newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

ఆంధ్ర‌జ్యోతి విలేక‌రి హ‌త్య కేసులో బిగ్ ట్విస్ట్..!

31-10-201931-10-2019 06:53:10 IST
2019-10-31T01:23:10.924Z31-10-2019 2019-10-31T01:23:05.677Z - - 16-11-2019

ఆంధ్ర‌జ్యోతి విలేక‌రి హ‌త్య కేసులో బిగ్ ట్విస్ట్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ నెల 15న తూర్పు గోదావ‌రి జిల్లా తుని మండ‌లంలో ఆంధ్ర‌జ్యోతి విలేక‌రి ఖాతా స‌త్య‌నారాయ‌ణను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దారుణంగా హ‌త్య చేసిన ఉదంతం విధితమే. ఈ హ‌త్య వెనుక వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హ‌స్త‌ముందంటూ మృతుడి సోద‌రుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేతోపాటు మ‌రో ఆరుగురిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

హ‌త్య జ‌రిగింది ఆంధ్ర‌జ్యోతి విలేక‌రిది కావ‌డం, హ‌త్య వెనుక వైసీపీ ఎమ్మెల్యే హ‌స్త‌ముంద‌ని ఆరోప‌ణ‌లు రావ‌డంతో చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా దెబ్బ తిన్నాయ‌ని, అందుకు విలేక‌రి హ‌త్యే నిదర్శ‌న‌మ‌ని చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్యానించ‌గా, అస‌లు మ‌నం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే ఉన్నామా..?  లేదా..? అన్న అనుమానం క‌లుగుతుందంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఆరోపించారు.

ఈ నేప‌థ్యంలో ఈ కేసును అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ద‌ర్యాప్తు చేశారు. అస‌లు హంత‌కుల‌ను కూడా అరెస్టు చేశారు. హ‌త్య‌కు గురైన ఖాతా స‌త్య‌నారాయ‌ణ తొలి నుంచి కూడా మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడికి స‌న్నిహితంగా ఉండేవారు. దీంతో య‌న‌మ‌ల కుటుంబానికి రాజ‌కీయంగా, ప్ర‌త్య‌ర్ధిగా ఉంటూ వ‌స్తున్న దాడిశెట్టి రాజాకు వ్య‌తిరేకంగా స‌త్య‌నారాయ‌ణ ప‌దే ప‌దే వ్య‌తిరేక క‌థ‌నాలూ రాసేవారు. ఈ కోణంలో.. ఈ క‌క్ష‌తోనే దాడిశెట్టి రాజా స‌త్య‌నారాయ‌ణ‌ను హ‌త్య చేయించి ఉంటార‌ని తొలుత భావించారు.

ఆయ‌న సోద‌రుడు కూడా ఈ మేర‌కే పోలీసుల‌కు ఫిర్యాదు ఇచ్చారు. కానీ, హ‌తుడు సోద‌రుడు ఇచ్చిన ఫిర్యాదులోని పేర్ల‌ను ప‌రిశీలించిన పోలీసులు వారిని విచారించిన త‌రువాత వీరు హ‌త్య చేయ‌లేదు.. మ‌రెవ్వ‌రో హ‌త్య చేశారు అన్న నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన త‌రువాత కేసుల‌ను లోతుగా ద‌ర్యాప్తు చేశారు. అలా ద‌ర్యాప్తు చేసిన త‌రువాత ఆరుగురిని అరెస్టు చేశారు.

జిల్లా ఎస్పీ స్వ‌యంగా కేసును ప‌ర్య‌వేక్షించారు. అరెస్టు అయిన వ్య‌క్తుల‌ను మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టిన జిల్లా ఎస్పీ ఈ హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు, దారి తీసిన ప‌రిస్థితులను కూడా వివ‌రించారు.

గౌరి వెంక‌ట‌ర‌మ‌ణ, దొర‌బాబు, తాతాజి అనే ఈ ముగ్గురు వ్య‌క్తుల‌ను ప‌దే ప‌దే బ్లాక్‌మెయిల్‌చేసి ఆంధ్ర‌జ్యోతి విలేక‌రైన ఖాతా స‌త్య‌నారాయ‌ణ బ్లాక్‌మెయిల్ చేసి డ‌బ్బులు వ‌సూలు చేయ‌డ‌మే ఈ హ‌త్య‌కు కార‌ణంగా పోలీసులు తేల్చారు.

గౌరీ వెంక‌ట‌ర‌మ‌ణ, దొర‌బాబుల‌కు ఉన్న వ్య‌క్తిగ‌త ఇబ్బందులు, వారికున్న వ్య‌క్తిగ‌త లొసుగుల‌ను ఆధారంగా చేసుకుని త‌న‌కున్న రాజ‌కీయ ప‌లుకుబ‌డితో కేసులు పెట్టిస్తాన‌ని, రౌడీ షీట్ ఓపెన్ చేయిస్తానంటూ ప‌దే ప‌దే బెదిరించిన స‌త్య‌నారాయ‌ణ వారి ద‌గ్గ‌రి నుంచి ల‌క్ష‌లాది రూపాయ‌ల‌ను వ‌సూలు చేశార‌ని, జిల్లా ఎస్పీ మీడియాకు వివ‌రించారు.

ఇప్ప‌టికే గౌరీ వెంక‌ట‌ర‌మ‌ణ స‌త్య‌నారాయ‌ణ‌కు రూ.ల‌క్ష‌లు ఇచ్చార‌ని, అయినా స‌రే ప‌దే ప‌దే డ‌బ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తుండ‌టంతో దాన్ని భ‌రించ‌లేకే వీరు స‌త్య‌నారాయ‌ణ‌ను హ‌త్య చేశార‌ని, ఆ విష‌యాన్ని విచార‌ణ‌లో హంత‌కులు అంగీక‌రించార‌ని కూడా జిల్లా ఎస్పీ వివ‌రించారు. హంత‌కుల‌ను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి ఒక క‌త్తి, హ‌త్య‌కు ఉప‌యోగించిన నాలుగు ఇనుప రాడ్ల‌ను ఆరు సెల్ ఫోన్‌ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

కేవ‌లం ప‌దే ప‌దే డ‌బ్బు కోసం విలేక‌రి స‌త్య‌నారాయ‌ణ త‌మ‌ను బెదిరిస్తుండ‌టంతో దాని నుంచి త‌ప్పించుకునేందుకే ఈ హ‌త్య చేశార‌ని ఫిర్యాదులో హ‌తుడు సోద‌రులు చెప్పిన‌ట్టుగా ఆ పేర్లు ఉన్న వ్య‌క్తుల‌కు, ఈ హ‌త్య‌కు ఎలాంటి సంబంధం లేద‌ని కూడా జిల్లా ఎస్పీ వివ‌రించారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle