newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

ఆకుల సరే.. జూపూడి పశ్చాత్తాపంలో నిజాయితీ ఉందా?

09-10-201909-10-2019 12:20:47 IST
Updated On 09-10-2019 13:04:55 ISTUpdated On 09-10-20192019-10-09T06:50:47.127Z09-10-2019 2019-10-09T06:50:43.215Z - 2019-10-09T07:34:55.807Z - 09-10-2019

ఆకుల సరే.. జూపూడి పశ్చాత్తాపంలో నిజాయితీ ఉందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక పార్టీనుంచి మరొక పార్టీలోకి నాయకులు, కార్యకర్తలు మారడం, ఫిరాయించడం నేటి రాజకీయాల్లో సాధారణ విషయం అయిపోయింది. కానీ కొంతమెంది నాయకుల కప్పదాట్లను చూసినప్పుడు, ఇన్నాళ్లు తాము బండబూతులు తిట్టిన పార్టీలోకే మరో మార్గం లేదని తిరిగి చేరుతున్నప్పుడు మన రాజకీయ నాయకులు ఎంత సిగ్గూ శరమూ లేనివారు అనిపించక మానదు.

మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్‌,  పీసీసీ కార్యదర్శి దాసు వెంకట్రావులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో ఒక విషయం అర్థమైపోయింది. తెలుగుదేశం నుంచి, జనసేన నుంచి కూడా ఇకమీదట వైకాపాలోకి వలసలు వెల్లువెత్తడం ఖాయం అని తేలిపోయింది. ఇన్నాళ్లుగా ఇతర పార్టీలకు చెందిన వారిని చేర్చుకోవడంలో ఆచి తూచి వ్యవహరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పడు పార్టీని బలోపేతం చేయడం పేరుతో  గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వలసలు ఊపందుకుంటాయని స్పష్టం అవుతోంది. జగన్ సమ్మతించాక ఇంకా ఆలస్యం దేనికి అనేటట్లుగా రాబోయే రోజుల్లో టీపీడీనుంచి వలసలు తప్పవని రూఢి అవుతోంది.

కానీ మంగళవారం వైఎస్ జగన్ సమక్షంలో వైకాపాలో చేరిన వారిలో జననేత తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆకుల సత్యనారాయణ ఒకరైతే, వైఎస్ జగన్ 2014లో అధికారంలోకి రాలేరని స్పష్టమైన కొంత కాలానికే టీడీపీలోకి జంప్ చేసిన జూపూడి ప్రభాకరరావు మరొకరు. వైకాపా కష్టకాలంలో ఉన్నప్పుడు అధికారం కోసమో, పదవుల కోసమో, చంద్రబాబు ప్రలోభాల కోసమో టీడీపీలో చేరిపోయిన జూపూడి ఇప్పుడు మళ్లీ మాతృ సంస్థకు తిరిగొచ్చిన సందర్ఘంగా చాలా గంభీరమైన ప్రకటనే చేశారు.

మంచి పరిపాలన రావాలని, రాజన్న పాలన తెస్తాడని ప్రజలు సీఎం జగన్‌ను ఆశీర్వదించారని జూపూడి ప్రభాకర్‌ అన్నారు. ఐదుగురు దళితులకు కేబినేట్‌లో సీఎం జగన్‌ స్థానం కల్పించారని పేర్కొన్నారు. దేశం మొత్తం ఈ అంశాన్ని ఆదర్శంగా తీసుకుందని అన్నారు. అసెంబ్లీలో పెట్టిన బిల్లులను రాజ్యాంగ బద్ధంగా తీర్చిదిద్దారని అన్నారు. సీఎం జగన్‌ పరిపాలన ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. పొరపాట్లు తన వైపే ఉన్నాయని, సరిదిద్దుకుంటానని చెప్పారు.

మాల కమ్యూనిటీకి చెందిన జూపూడి మాటల్ని పొందికగా వాడటంలో నిపుణులు.  ప్రత్యర్థులను చీల్చి చెండాడటంలో కూడా సమర్థులే. కానీ ఆయనకు ఇప్పుడు జగన్ ఒక మెస్సయ్య (ఉద్దారకుడు) లాగా కనిపిస్తున్నారట.  నిర్దిష్ట ఆలోచన లేకుండా గొర్రెల్లా పక్కదారి పట్టామన్నారు. రాజకీయంగా నావైపు జరిగిన కొన్ని తప్పులను సరిదిద్దుకుంటానని స్పష్టం చేశారు. జగన్‌లో ఫెడరల్ క్యాస్ట్రో విధానాలు కనిపిస్తున్నాయన్నారు. ఆంధ్రా ఐరన్‌ మ్యాన్‌ విజయసాయిరెడ్డి అని చెప్పారు. పదవులు ఆశించి వైసీపీలో చేరలేదన్నారు. 

పైగా పొరపాట్లు తనవైపే ఉన్నాయని, సరిదిద్దుకుంటానని జూపూడి చేసిన ప్రకటన మరీ ఆశ్చర్యంగా ఉంది. ఒకప్పుడు మాల మహానాడు అధినేతగా వ్యవహరించిన జూపూడి... మందకృష్ణ  పోరాడిన మాదిగ ఎస్సీ వర్గీకరణ డిమాండుకు వ్యతిరేకత తెలిపారు. తర్పాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాపకం సంపాదించి 2009లో ఎమ్మెల్సీగా కూడా అయ్యారు.  వైఎస్సార్ గతించిన తర్వాత కూడా వైఎస్ జగన్ జూపూడిని ప్రోత్సహించి పార్టీలో ప్రాధాన్యమున్న నేతల్లో ఒకరిగా స్థానం కల్పించారు. కానీ 2014 ఎన్నికల్లో జగన్ అధకారానికి చేరుకోలేకపోవడంతో మరుక్షణం టీడీపీలోకి ఫిరాయించిన జూపూడి జగన్‌కు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేశారు. తనవంతుగా జూపూడికి ఏపీ ఎస్సీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా రెండుసార్లు పదవి కట్టబెట్టిన చంద్రబాబు ఇటీవలి వరకు జగన్‌ని అనరాని మాటలతో దూషించేలా జూపూడిని ముగ్గులో దింపారు. 

ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక, టీడీపీ ఘోరపరాజం పొందాక, ఇక తనకు భవిష్యత్తు లేదని అర్థమైన జూపూడి తిరిగి వైకాపాలో చేరారు. కానీ ఇకపై జగన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ చంద్రబాబును దూషించే కార్యక్రమం జూపూడి ప్రారంభిస్తారేమోనని వైకాపా కార్యకర్తలే ఛీదరించుకుంటున్నారు. పార్టీనుంచి ఫిరాయించి మళ్లీ వెనక్కు తిరిగివచ్చి నాయకత్వ స్థానాల్లోకి చేరిపోతుంటే జీవితమంతా పార్టీకోసమే పని చేసిన మాలాంటివాళ్ల పరిస్థితి ఏంటని వైకాపా కార్యకర్తలు మనోవేదనకు గురవుతున్నారు.

వైఎస్ జగన్ ఏ కారణాలతో జూపూడి లాంటి వారిని చేర్చుకున్నా అది ఆయన ఇష్టం. రాజకీయ వ్యూహాలు సామాన్యులకు అర్థం కావని ఒప్పుకుందాం. కానీ దయచేసి జూపూడి అనే పక్కా ఫిరాయింపుదారుడి చేత చంద్రబాబును దూషించే పనికి జగన్ అనుమతించకూడన్నదే జనాభిప్రాయం. రాజకీయాల్లో విలువలు ఇలాంటి నేతల వల్లే అసహ్యం పాలవుతున్నాయన్నది నిజం. పార్టీల అధినేతలు ఇలాంటివారిని ఎంతలో ఉంచితే అంత మేలనేది జనాంతికం.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle