newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

ఆంధ్రా మద్యం వ్యాపారులు 'ఛలో తెలంగాణ'!

04-10-201904-10-2019 09:04:01 IST
2019-10-04T03:34:01.313Z04-10-2019 2019-10-04T03:33:58.685Z - - 16-11-2019

ఆంధ్రా మద్యం వ్యాపారులు 'ఛలో తెలంగాణ'!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించేలా కొత్త పాలసీలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా ప్రభుత్వం మద్యం దుకాణాలే కనిపిస్తున్నాయి. ఇందుకుగాను డిగ్రీ చదువుకున్న ఉద్యోగులు, సూపర్ వైజర్లుతో ఎక్సైజ్ శాఖకు అనుసంధానం చేసి ఓ నూతన విధానాన్ని రూపొందించారు. దీని వెనుక మద్యపాన నిషేధం అనే ఆశయం ఉందని ప్రభుత్వం చెప్పుకొస్తున్నా ప్రస్తుతానికైతే ఇన్నాళ్లు ప్రైవేట్ వ్యక్తులకు వెళ్లిన ఆదాయం నిన్నటి నుండి ఏపీ ప్రభుత్వానికి వస్తున్నది కనిపిస్తున్న నిజం.

తెలంగాణలో కూడా పాత మద్యం పాలసీకి గడువు ముగియడంతో కెసిఆర్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకురానుందని.. అది కూడా ఏపీలోలాగానే తెలంగాణలో కూడా ప్రభుత్వం దుకాణాలను నిర్వహించే ఆలోచనలో ఉందని ప్రచారం జరుగుతూ వచ్చింది. దానికి బలం చేకూర్చేలా కొత్త పాలసీని ప్రకటించకుండా కొద్ది రోజులు పాత పాలసీని కొనసాగించారు. అయితే చివరికి ఏమైందో కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మద్యం పాలసీని లైసెన్స్ ఫీజులు పెంచి సరిపెట్టింది. తెలంగాణలో నవంబర్‌ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలు చేయబోతున్నారు.

జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ఖరారు చేసిన టీ సర్కార్ గతంలో ఉన్న 4 స్లాబులను 6 స్లాబులుగా మార్చింది. 5 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షలు, 50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో రూ.55 లక్షలు, లక్ష జనాభా ప్రాంతాల్లో రూ.60 లక్షలు, 50 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు, 20 లక్షల లోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్లుగా లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. దుకాణాల కోసం నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలు చేయగా రాష్ట్రంలో 2216 దుకాణాలకు లాటరీ పద్ధతి ద్వారా దుకాణాదారుల ఎంపిక జరగనుంది.

ముందుగా ఏపీలో జగన్ పాలసీలనే తెలంగాణలో అవలంభిస్తారన్నా చివరికి కెసిఆర్ కాదుపొమ్మన్నారు. కొంత లైసెన్స్ ఫీజులను పెంచి, అవసరమైతే కాస్త మద్యం ధరలను కూడా పెంచితే వచ్చే ఆదాయం చాలనుకున్నారేమో.. లేక ప్రభుత్వం నిర్వహించడం అంటే తలనొప్పులు ఎక్కువ కనుక ఆ పని మాకెందుకు అనుకున్నారో కానీ మరో రెండేళ్లకు పాలసీని ఇచ్చేశారు. అయితే తెలంగాణలో పాత పద్ధతిలో లాటరీ విధానం కావడంతో ఆంధ్రా వ్యాపారులు ఇప్పుడు తెలంగాణకు క్యూ కట్టే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం వ్యాపారమే జీవిత వ్యాపారంగా చేసిన వాళ్లంతా ఇప్పుడు ఛలో తెలంగాణ అనకతప్పదని.. ఈ క్రమంలో పోటీ కూడా ఎక్కువే ఉంటుందని ఆ ఫీల్డ్ లో అనుభవమున్న వ్యాపారాలు భావిస్తున్నారు. పోటీ పెరిగితే నాన్ రిఫండబుల్ దరఖాస్తుల కిందే కోట్లు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఏపీ పాలసీ తెలంగాణకు పంట పండినట్లే కదా! కానీ రాష్ట్రం నుండి మరో రాష్ట్రం ఏం  వస్తార్లే అంటారా? ఎంతైనా పాత అలవాటు అంత సులభంగా పోదుకదా! అందునా మద్యం ఇచ్చే కిక్కే వేరు.. దానిపై వచ్చే ఆదాయమే వేరు! 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle