newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ఆపరేషన్ టీడీపీ.. సీఎం జగన్ వ్యూహమిదేనా?

07-12-201907-12-2019 14:54:43 IST
Updated On 07-12-2019 17:53:32 ISTUpdated On 07-12-20192019-12-07T09:24:43.105Z07-12-2019 2019-12-07T09:24:33.977Z - 2019-12-07T12:23:32.214Z - 07-12-2019

ఆపరేషన్ టీడీపీ.. సీఎం జగన్ వ్యూహమిదేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఎం జగన్మోహన్ రెడ్డి జంపింగులను ఇష్టపడరు.. ఇతర పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా వైసీపీలోకి చేరాలంటే వాళ్ళ పార్టీ సభ్యత్వంతో పాటు పదవులకు రాజీనామా చేసి వస్తేనే తమ పార్టీలో స్థానం కల్పిస్తాం.. ఇది సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డే చెప్పిన మాట. విశ్వసనీయతే తమకి ప్రధమం అని ఒక గుర్తుతో గెలిచిన వాళ్ళు పదవికి రాజీనామా చేస్తేనే మరో జెండా కిందకి వెళ్ళాలి అన్నది అయన సిద్ధాంతంగా చెప్పుకున్నారు.

సభాపతి తమ్మినేని సీతారాం కూడా ఇదే మాటని పరిపరివిధాలుగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పాటై ఆరునెలలు గడిచిపోయింది. ఆ మధ్య ప్రతిపక్ష టీడీపీ నుండి వైసీపీకి వలసలు భారీగా ఉండనున్నాయని ప్రచారం జరిగింది. అయితే ఒక్క వల్లభనేని వంశీ మినహా ఎవరూ ఆ పార్టీని వీడలేదు. వంశీ కూడా ఇప్పటికీ మరో పార్టీలో అధికారికంగా చేరనేలేదు. కానీ ఇప్పుడు వైసీపీ ఆపరేషన్ టీడీపీ మొదలుపెట్టినట్లుగా తెగ ప్రచారం జరిగిపోతుంది.

టీడీపీ నుండి మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు సీఎం సిద్ధమయ్యారని గత వారం రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇందుకు ముగ్గురు మంత్రులను రాయబారులుగా నియమించారని రెండు రోజుల క్రితమే ఆ మంత్రులకు సీఎం దిశానిర్ధేశం కూడా చేసారని పార్టీలో భారీగా చర్చ జరిగింది. ఇందులో ప్రకాశం జిల్లా నుండి ముగ్గురు, ఉత్తరాంధ్ర నుండి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు చేరికకు మార్గం సిద్దమైనట్లుగా చెప్పుకొచ్చారు.

కాగా సీఎం జగన్ ఆపరేషన్ టీడీపీ వెనుక భారీగా వ్యూహమే ఉన్నటుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు ఎమ్మెల్యేలను చేర్చుకొని వైసీపీని తీవ్రంగా దెబ్బకొట్టారు. ఇప్పటికే కక్షసాధింపులో దూసుకెళ్తున్న వైసీపీ చంద్రబాబును కోలుకొని దెబ్బదీయాలంటే ముందుగా ఎమ్మెల్యేలను దూరం చేయాలని డిసైడ్ అయినట్లుగా చెప్తున్నారు.

అయితే ఇన్నాళ్లు రాజీనామా చేసి రావాలని కోరినా ఎవరూ అందుకు సిద్దపడకపోవడంతో ఇప్పుడు ఇక తమ రాజీనామా నిబంధనను పక్కనపెట్టినట్లుగా తెలుస్తుంది. కాగా టీడీపీకి మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా వల్లభనేని వంశీ రాజీనామాతో ఆ సంఖ్య 22కి చేరింది. టీడీపీకి ప్రతిపక్ష హోదా ఉండాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలుండాలి. అంటే మరో ఐదుగురు ఎమ్మెల్యేలను ఆ పార్టీకి దూరం చేస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండాపోతుంది.

గత ప్రభుత్వంలో సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు. అందుకు కారణం అయనను టీడీపీ నేతలు అవమానించారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటారు. అలానే టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసి చంద్రబాబుకి క్యాబినెట్ హోదా కూడా పోయేలా చేసి అసెంబ్లీలో కూర్చోబెట్టాలి అన్నది సీఎం జగన్ వ్యూహంగా కనిపిస్తుందని చెప్తున్నారు. మరి దీనిని చంద్రబాబు ఎలా ఎదుర్కుంటారో చూడాల్సి ఉంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle