newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

ఆనందబాబు సంగతేంటి?

19-03-201919-03-2019 08:28:19 IST
Updated On 19-03-2019 17:23:24 ISTUpdated On 19-03-20192019-03-19T02:58:19.685Z19-03-2019 2019-03-19T02:50:51.885Z - 2019-03-19T11:53:24.584Z - 19-03-2019

ఆనందబాబు సంగతేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మంత్రి నక్కా ఆనందబాబుకు ఈ ఎన్నికలు సవాల్ విసురుతున్నాయట. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి 2127 ఓట్ల మెజార్టీతో గెలిచారు ఆనందబాబు. భట్టిప్రోలు, అమర్తలూరు, చుండూరు, వేమూరు, కొల్లూరు మండలాలు ఉన్న ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఓట్లు ఎక్కువ. గత ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి జంపని షుగర్ ఫ్యాక్టరీ.

2007లో మూతపడిన ఈ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపించడంలో ఆనందబాబు సక్సెస్ కాలేదంటున్నారు స్థానికులు. అలాగే అమర్తలూరు, నిజాంపట్నం లింక్ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదట. 

ఇక లంక గ్రామాల్లో ఉప్పు నీటి సమస్య సగం కూడా తీరలేదట. అంతేకాదు... పోలేరు చెక్ డ్యాం నిర్మాణంపై మంత్రి ఆనంద బాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది వైసీపీ నేతల ఆరోపణ. ఇక మంత్రి తన డ్రీం ప్రాజెక్టుగా చెప్పుకునే పోతర్లంక ఎత్తిపోతల పథకంలో భారీగా అవినీతి జరిగిందనీ, జమాఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న వైసీపీ డిమాండ్ మీద ఆనంద బాబు స్పందించలేదట. చుండూరు, చావలి, పెరవలిపాలెం గ్రామాలను కలిపే గంగోలు వంతెన పరిస్థితి ఏమైందని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

మరో విషయం ఏంటంటే... గ్రామాల్లోని చిన్నపాటి తగాదాలను పెంచి పోషిస్తూ, ఆనంద బాబు తన పబ్బం గడుపుకుంటారని వేమూరు నియోజకవర్గంలో కొందరు చెప్పే మాట. వేమూరు నియోజకవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచారు నక్కా ఆనందబాబు. ఆ రెండుసార్లూ ఆయనతో పోటీ పడి ఓడిపోయిన మేరుగ నాగార్జునకే ఈసారి కూడా వైసీపీ టిక్కెట్ ఇచ్చింది.

అయితే గతంలో మాదిరిగా ఈ ఎన్నికల్లో ఆనందబాబు విజయాన్ని ముందుగానే ఊహించలేమని వేమూరు నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. మొత్తానికి నక్కా ఆనందబాబు ఈసారి కూడా గెలిచి వేమూరు నుంచి హాట్రిక్ సృష్టిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle