newssting
BITING NEWS :
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో అసంతృప్తులు. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు నేనంటే నేనే అంటూ వాదులాడుకునే స్థాయికి చేరిన వివాదం. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు స్పష్టం చేసిన పార్టీ * కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం బిల్లు ఆమోదాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌. వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేం‍ద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సుప్రీం పిటిషన్ లో పేర్కొన్న ఎంపీ. కేం‍ద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్దమని, చెల్లదని రద్దుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన ఎంపీ * అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూత. అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేసిన సైదా అన్వర తైమూర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సైదా అన్వర అసోం మొట్టమొదటి మహిళా సీఎం. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్న సైదా అన్వర తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూత * బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి(61)కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. హిమాలయాల పర్యటనలో ఉండగా స్వల్ప జ్వరం రావడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ ఫలితాలు. రిషికేశ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లుగా ట్వీట్. తన డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చిందని, అతడి ద్వారా వ్యాపించి ఉంటుందని ట్వీట్ లో వెల్లడించిన ఉమా భారతి * రైలు ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తులు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులపై చార్జీల మోత. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి పెరుగుదలకు అవకాశం. గరిష్ఠంగా రూ.35 నుండి కనిష్ఠంగా పది రూపాయల వరకు వసూలు చేయనున్న వినియోగ రుసుము* దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం * నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు దుర్మరణం. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన. బావామాన్ పురా ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించిన ముగ్గురు వ్యక్తులు. కరోనా బారిన పడ్డ ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ * ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి అధికంగా సాగుతున్న వరద నీటి ప్రవాహం. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్న అధికారులు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,06,819 క్యూసెక్కులు. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 883.90 అడుగులకు చేరిన ప్రస్తుతం నీటి మట్టం * తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ దాఖలు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు * దేశంలో సోమవారం నుండి ప్రారంభమైన వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 11 రోజులు ఆలస్యం. ఏపీ నుంచి అక్టోబరు 15న రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా. కాగా, దక్షిణ ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో రాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరిక * మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరిన ప్రస్తుత నీటి మట్టం. అలాగే ఇన్ ఫ్లో 4,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,978 క్యూసెక్కులుగా నమోదు * కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో అరెస్టయిన ముగ్గురు సహనిందితులకు ఏసీపీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు. చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనాథ్‌యాదవ్‌, మధ్యవర్తి అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌కు బెయిల్‌

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

29-05-202029-05-2020 08:06:32 IST
Updated On 29-05-2020 08:06:49 ISTUpdated On 29-05-20202020-05-29T02:36:32.387Z29-05-2020 2020-05-29T02:36:26.864Z - 2020-05-29T02:36:49.106Z - 29-05-2020

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్  2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి ఆప‌రేష‌న్ ఆకర్ష్ ప్రారంభానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈసారి ఏకంగా తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేకుండా దెబ్బ‌తీసే విధంగా వైసీపీ వ్యూహాలు ప‌న్నుతోంది. ఏక‌కాలంలో ఐదారుగురు తెలుగుదేశం ఎమ్మెల్యేల‌ను లాగేసే ప్ర‌య‌త్నంలో వైసీపీ కీల‌క నేత‌లు ఉన్నారు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే రెండుమూడు రోజుల్లోనే తెలుగుదేశం పార్టీకి వ‌రుస షాకులు త‌గులుతాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వైపు తెలుగుదేశం మ‌హానాడు జ‌రుపుకుంటుండ‌గా ఆ పార్టీకి చెందిన కొంద‌రు ఎమ్మెల్యేలు మాత్రం వైసీపీ నేత‌ల‌తో మంత‌నాలు సాగిస్తున్నారు.

ప్ర‌త్య‌ర్థి పార్టీని బ‌ల‌హీనం చేసేందుకు ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌డం చాలాసార్లు జ‌రిగినా ఈ ప‌ద్ధ‌తిని కొత్త పుంత‌లు తొక్కించారు చంద్ర‌బాబు నాయుడు. 2014లో ఏకంగా 67 సీట్లు గెలిచి బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదానే దూరం చేసేలా విఫ‌ల‌య‌త్నం చేశారు.

ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను లాక్కొని వారిలో న‌లుగురికి మంత్రిప‌ద‌వులు కూడా అప్ప‌గించారు. అయితే, ప్ర‌తిప‌క్షం లేకుండా చేయాల‌నే ప్ర‌య‌త్నంలో చంద్ర‌బాబు విఫ‌ల‌మైనా ఇప్పుడు జ‌గ‌న్ మాత్రం స‌ఫ‌లం కాబోయే ఛాన్సులు ఎక్కువ‌గా ఉన్నాయి. జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష నేత ప‌ద‌విని దూరం చేయాల‌నుకున్న చంద్ర‌బాబుకే ఇప్పుడు ప్ర‌తిప‌క్ష నేత ప‌ద‌వి కోల్పోయే ప‌రిస్థితి వ‌చ్చింది.

175 అసెంబ్లీ సీట్లు ఉన్న ఏపీలో ప్ర‌తిప‌క్ష హోదా ఉండాలంటే 10 శాతం సీట్లు ఉండాలి. అంటే 18 స్థానాలు ఉంటేనే ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్కుతుంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్ప‌టికే వ‌ల్ల‌భ‌నేని వంశీ, మ‌ద్దాలి గిరి, క‌ర‌ణం బ‌ల‌రాం తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీకి అనుబంధంగా మారిపోయారు. అంటే ప్ర‌స్తుతం టీడీపీకి 20 మంది శాస‌న‌స‌భ్యులే మిగిలారు. ఇంకో ముగ్గురు ఆ పార్టీకి దూర‌మైతే టీడీపీకి ప్ర‌తిప‌క్ష హోదా దూర‌మ‌వుతుంది. ఇందుకోసం వైసీపీ త‌న వ్యూహాల‌కు ప‌దునుపెట్టింది.

ప‌లువురు టీడీపీ ఎమ్మెల్యేల‌తో వైసీపీ కీల‌క నేత‌లు ట‌చ్‌లో ఉన్నారు. పార్టీ ఫిరాయిస్తార‌ని ఎక్కువ‌గా ప్ర‌కాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి. ప‌ర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబ‌శివ‌రావు ఇటీవ‌ల జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని క‌లిశార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న మ‌హానాడు కార్య‌క్ర‌మంలోనూ పాల్గొన‌లేదు. ఇదే జిల్లాకు చెందిన కొండెపి ఎమ్మెల్యే బాల‌వీరాంజ‌నేయ స్వామి కూడా వైసీపీలోకి వెళ‌తార‌ని చాలా రోజులుగా ప‌రిచ‌యం జ‌రుగుతోంది.

ఆయ‌న కూడా మ‌హానాడుకు హాజ‌రుకాలేదు. అయితే, ఆయ‌న భార్య అనారోగ్యంతో ఉన్నందునే హాజ‌రుకాలేద‌ని చెబుతున్నారు. కాగా, ఇదే జిల్లాకు చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌, మాజీ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు పేర్లు కూడా పార్టీ మార‌తార‌నే లిస్టులో వినిపిస్తున్నా వారు మాత్రం ఈ ప్ర‌చారాన్ని ఖండిస్తున్నారు. మ‌హానాడులోనూ పాల్గొన్నారు.

మ‌రోవైపు గుంటూరు జిల్లా రేప‌ల్లె ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ కూడా టీడీపీని వీడే అవ‌కాశాలు ఉన్నాయ‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు విశాఖప‌ట్నంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న న‌లుగురు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస‌రావు, గ‌ణ‌బాబు, వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్‌, వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌ కూడా పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, వీరంతా మ‌హానాడులో పాల్గొన్నారు. మ‌హానాడులో పాల్గొన‌డం ద్వారా ఇప్ప‌ట్లో అయితే తాము పార్టీ మార‌బోమ‌నే సంకేతాలు ఇచ్చిన‌ట్ల‌య్యింది. కానీ, వారి మ‌న‌స్సులో ఏముందో చేప్ప‌లేం.

నిజానికి ఒక‌వైపు తెలుగుదేశం పార్టీ మ‌హానాడు జ‌రుగుతుండ‌గానే ఆ పార్టీ ఎమ్మెల్యేల‌ను టీడీపీకి దూరం చేయ‌డం ద్వారా పార్టీని నైరాశ్యంలోకి నెట్టేందుకు వైసీపీ ప్ర‌య‌త్నిస్తోంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఇందుకు అనుగుణంగానే ఒక‌రిద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు మ‌హానాడుకు ముందే మంత్రుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.

కానీ, వైసీపీ ఎందుకో మ‌హానాడు వేళ ఎమ్మెల్యేల‌ను చేర్చుకోకుండా ఆగింది. అయితే, ఈ నెల 30వ తేదీ లేదా వ‌చ్చే నెల మొద‌టి వారంలో టీడీపీ నుంచి చేరిక‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది. కానీ, చేరిక‌ల విష‌యంలో ప‌ద‌వుల‌కు ఇబ్బంది రాకుండా టీడీపీ ఎమ్మెల్యేల‌కు వైసీపీ కండువాలు క‌ప్ప‌డం లేదు. జ‌గ‌న్‌ను క‌ల‌వ‌గానే టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూర‌మై అధికార పార్టీకి అనుబంధంగా మారిపోతున్నారు. అసెంబ్లీలోనూ ప్ర‌త్యేక స‌భ్యులుగా కూర్చుంటున్నారు.

బీజేపీదీ విస్తరణ కాంక్షే!

బీజేపీదీ విస్తరణ కాంక్షే!

   12 hours ago


దంచి కొడుతున్న వానలతో నిండు కుండలా తెలంగాణ.. పదేళ్ల రికార్డు బద్దలు

దంచి కొడుతున్న వానలతో నిండు కుండలా తెలంగాణ.. పదేళ్ల రికార్డు బద్దలు

   13 hours ago


ఏడాదిలో పీజీ, డిగ్రీ త‌ర్వాత పీహెచ్‌డీ... జ‌గ‌న్ దిశా నిర్దేశం

ఏడాదిలో పీజీ, డిగ్రీ త‌ర్వాత పీహెచ్‌డీ... జ‌గ‌న్ దిశా నిర్దేశం

   13 hours ago


ఏపీ బీజేపీ మౌన‌మెందుకు?.. వైసీపీ నేత‌ల‌కు అలుసైపోయారా?

ఏపీ బీజేపీ మౌన‌మెందుకు?.. వైసీపీ నేత‌ల‌కు అలుసైపోయారా?

   14 hours ago


ఏపీలో పాఠశాలలు తెరవడం.. ఇప్పట్లో లేనట్లేనా..!

ఏపీలో పాఠశాలలు తెరవడం.. ఇప్పట్లో లేనట్లేనా..!

   14 hours ago


దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..!

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..!

   15 hours ago


శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

   15 hours ago


రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

   16 hours ago


అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

   17 hours ago


కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

   17 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle