newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

ఆటో, ట్యాక్సీ వాలాలకు గంటల్లోనే ఖాతాల్లో నగదు జమ..

05-10-201905-10-2019 10:11:11 IST
Updated On 05-10-2019 15:08:38 ISTUpdated On 05-10-20192019-10-05T04:41:11.181Z05-10-2019 2019-10-05T04:34:55.921Z - 2019-10-05T09:38:38.173Z - 05-10-2019

ఆటో, ట్యాక్సీ వాలాలకు గంటల్లోనే ఖాతాల్లో నగదు జమ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరోసారి మాట నిలబెట్టుకున్నట్లేనా.. శుక్రవారం వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని స్వయంగా ఏలూరులో ప్రారంభించిన జగన్ వాగ్దానాల అమలులో మరోసారి తన్ను తాను నిరూపించుకున్నారు. ఆశా కార్యకర్తల వేతనాలు. అంగన్‌వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు ఇప్పటికే పెంచిన జగన్‌మోహన్‌రెడ్డి... వలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయాల ఉద్యోగాలు. సచివాలయాల ఏర్పాటు. రేషన్‌ కార్డుదారులకు నేరుగా ఇంటికే నాణ్యమైన బియ్యం పంపిణీ. పంట నష్టపరిహారం పెంపు... ఇలా పాదయాత్రలో ఇచ్చిన  ప్రతి హామీని అమలు చేస్తున్నారు. 

ప్రజా సంకల్ప పాదయాత్ర సమయంలో ఆటోడ్రైవర్ల కష్టాలు చూసి చలించిన వైఎస్‌ జగన్‌ ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌ల ఫిట్‌నెస్, బీమా, మరమ్మతుల కోసం ఏటా  రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయం అందచేస్తామని నాడు ఏలూరులో జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే నేడు  వైఎస్సార్‌ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించారు.

వందలాది ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమక్షంలో స్వయంగా ఆటో డ్రైవర్ల యూనిఫారం వేసుకుని మరీ కార్యక్రమానికి హాజరైన జగన్ శుక్రవారం అర్హులైన వారి హర్షధ్వానాల మధ్య వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించారు. ఇంకా విశేషం ఏమిటంటే మాట ఇచ్చిన చోటు నుంచే పథకానికి శ్రీకారం చుట్టడం. రాజకీయ చరిత్రలో ఇది చాలా అరుదైన విషయమని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని ఆటో డ్రైవర్ల సంఘాలు పేర్కొన్నాయి. ఈ పథకం ద్వారా మొత్తం 1,73,531 మంది లబ్ధి పొందనున్నారు.

ఆటో, ట్యాక్సీవాలాల సమస్యలు ఇన్నీ అన్నీ కావు. అసలే అంతంతమాత్రపు బతుకులు... ఆపై ఫైనాన్షియర్ల వేధింపులు... పైగా రికార్డులు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి... ఎప్పటికప్పుడు ట్యాక్స్‌ చెల్లించుకోలేని దుస్థితి... ఇలా అనేక ఇబ్బందులను ఆటో, ట్యాక్సీవాలాలు ఎదుర్కొంటున్నారు. నెలాఖరొస్తే చాలు భయంభయంగా గడిపే పరిస్థితి ఉంది. ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం ఆరాటం... ఫిట్‌నెస్‌ కోసం పడిగాపులు... మరమ్మతుల కోసం ఆర్థిక ఇబ్బందులు... తదితర వాటితో నిత్యం కష్టాల కన్నీళ్లే. ఇన్ని బాధలు పడుతున్నా ఇంతవరకు ఏ ఒక్క పాలకుడు పట్టించుకోలేదు.

కానీ పాదయాత్ర సమయంలో భరోసా ఇచ్చిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. నేనున్నానంటూ అధికారంలోకి రాగానే ఆటో, ట్యాక్సీ కార్మికులకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడా హామీని అమలు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. 

ఆటో, ట్యాక్సీ వాలాలకు చేయూతగా ప్రభుత్వం ప్రకటించిన వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద సెప్టెంబర్‌ 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో 28,144 వాహనాలుండగా, అందులో 10,798మంది యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. నమోదులో 38.49 శాతంతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో శ్రీకాకుళం నిలిచింది. వచ్చిన దరఖాస్తులను ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో పరిశీలించాక 146 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించగా,  మిగిలిన 10,652 దరఖాస్తులకు కలెక్టర్‌ ఆమోదం లభించింది. వీరందరికీ వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద సంవత్సరానికి రూ.10 వేల ప్రభుత్వ సాయం అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.400 కోట్లతో లక్షా 73వేల మందికి లబ్ధి చేకూరుతుండగా అందులో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించే 10,652మంది ఉన్నారు. వీరు మొత్తం రూ.10.65 కోట్లకు పైగా లబ్ధి పొందనున్నారు.   

వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం దరఖాస్తుదారులు 1,75,352 మంది కాగా అర్హులైన లబ్ధిదారులు 1,73,531 మంది అని గ్రామ వలంటీర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు తమ పరిశీలనలో తేల్చారు. కలెక్టర్ల ఆమోదముద్రతో అర్హులను రవాణా శాఖ అధికారులు నిర్థారించారు. లబ్ధిదారుల్లో అత్యధికంగా బీసీలే ఉన్నారు. 1,73,531 మంది లబ్ధిదారుల్లో 79,021 మంది బీసీలే కావడం గమనార్హం.

ఒకటి మాత్రం నిజం. ఈ పథకాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో, ఎలా మ్యానేజి్ చేస్తున్నారో తెలియకపోయినప్పటికీ నవరత్నాలను ఇంకా అమలు పర్చనప్పటికీ ఇతర హామీలను మాత్రం జగన్ ఒక్కటొక్కటిగా ప్రారంభిస్తుండటం ఉండవల్లి వంటి తటస్థ మేథావులను కూడా షాక్ కు గురిచేస్తోంది. ప్రజల సంక్షేమానికి ఇవి ఒక్కొక్కటి ఒక్కో గీటురాయి. సంకల్ప బలంతో ముందడుగేస్తున్న జగన్ చివరివరకు వీటిని సజావుగా అమలు చేస్తారని కోరుకోవడం మాత్రమే చేయగలం.

కొసమెరుపు: 

వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ.10 వేలు ఆర్థిక సాయం కింద గంటల వ్యవధిలోనే నగదు అకౌంట్లలో జమ అయిందని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు తమ సెల్‌ పోన్లకు వచ్చిన మెసెజ్‌లు చూపించి వారు హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కోసం 13,792 మంది దరఖాస్తు చేసుకోగా 13,697 మందిని అర్హులుగా గుర్తించారు.

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

   8 minutes ago


రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   an hour ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   an hour ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   2 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   19 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   21 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle