newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

ఆది ఒంటరేనా? కడపలో మారుతున్న రాజకీయం

20-12-201920-12-2019 15:16:04 IST
Updated On 20-12-2019 16:52:49 ISTUpdated On 20-12-20192019-12-20T09:46:04.643Z20-12-2019 2019-12-20T09:45:28.199Z - 2019-12-20T11:22:49.654Z - 20-12-2019

ఆది ఒంటరేనా? కడపలో మారుతున్న రాజకీయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కడప రాజకీయాలు ఎప్పుడూ మారుతూ వుంటాయి. సీఎం స్వంత జిల్లాలోని జమ్మలమడుగులో రాజకీయ సమీకరణాలు ఊపందుకున్నాయి. మొదటి నుంచి వైయస్ కుటుంబానికి విధేయులుగా ఉంటూ వస్తున్న ఆదినారాయణ రెడ్డి 2019 ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లోనూ వైసీపీ నుండి గెలిచి ఆ తరువాత టీడీపీ లోకి వెళ్లి మంత్రి అయిన ఆదినారాయణరెడ్డి కుటుంబం ఇప్పుడు తిరిగి జగన్ వైపు అడుగులు వేస్తోంది. 

మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరులు వైసీపీలో చేరటం దాదాపు ఖాయం అయిందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల బీజేపీలో చేరిన ఆది నారాయణరెడ్డికి ఆయన కుటుంబమే షాకివ్వబోతోంది. ఆయన సోదరులు జగన్ తో కలిసి తిరిగి రాజకీయంగా నడవాలని భావిస్తున్నారు. వైసీపీలో చేరేందుకు ఈ నెల 23న ముహూర్తం ఖరారు చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

కడపలో తన రాజకీయ ప్రాబల్యం నిలుపుకునేందుకు మరో డీపీ నేత రామసుబ్బారెడ్డి సైతం వైసీపీతో టచ్ లో ఉన్నారనే ప్రచారం సాగుతుండడంతో ఆది కుటుంబీకులు యాక్టివ్ అయ్యారు. వీరే ముందడుగు వేసి జగన్ సమక్షంలో పార్టీలో చేరాలని ప్లాన్ చేసినట్లుగా నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. కడప జిల్లా పర్యటనలో జగన్ ని కలిసి వైసీపీలో చేరనున్నారని సమాచారం. 

మాజీమంత్రి ఆది నారాయణ రెడ్డి కుటుంబంలో చీలికను వైసీపీ ప్లస్ పాయింట్ గా భావిస్తోంది. కడపలో ఆదినారాయణరెడ్డి బీజేపీలో ఉంటే.. ఆయన కుటుంబం వైసీపీలోకి వెళ్ళడం వల్ల ఆయన ఒంటరి కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆది బంధువుల్లో ప్రస్తుత టిడిపి ఎమ్మెల్సీ శివనాథరెడ్డి , మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మరో కీలక నేత తాతిరెడ్డి సూర్య నారాయణ రెడ్డి వున్నారు. వీరంతా ఆది బీజేపీలోకి వెళ్ళడంతో తమకు సేఫ్ ప్లేస్ కోసం వేచి చూస్తున్నారు. ఈనెల 23న స్టీల్ ప్లాంట్ శంకుస్టాపన జరగనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ లోకి ఆది సోదరులు చేరే అవకాశం ఉంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle