newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

ఆదినారాయణరెడ్డి ఎంట్రీ...కడప గడపలో కమలం వికసిస్తుందా?

12-09-201912-09-2019 13:57:34 IST
2019-09-12T08:27:34.798Z12-09-2019 2019-09-12T08:27:24.416Z - - 27-02-2020

ఆదినారాయణరెడ్డి ఎంట్రీ...కడప గడపలో కమలం వికసిస్తుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంబొట్లు అన్నట్లుగా మారుతోందా? ఒకరి వెంట ఒకరుగా పార్టీ నాయకులు కమలం గూటికి చేరుకుంటున్న తీరు అలాగే అనిపిస్తున్నది. తాజాగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కమలం గూటికి చేరడం కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తీరని నష్టంగానే చెప్పుకోవాలి. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ సర్వశక్తులూ ఒడ్డి కడపలో ఏదో విధంగా బలపడేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో ఒకింత సక్సెస్ అయ్యింది కూడా. ఫ్యాక్షన్ లకు నిలయమైన రాయలసీమలో కడపది ఒక ప్రత్యేక స్థానం. 

కడప వైఎస్ కుటుంబానికి కంచు కోట. ఆ జిల్లాలో వైఎస్ కుటుంబ ఆధిపత్యానికి తిరుగేలేని పరిస్థితి ఉంది. అయితే ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రిపదవి దక్కించుకున్నతరువాత జిల్లాలో పరిస్థితి మారింది. తెలుగుదేశంలో జోష్ వచ్చింది. సీఎం రమేష్ వంటి వారు చేసిన గ్రౌండ్ వర్క్ కు ఆదినారాయణ రెడ్డి చేరికతో పార్టీకి ఒక బలం వచ్చింది. 

వైఎస్ కుటుంబానికే చెందిన వైఎస్ వివేకానందరెడ్డిని ఢీకొని స్థానిక ఎన్నికలలో గెలిచే సత్తా తెలుగుదేశం సంతరించుకుందంటే అందుకు ఆదినారాయణ రెడ్డి చేరిక ఒక ముఖ్య కారణం అని చెప్పక తప్పదు. అయితే.. ఆ జోష్ తోనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో జిల్లాలో కొన్ని జిల్లాలలో విజయంపై తెలుగుదేశం కన్నేసింది. గెలవగలమన్న ధీమానూ వ్యక్తం చేసింది. 

పట్టి సీమ ద్వారా కడప జిల్లాకు నీరందడం...జిల్లాలో వైఎస్ ఆధిపత్యాన్ని దీటుగా ఎదుర్కొనగలిగే ఆదినారాయణ రెడ్డి అండ దొరకడం తో తెలుగుదేశం కార్యకర్తలలో ధైర్యం, ధీమా పెరిగాయి. అయితే ఎన్నికలలో తెలుగుదేశం పరాజయంతో తెలుగుదేశం క్యాడర్ లో నైరాశ్యం కమ్ముకుంది. క్యాడర్ చెల్లా చెదురు కాకుండా ఆదినారాయణ రెడ్డి బలం బలగం, పట్టు జిల్లాలో దేశానికి ఉపయుక్తంగా ఉంటుందని పార్టీ అధిష్టానం భావించింది. అయితే ఆదినారాయణ రెడ్డి పార్టీ ఆలోచనా ధోరణికి భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. 

ఎన్నికలలో పరాజయం తరువాత తెలుగుదేశం ఇప్పట్లో తేరుకోవడం కష్టం అనుకున్నారో...లేక..సీఎం రమేష్ వంటి నేతల ఒత్తిడి ఫలితమో మొత్తానికి ఆయన జెండా మార్చేశారు. తెలుగుదేశం పార్టీ వీడి కమలం పంచన చేరారు. ఫ్యాక్షన్ జిల్లా అయిన కడపలో పార్టీల ఆధిపత్యం అన్నది ఆయా పార్టీల సిద్ధాంతాలను బట్టి కాకుండా...ఆ పార్టీలో ఉండే నేతలను బట్టి మారుతుంటుంది. ఆది నారాయణ రెడ్డి చేరికతో తెలుగుదేశం ఎలా బలం పుంజుకుందో...ఇప్పుడు అలాగే బీజేపీకి కూడా కడపలో పట్టు చిక్కే అవకాశాలున్నాయన్నది పరిశీలకుల అంచనా. 

అది నిజమే కూడా. ఆదినారాయణ రెడ్డికి కడపలో గట్టి పట్టు ఉంది. ఆయన వెంట బలమైన కార్యకర్తల క్యాడర్ ఉంది. ఆదినారాయణరెడ్డితో పాటు ఆ క్యాడర్ కూడా కమలం చెంతకే చేరుతుంది. అది బీజేపీకి కచ్చితంగా కడపలో ఏదో మేరకు బలం పుంజుకునేందుకు దోహదపడుతుంది.  వైసీపీ అధికారంలో ఉండటం,  పట్టిసీమ, పోలవరంలపై వైసీపీ వ్యతిరేకత సహజంగానే జిల్లా వాసులను ప్రత్యామ్నాయం వైపు ఆలోచించేలా చేస్తాయి. జల సమస్యల పరిష్కారం విషయంలో అధికారపార్టీ విధానాలు రైతులకు ఆ పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ఒకింత అసంతృప్తిని కలగజేస్తున్న నేపథ్యంలో...తెలుగుదేశం గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా  ఉన్న పరిస్థితుల్లో ఆదినారాయణ రెడ్డి బీజేపీ గూటికి చేరడం...కడప గడపలో కమలం కాలూనేందుకు అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle