newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

ఆపరేషన్ రాయల్ వశిష్ట సక్సెస్.. బోటు వెలికితీత

22-10-201922-10-2019 16:15:25 IST
Updated On 22-10-2019 17:27:43 ISTUpdated On 22-10-20192019-10-22T10:45:25.262Z22-10-2019 2019-10-22T10:45:21.559Z - 2019-10-22T11:57:43.070Z - 22-10-2019

ఆపరేషన్ రాయల్ వశిష్ట సక్సెస్.. బోటు వెలికితీత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గోదావరిలో వందల అడుగుల లోతులో కూరుకుపోయిన రాయల్ వశిష్ట బోటు బయటకు వస్తుందని ఎవరూ ఊహించలేదు. తమ వల్ల కాదని అంతా చేతులెత్తేసిన వేళ ధర్మాడి సత్యం టీం బోటును మేం పైకి తెస్తాం అని ఛాలెంజ్ చేసింది. చివరకు తన ప్రయత్నం ధర్మాడి సత్యం బృందం సభ్యులు సక్సెస్ అయ్యారు. దేవీపట్నం మండలం కచ్చులూరులో మునిగిపోయిన బోటును వెలికితీశారు.

No photo description available.

బోటును నీళ్లపైకి తీసుకు వచ్చారు పోర్ట్ అధికారి ఆదినారాయణ టీం. గోదావరి వరద పెరగడం వల్ల తాము ఇబ్బందులు పడ్డామని, ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల ధర్మాడి సత్యం టీం ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రమాదంలో మృతులకు నివాళులర్పించామని ధర్మాడి సత్యం టీం పేర్కొంది. శివశక్తి టీం, ధర్మాడి సత్యం సంయుక్త సహకారంతో బోటు బయటకు వచ్చింది. ఇప్పటివరకూ మేం చేసిన ఆపరేషన్లు విజయవంతం అయ్యాయని ధర్మాడి సత్యం మీడియాకు తెలిపారు. 

నీటి అడుగు భాగం నుంచి రోప్ ల సాయంతో బోటును వెలికితీశారు. ఇన్ని రోజులుగా బోటు నీటిలో ఉండడంతో పూర్తిగా ధ్వంసమైన స్థితితో వశిష్ట బోటు ఉంది. దీంతో ఈ బోటులో ఏమైనా మృతదేహాలు ఉన్నాయా? అవి ఏ స్థితిలో ఉన్నాయోనని మిస్ అయిన యాత్రికుల బంధువులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

సెప్టెంబర్ 15వతేదీన కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బోటులో  మొత్తం 77 మంది ఉన్నారు. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలతో బయటపడ్డారు. 39 మంది చనిపోయారు. గోదావరి నదిలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఐతే మరో 12 మంది ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియలేదు.

ఇదిలా ఉంటే.. బోటులో ఐదు మృతదేహాలు ఉన్నట్లు ధర్మాడి సత్యం టీమ్ గుర్తించింది. బోటు శిథిలాల్లో మరిన్ని మృతదేహాలు వుంటాయని భావిస్తున్నారు. 38 రోజులుగా ఆ మ‌ృతదేహాలు బోటులోనే ఉండడంతో శిథిలావస్థకు చేరుకుని ఉంటాయని అంటున్నారు. వీటిని గుర్తించడం ఎలాగో తెలీక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

కొన్ని రోజులుగా బోటు వెలికితీత పనుల్ని కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం టీం చేపట్టింది. రెండురోజుల నుంచి విశాఖ నుంచి సీ డైవర్స్‌ను తీసుకొచ్చి బోటు ఎలా ఉందో నీటి అడుగునుంచి పరిశీలించింది. బోటును బయటకు తీసేందుకు చర్యలు వేగవంతం చేసింది.దీంతో బోటు వెలికితీత ప్రక్రియలో ఆశలు చిగురించాయి. ఎట్టకేలకు మంగళవారం ఈ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. 

ఇక ‘బార్లా’ తెరవడం కుదరదు..కండిషన్స్ అప్లై

ఇక ‘బార్లా’ తెరవడం కుదరదు..కండిషన్స్ అప్లై

   29 minutes ago


జగన్ డ్యామేజ్ కంట్రోల్ పాట్లు.. రంగంలోకి పీకే టీం?

జగన్ డ్యామేజ్ కంట్రోల్ పాట్లు.. రంగంలోకి పీకే టీం?

   an hour ago


ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కీలక నిర్ణయం.. విరమించడం ఖాయమా?

ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కీలక నిర్ణయం.. విరమించడం ఖాయమా?

   an hour ago


 ఎమ్మార్వో ఆఫీసులో రైతు.. సిబ్బందిపై పెట్రోల్ చల్లేశాడు

ఎమ్మార్వో ఆఫీసులో రైతు.. సిబ్బందిపై పెట్రోల్ చల్లేశాడు

   2 hours ago


జూనియర్ కి వైసీపీ నుంచి ఇంత మద్దతా.. సరైన వ్యూహమేనా?

జూనియర్ కి వైసీపీ నుంచి ఇంత మద్దతా.. సరైన వ్యూహమేనా?

   2 hours ago


పూస‌పాటి వంశీయుల రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్ధ‌క‌మేనా..?

పూస‌పాటి వంశీయుల రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్ధ‌క‌మేనా..?

   3 hours ago


ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

   4 hours ago


‘‘మీ పేపర్లోనే బోలెడంత ఇసుక’’..లోకేష్ సెటైర్లు

‘‘మీ పేపర్లోనే బోలెడంత ఇసుక’’..లోకేష్ సెటైర్లు

   4 hours ago


‘రెవిన్యూ’ నిర్లక్ష్యం.. నివురుగప్పిన నిప్పులా జనం

‘రెవిన్యూ’ నిర్లక్ష్యం.. నివురుగప్పిన నిప్పులా జనం

   4 hours ago


శివసేనలో ముసలం.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పొత్తుపై కుమ్ములాట

శివసేనలో ముసలం.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పొత్తుపై కుమ్ములాట

   6 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle