 2019-02-14T11:18:25.831Z - - 27-05-2020

ఆమంచికి టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీని వీడి వైసీపీలో చేరిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యవహారంపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. పార్టీ మారినప్పుడు నిజాలు మాట్లాడకుండా వైసీపీ అధ్యక్షుడు జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదవారని ఆమె అన్నారు. చీరాల అభివృద్ధికి సీఎం ఏం చేశారో, ఎన్నికోట్ల నిధులు ఇచ్చారో ఆమె వివరించారు. సీఎం సహాయనిధి నుంచి చీరాలలో వెయ్యిమందికి రూ.6.11 కోట్లు ఇచ్చారని అన్నారు. వారందరిది ఏ కులం? అని అనురాధ ప్రశ్నించారు. చీరాలలో జరిగిన అభివృద్ధిని ఆమంచి ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే వైసీపీ నిరసన తెలపకపోగా స్వాగత బ్యానర్లు కట్టారని ఆమె విమర్శించారు. జగన్‌ కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని పంచుమర్తి అనురాధ ఆరోపించారు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా చంద్రబాబు ఆమంచికి విలువ ఇచ్చారని పంచుమర్తి అనూరాధ అన్నారు. 

ఈమేరకు టీడీపీ ఒక ప్రకటన విడుదల చేసింది. చీరాలకు విడుదల చేసిన నిధులను ప్రస్తావించారు. చీరాలలో ఈ నాలుగు సంవత్సరాల్లో మొత్తం రూ.  875 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చీరాల 1000 మందికి రూ. 6.11 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ వెయ్యి మంది ఏ కులస్థులు.. అనే వివరాల్లోకి వెళితే మనకు అక్కడ కేవలం మానవత్వం మాత్రమే కనిపిస్తోంది.

ఎల్ ఐ స్కీమ్ ద్వారా పుల్లయ్య గ్రామంలో రూ. 17 కోట్లు ఖర్చుపెట్టింది.  పందిళపల్లి ఎల్ ఐ స్కీమ్ ద్వారా వేటపాలెం మండలంలో 12.5 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. వివిధ కార్యక్రమాల కింద 231  పనులకు రూ. 14.28 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద 3,527 మందికి 52.91 కోట్లు ఖర్చు పెట్టి చీరాల నియోజకవర్గాలు గృహాలు ఇవ్వడం జరిగింది

పసుపు కుంకుమ గురించి హాస్యాస్పదంగా మాట్లాడటం దురదృష్టకరం..  నియోజకవర్గంలో 26,900 మందికి రూ. 26 కోట్లు పసుపు కుంకుమ కింద ఖర్చు చేస్తుంది. ఇంత అభివృద్ధి జరిగితే వీటిని ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తావించకపోవడం దారుణం. ఏదో వ్యాధులున్నాయని ఆమంచి చెబుతున్నారు.. అసలు ఎవరికి ఆ వ్యాధులు ఉన్నాయో ప్రజలే నిర్ణయిస్తారు. 

రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ.. ఒక్క చీరాలకే ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే.. మీరు చూపించే కృతజ్ఞత ఇదేనా?ప్రధాని రాష్ట్రానికి వస్తే.. నిరసన తెలియకపోగా.. ఇంత వరకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టకపోగా.. వైసీపీ నేతలు స్వాగత బ్యానర్లు కట్టారు. 5 కోట్ల ప్రజానీకాన్ని వాడుకుని జగన్ మోహన్ రెడ్డి కేసులు మాఫీకి ప్రయత్నిస్తున్నారు. 

నాలుగున్నర సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ గురించి జగన్ మోహన్ రెడ్డి కామెంట్ చేశారా? తొలి బడ్జెట్ లో పోలవరానికి 100 కోట్లు కేటాయిస్తేనే ప్రభుత్వంలో ఉండి కూడా మేం నాడు వ్యతిరేకించం. ముంపు మండలాలు విలీనం చేయకపోతే ప్రమాణస్వీకారం చేయనని చంద్రబాబు చెప్పారు. ప్రధాని రాష్ట్రానికి చేసిన దగాను ఎదిరించాల్సింది పోయి బీజేపీకి ఏవిధంగా వైసీపీ మద్దతు పలుకుతుంది ?

రూ. 63 లక్షల సబ్సిడీ ద్వారా నియోజకవర్గంలో 43 మందికి ట్రాక్టర్లు పంపిణీ చేయడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా కింద రూ. 126 కోట్లతో దాదాపు 24,784 మంది వేల మందికి డబ్బులు పంపిణీ చేస్తున్నాం. చీరాలలో అభివృద్ధి జరగలేదని అక్కడి స్థానిక ప్రజలను చెప్పమనండి? పార్టీ మారడం వెనుక వ్యక్తిగత ప్రలోభాలు, బెదిరిపులు ఏమైనా ఉన్నాయా..? సీఎంపై చేసిన విమర్శలు, ఆరోపణలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని అనూరాధ డిమాండ్ చేశారు. 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   10 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   12 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   15 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   17 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   18 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   18 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   19 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   19 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   19 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle