newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

ఆంధ్రా సెంటిమెంట్ బాబుని గెలిపిస్తుందా?

12-03-201912-03-2019 07:17:25 IST
2019-03-12T01:47:25.057Z12-03-2019 2019-03-12T01:46:46.970Z - - 17-07-2019

ఆంధ్రా సెంటిమెంట్ బాబుని గెలిపిస్తుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రా సెంటిమెంటుతో ఈ ఎన్నికల్లో గెలవాలన్న చంద్రబాబు ప్రయత్నం ఫలిస్తుందా. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో సెంటిమెంటుతో మహాకూటమిని దెబ్బతీసిన కేసీఆర్ తరహాలో విజయం సాధించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా? తాజాగా ఆయన కామెంట్స్ చూస్తుంటే... ఈ అనుమానమే కలుగుతోంది. ఎందుకంటే... ప్రతి దానికీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కుట్ర, ఏపీని అణగదొక్కే కుట్ర అంటున్నారు చంద్రబాబు. అప్పట్లో ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మగౌరవం అంటూ జనంలోకి వెళ్తే... ఇప్పుడు ఆంధ్ర ఆత్మగౌరవం అన్న రీతిలో చంద్రబాబు ప్రసంగాలు సాగుతున్నాయి. 

మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీతో పొత్తుకు ప్రయత్నించి భంగపడ్డారు చంద్రబాబు. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఆ ఈక్వేషన్ బెడిసి కొట్టింది. గతంలో తాను ఏ పార్టీతో అయితే పొత్తుకు ప్రయత్నించారో ఇప్పుడు ఆ పార్టీనే తిట్టి పోస్తున్నారు చంద్రబాబు. తెలంగాణ పెత్తందారీ వ్యవస్థ ఏపీకి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. జగన్, కేసీఆర్ కల్సి ఏపీ మీద కుట్ర చేస్తున్నారనీ, తన ప్రాణం ఉన్నంత వరకూ దాన్ని ఎదుర్కొంటానని చెబుతున్నారు చంద్రబాబు. 

ఇదంతా చూస్తుంటే... ఓవైపు గత ఎన్నికల హామీలపై ఎదురు తిరుగుతున్న జనాన్నీ, మరోవైపు జగన్ పార్టీని ఎదుర్కొనేందుకే చంద్రబాబు ఏపీ ఆత్మగౌరవం అంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొన్నటి దాకా మోడీతో స్నేహం చేసి, ప్రత్యేక హోదా వద్దన్న చంద్రబాబు... ఇప్పుడు మోడీని తిడుతూ హోదా కోసం పోరాటం చేయడాన్ని జనం తప్పు పడుతున్నారు.

ఇక పవన్ సపోర్టు కూడా కల్సొచ్చి సీఎం అయిన చంద్రబాబు... ఇప్పుడు అదే పవన్ కల్యాణ్ మీద ఆడిపోసుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న జనం... తన తప్పిదాలను దారి మళ్లించేందుకు చంద్రబాబు ఆంధ్ర సెంటిమెంటును తెర మీదకు తెచ్చినట్లు భావిస్తున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle