newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

ఆంధ్ర‌జ్యోతికి మ‌రో బిగ్ షాక్‌..!

17-10-201917-10-2019 11:03:15 IST
Updated On 17-10-2019 16:41:20 ISTUpdated On 17-10-20192019-10-17T05:33:15.997Z17-10-2019 2019-10-17T05:33:14.530Z - 2019-10-17T11:11:20.469Z - 17-10-2019

ఆంధ్ర‌జ్యోతికి మ‌రో బిగ్ షాక్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌జ్యోతి యాజ‌మాన్యానికి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. ఆంధ్ర‌జ్యోతి సంస్థ‌కు కేటాయించిన భూముల‌ను ర‌ద్దు చేస్తూ కేబినేట్ నిర్ణ‌యం తీసుకుంది. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో విశాఖ‌లోని ప‌ర‌దేశిపాళెం వ‌ద్ద విలువైన భూమిని ఆంధ్ర‌జ్యోతి యాజ‌మాన్యానికి కేటాయించారు.

2017 జూన్ 28న ఒక‌ట‌న్న‌ర ఎక‌రా భూమిని ఆంధ్రజ్యోతి సంస్థ‌కు కేటాయిస్తూ అప్ప‌టి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం ఉత్వ‌ర్వుల‌ను జారీ చేసింది. 1986లో అప్ప‌టి తెలుగుదేశం ప్ర‌భుత్వం తొలుత ప‌ర‌దేశిపాళెంలో ఆంధ్ర‌జ్యోతి యాజ‌మాన్యానికి ఒక‌ట‌న్న‌ర ఎక‌రా భూమిని కేవ‌లం ఎక‌రా రూ.10వేలకే అప్ప‌గించింది. ఆ తరువాత జాతీయ ర‌హ‌దారి విస్త‌ర‌ణ కోసం ఎక‌రా భూమిని ప్ర‌భుత్వం వెన‌క్కు తీసుకుంది.

2014లో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత తిరిగి ఆంధ్ర‌జ్యోతి యాజ‌మాన్యానికి భూముల‌ను అప్ప‌గించేందుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగానే 2017 జూన్ 28న ఒక‌ట‌న్న‌ర ఎక‌రా భూమిని ఆంధ్ర‌జ్యోతి యాజ‌మాన్యానికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది.

50 సెంట్ల భూమిని కేవ‌లం రూ.5వేల‌కు, మ‌రో ఎక‌రం భూమిని రూ.50 ల‌క్ష‌లకు ఆమోద ప‌బ్లికేష‌న్స్‌కు అప్ప‌గించింది. మార్కెట్ విలువ ప్ర‌కారం ఈ భూమి విలువ కోట్ల రూపాయ‌ల్లోనే ఉంటుంది. అయితే భూమి వినియోగానికి సంబంధించి ప్ర‌తి ఏడాది మార్చిలో ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వాల‌ని మూడేళ్ల‌లో భూమిని ఉప‌యోగంలోకి తీసుకురావాల్సి ఉంటుందన్న నిబంధ‌నా ఉంది. ఇంత‌లో ప్ర‌భుత్వం మారిపోయింది.

ఆంధ్ర‌జ్యోతికి కేటాయించిన భూముల‌పై ఆరా తీసిన కొత్త ప్ర‌భుత్వం ఆ భూమిలో ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టలేద‌ని నిర్ధారించింది. అస‌లు ఆ మీడియా సంస్థ‌కు ఎలాంటి ఉప‌యోగం కూడా లేద‌ని ప్ర‌భుత్వం అంచ‌నాకు వ‌చ్చింది. దాంతో బుధ‌వారం జ‌రిగిన కేబినేట్ భేటీలో ఆంధ్ర‌జ్యోతికి కేటాయించిన భూముల‌ను ర‌ద్దు చేస్తూ జ‌గ‌న్ మోహన్‌రెడ్డి స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది.

ఆమోద ప‌బ్లికేష‌న్స్‌కు ఎలాంటి అవ‌స‌రం లేక‌పోయిన‌ప్ప‌టికీ రూ.40 కోట్లు విలువైన భూమిని కారుచౌకగా అప్ప‌గించార‌ని, ఆ భూమిని కేవ‌లం వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోస‌మే వాడేలా ఉన్నార‌ని, అందుకే ఆ కేటాయింపును ర‌ద్దు చేసిన‌ట్టు మంత్రి పేర్ని నాని మీడియా ముందు వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle