newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

ఆంధ్ర‌జ్యోతికి మ‌రో బిగ్ షాక్..!

30-12-201930-12-2019 10:24:08 IST
Updated On 30-12-2019 11:19:23 ISTUpdated On 30-12-20192019-12-30T04:54:08.671Z30-12-2019 2019-12-30T04:54:00.884Z - 2019-12-30T05:49:23.079Z - 30-12-2019

ఆంధ్ర‌జ్యోతికి మ‌రో బిగ్ షాక్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. తిరుమ‌ల‌లో స‌మావేశ‌మైన పాల‌క మండ‌లి టీటీడీ వార్షిక బ‌డ్జెట్‌కు ఆమోదం తెలిపింది. రూ.3,243 కోట్లతో వార్షిక బ‌డ్జెట్‌ను ఆమోదించారు. ప‌లు కీల‌క నిర్ణ‌యాలు కూడా తీసుకున్నారు. ఇటీవ‌ల తిరుమ‌ల విష‌యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ప్పుడు ప్రచారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో దానికి చెక్ పెట్టాల‌ని పాల‌క మండ‌లి నిర్ణ‌యించింది. ఇందుకోసం టీటీడీ ప్ర‌త్యేకంగా సైబ‌ర్ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నారు. తిరుమ‌ల విష‌యంలో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే త‌క్ష‌ణం గుర్తించి చ‌ర్య‌లు తీసుకునేలా సైబ‌ర్ సెక్యూరిటీ విభాగం ప‌నిచేస్తుంద‌ని చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి వివ‌రించారు.

సైబ‌ర్ విభాగానికి సాంకేతిక స‌హ‌కారం అందించేందుకు ప‌లు సంస్థ‌లు సిద్ధంగా ఉన్నాయ‌ని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కొత్త‌గా ఏర్పాటుచేసే సైబ‌ర్ విభాగానికి డీఎస్పీ స్థాయి అధికారిని ప్ర‌త్యేకంగా నియ‌మిస్తామ‌ని వెల్ల‌డించారు. ఈ విభాగాన్ని ఏపీ పోలీసుశాఖతో అనుసంధానం చేస్తామ‌ని, దాని వ‌ల్ల త‌క్ష‌ణ‌మే నిందితులను ప‌ట్టుకుని చ‌ర్య‌లు తీసుకునేందుకు సులువుగా ఉంటుంద‌ని వివ‌రించారు.

జ‌మ్మూ, కాశ్మీర్‌లో శ్రీ‌వారి ఆల‌యం నిర్మించాల్సిందిగా అక్క‌డి ప్ర‌భుత్వం నుంచి విజ్ఞ‌ప్తి వ‌చ్చింద‌ని, అందుకు టీటీడీ సానుకూలంగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు రామిరెడ్డి సుబ్బారెడ్డి వెల్ల‌డించారు. ప్ర‌ధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసికి ప్ర‌త్యేకమైన చ‌రిత్ర ఉన్నందున అక్క‌డ కూడా శ్రీ‌వారి ఆల‌యం నిర్మించ‌బోతున్న‌ట్టు వివ‌రించారు.

తిరుమ‌ల ఘాట్‌రోడ్డును మ‌రింత బ‌లోపేతం చేస్తామ‌న్నారు. ఇందుకోసం ఘాట్‌రోడ్ల‌ను సిమెంట్ రోడ్లుగా మార్చే యోచ‌న ఉంద‌న్నారు. సిమెంట్ రోడ్లు వేసేందుకు అవ‌స‌ర‌మైన స‌హాయం అందించేందుకు టీటీడీ బోర్డులో ఉన్న ఇద్ద‌రు సిమెంట్ కంపెనీల అధిప‌తులు ముందుకు వ‌చ్చార‌ని వైవీ సుబ్బారెడ్డి వివ‌రించారు.

ఘాట్ రోడ్డుకు ప‌దే ప‌దే మ‌ర‌మ్మ‌తులు చేయ‌డం ఇబ్బందిగా ఉంటుంద‌ని, అందుకే శాశ్వ‌తంగా ఉండేలా వాహ‌నాల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా రోడ్లు నిర్మించే యోచ‌న ఉంద‌న్నారు. ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌పై వంద కోట్ల రూపాయ‌ల ప‌రువున‌ష్ట దావా వేస్తున్న‌ట్టు వైవీ సుబ్బారెడ్డి వెల్ల‌డించారు. డిసెంబ‌ర్ 1న ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక వెంక‌న్న వెబ్‌సైట్‌లోకి యేస‌య్య అంటూ ఒక క‌థ‌నాన్ని ప్ర‌చురించిన సంగ‌తి తెలిసిందే.

పూర్తి అవాస్త‌వాల‌తో క‌థ‌నం రాసి భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసినందున ఆ ప‌త్రిక‌పై రూ.వంద కోట్ల ప‌రువు న‌ష్ట దావా వేయాల‌ని పాల‌క మండ‌లి నిర్ణ‌యించిన‌ట్టు వైవీ సుబ్బారెడ్డి వెల్ల‌డించారు. వ్య‌క్తి గ‌తంగా త‌మ‌పై నింద‌లు వేసినా స‌హిస్తామేకానీ.., నేరుగా వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారిపైనే త‌ప్పుడు క‌థనాలురాస్తే స‌హించ‌బోమ‌ని వైవీ సుబ్బారెడ్డి హెచ్చ‌రించారు.

ర‌మ‌ణ దీక్షితుల‌ను ఆల‌య గౌర‌వ ప్ర‌ధాన అర్చ‌కుడిగా నియ‌మిస్తూ పాల‌క మండ‌లి నిర్ణ‌యం తీసుకుంది. ర‌మ‌ణ దీక్షితులను ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుడిగా నియ‌మించిన నేప‌థ్యంలో ఆల‌య అర్చ‌కులు వైవీ సుబ్బారెడ్డిని క‌లిసి త‌మ స‌మ‌స్య‌లను వివ‌రించారు. ర‌మ‌ణ దీక్షితుల నియామ‌కం వ‌ల్ల ఎవ‌రికీ ఇబ్బంది ఉండ‌ద‌ని, అంద‌రూ క‌లిసి స్వామివారి సేవ‌లో త‌రించాల్సిందిగా వారికి వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle