newssting
BITING NEWS :
* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

ఆగ‌స్టు వ‌స్తోంది... తెలుగుదేశంలో గుబులు

30-07-201930-07-2019 11:28:08 IST
2019-07-30T05:58:08.772Z30-07-2019 2019-07-30T05:58:04.981Z - - 25-05-2020

 ఆగ‌స్టు వ‌స్తోంది... తెలుగుదేశంలో గుబులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలుగుదేశం పార్టీకి ముందు నుంచీ ఆగ‌స్టు నెల అస్స‌లు క‌లిసి రావ‌డం లేదు. ఆగ‌స్టు నెల అంటేనే ఆ పార్టీకి ఒక బ్యాడ్ సెంటిమెంట్‌గా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మి, పార్టీలో అసంతృప్తి, నేత‌ల వ‌ల‌స‌ల‌తో నైరాశ్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఆగ‌స్టు నెల వ‌స్తుండ‌టం గుబులు పుట్టిస్తోంది. ఈసారి బార‌తీయ జ‌న‌తా పార్టీ రూపంలో ఆగ‌స్టు సంక్ష‌భం ఎదురవుతుందా అనే భ‌యం క‌నిపిస్తోంది.

టీడీపీకి ఆగ‌స్టు నెలలో ప‌లు సంక్షోభాల‌ను ఎదుర్కుంది. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ ఆగ‌స్టు నెల‌లోనే రెండుసార్లు గ‌ద్దె దిగాల్సి వ‌చ్చింది. మొద‌టిసారి ఆయ‌న‌పై నాదెండ్ల భాస్క‌ర‌రావు తిరుగుబాటు చేసి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకుంది 1984 ఆగ‌స్టు నెల‌లోనే.

ఆ త‌ర్వాత 1995 ఆగ‌స్టులో చంద్ర‌బాబు నాయుడు రూపంలో పార్టీలో సంక్షోభం రేగింది. చంద్ర‌బాబు నాయుడు పార్టీలో తిరుగుబాటు చేసి వైశ్రాయ్ హోట‌ల్‌లో క్యాంపు న‌డిపి ఎన్టీఆర్‌ను గ‌ద్దె దింపు ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. ఇక‌, ఈ ఆగ‌స్టు సంక్షోభాలు చంద్ర‌బాబు నాయుడును సైతం వెంటాడాయి. చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ జీవితంలో మాయ‌ని మ‌చ్చ‌లా మిగిలిపోయిన బ‌షీర్‌బాగ్ కాల్పులు జ‌రిపింది కూడా ఆగ‌స్టు నెల‌లోనే.

విద్యుత్ ఛార్జీలు త‌గ్గించాల‌ని ఆందోళ‌న చేస్తున్న వారిపై 2000 సంవ‌త్స‌రం ఆగ‌స్టు నెల‌లో అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కాల్పులు జ‌రిపించింది. ఈ సంఘ‌ట‌న త‌ర్వాత చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. త‌ర్వాతి ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మికి ఇది కూడా ఒక కార‌ణ‌మే. దీంతో ఆగ‌స్టు నెల అంటే టీడీపీ నేత‌లు కొంత ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఆగ‌స్టులో ఎటువంటి ముహూర్తాలు కూడా పెట్టుకోరు.

ఇప్పుడు ఆగ‌స్టు నెలలో బీజేపీ రూపంలో సంక్షోభం ఎదుర‌వుతుందా అనే భ‌యం టీడీపీలో నెల‌కొంది. రాష్ట్రంలో పార్టీని బ‌లోపేతం చేసుకోవాల‌నుకుంటున్న బీజేపీ టీడీపీ నుంచి వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తోంది. అయితే, ఇప్పుడు ఆషాడ‌మాసం కావ‌డంతో నేత‌లు ఆగుతున్నారు. ఆగ‌స్టులో శ్రావ‌ణ మాసం మొద‌లు కాగానే పెద్ద ఎత్తున టీడీపీ నేత‌లు బీజేపీలోకి వెళ్లే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇది నిజంగా జ‌రిగితే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఈసారి మ‌ళ్లీ ఆగ‌స్టు సంక్షోభం త‌ప్ప‌దేమో. అయితే, టీడీపీకి సంక్షోభాలు కొత్తేమీ కాదు. ఎన్ని సంక్షోభాలు వ‌చ్చినా తిరిగి నిల‌బ‌డింది ఆ పార్టీ. మ‌రి, ఈసారి ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

 

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   2 hours ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   4 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   4 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   4 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   5 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   5 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   5 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   24-05-2020


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   24-05-2020


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   24-05-2020


ఇంకా

Sharat Bhamidi


With 5 years of experience in Digital Media, Sharat Bhamdi specialises in creating content for webistes, developing ad campaigns and social media campaigns. At NewsSting, he handles the video division where he brings in content through feature videos and interviews.
 sharat@rightfolio.co.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle