newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

ఆదాయ పతనంలో మరే రాష్ట్రం ఏపీకి లేదు పోటీ..!

09-10-201909-10-2019 09:38:37 IST
2019-10-09T04:08:37.395Z09-10-2019 2019-10-09T04:08:34.090Z - - 06-12-2019

ఆదాయ పతనంలో మరే రాష్ట్రం ఏపీకి లేదు పోటీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినిమా మొదలవడానికి ముందొచ్చే సిగరెట్ నిషేధ యాడ్ లాగా తయారైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. ఏమవుతుంది మన నగరానికి ఒక వైపు నుసి.. మరోవైపు కాలే సిగరెట్.. ఉపేక్షించకండి అంటూ వచ్చే ఆ యాడ్ లాగానే ఓ వైపు దేశవ్యాప్తంగా నడుస్తున్న ఆర్ధిక మాంద్యం.. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ విధానాల వలన ఆర్ధిక మాంద్యం కలిసి ఏపీలో ఆదాయం పతనమైపోతుంది. ఏకంగా మన దేశంలో మరే రాష్ట్రం కూడా ఏపీని టచ్ చేయలేనంత దారుణంగా పడిపోయి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

ఏపీలో ఏప్రిల్ నెల నుండి ఆగష్టు నెల వరకు వచ్చిన ఆదాయాన్ని సరాసరిన గత నెలల ఆదాయంతో పోల్చి చూస్తే ఏకంగా 42.7 శాతం పడిపోయింది. దాదాపుగా సగానికి సగం తగ్గిపోవడమంటే సామాన్యమైన విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎక్కువగా ఆదాయం తగ్గిపోయిన రాష్ట్రాల్లో పంజాబ్ ఉండగా అక్కడ 12.5 శాతం మాత్రమే తగ్గిపోయింది. రెండో స్థానంలో ఉన్న రాష్ట్రానికి ఏపీకి కూడా క్షిణించిన ఆదాయంలో తేడా ముప్పై శాతానికి పైనే ఉందంటే ఏపీలో పరిస్థితి ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు.

ఏపీ, పంజాబ్ మాత్రమే కాదు కేరళ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో కూడా ఆదాయం తగ్గింది. అయితే పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాలలో పదిశాతం లోపే ఆదాయం తగ్గింది. దీనికి కారణం దేశంలో ఉన్న ఆర్ధిక మాంద్యమేనని స్పష్టంగా తెలుస్తుంది. మరి ఏపీలో ఏకంగా సగానికి సగం శాతంలో పడిపోవడాన్ని ఏ విధంగా లెక్కించాలి? ఏ కోణంలో చూడాలన్నది కూడా విశ్లేషకులకు అంతుబట్టడం లేదు. మార్ధిక మాంద్యం వలన పదిశాతం ఆదాయం తగ్గితే రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన మరో ముప్పై శాతం ఆదాయం పడిపోయిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజల సగటు ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇసుక కొరతతో నిర్మాణ రంగంలో కూలీలకు పూటగడవడం కూడా కష్టంగా మారగా ఆదాయం ఎక్కడ నుండి వస్తుంది? ఇక ఆ కూలీలు ఖర్చు ఎక్కడ నుండి పెడతారు?. ఇక రాజధాని అమరావతిలో మొత్తం యాభై వేల కోట్ల రూపాయల పనులను ఒక్కసారిగా ఆపేయడంతో ఆ ప్రాంతంలో అప్పటి వరకు ఉన్న నిర్మాణ సంస్థలు, దేశంలో పలుప్రాంతాల నుండి వచ్చిన వేలాదిమంది ఉద్యోగులు, వ్యాపార సంస్థలు కూడా తిరిగి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు.

ఒక్కమాటగా చెప్పాలంటే ఏపీలో నిర్మాణ రంగమంతా సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు తరలివెళ్ళిపోయారు. ఈ రంగం ఏపీలో తిరిగి కోలుకోవడం అంటే ఇప్పట్లో ఇక కష్టమేనని స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పలు పారిశ్రామిక రంగాలలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కొత్త సంస్థలు అటువైపు చూపే తిప్పడం లేదు. 

వైసీపీ నేతల పెత్తనం పెరిగిపోతుందని టాక్స్ ఓ పక్క ఉండగానే కియా తొలి కారు విడుదల సమయంలో ఆ పార్టీ ఎంపీ ఏకంగా సంస్థ ప్రతినిధులనే బెదిరించడం.. రిజర్వ్ బ్యాంక్.. ప్రపంచ బ్యాంక్ రాష్ట్రానికి సహాయం చేసేందుకు వెనక్కు తగ్గిందన్న వార్తలు దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టడం వంటి కారణాలు కొత్త పారిశ్రామిక వేత్తలకు బ్రేకులేశాయి.

ఇక ఇదిలా ఉండగానే రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో కూడా డెబ్భై ఐదు శాతం స్థానికత అమలు చేయాలని ఆదేశాలివ్వడం వంటి కారణాలు పారిశ్రామిక రంగంలో కొత్త పెట్టుబడులకు నిరోధకాలుగా మారాయి. డెబ్భై ఐదు శాతం స్థానికత రాష్ట్ర ప్రజలకు మంచిదే కానీ సంస్థలు మాత్రం నిపుణత ఎక్కడ ఉంటే దానికే అవకాశం ఇవ్వాలనుకుంటుంది కనుక ప్రత్యామ్నాయం వైపే చూసుకుంటుంది. 

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే కాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు రాష్ట్ర ఆదాయాన్ని కోలుకోలేని స్థితిలో దిగజార్చాయన్నది విశ్లేషకుల వాదన. మరి రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి సాధారణ స్థితికి తేగలరా? ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టగలరా? సగ భాగం క్షిణించిన ఆదాయాన్ని సాధారణ స్థితికి తేవడం తేలికైన విషయమేనా? లెట్స్ వెయిట్ అండ్ సీ!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle