newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

ఆంధ్రా పాలిటిక్స్‌లో 'సోషల్ మీడియా’ మంట!-2

05-10-201905-10-2019 13:25:04 IST
2019-10-05T07:55:04.167Z05-10-2019 2019-10-05T07:54:59.700Z - - 09-12-2019

ఆంధ్రా పాలిటిక్స్‌లో  'సోషల్ మీడియా’ మంట!-2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
(మొదటి భాగం తరువాయి)

ఆంధ్రా పాలిటిక్స్‌లో  'సోషల్ మీడియా’ మంట!-2

అయితే ప్రభావం తెలిసిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ చేస్తున్న సోషల్ ప్రచారాన్ని ఆదిలోనే తొక్కేయాలని కంకణం కట్టుకున్నట్లుగా ఉంది. ఇందుకోసం ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పని హెచ్చరించింది. ఏకంగా కొంతమందిపై సంబంధం లేని కేసులలో ఇరికించి సెంట్రల్ జైలుకి తరలించారని సాక్షాలతో సహా టీడీపీ ఆరోపణలు చేస్తుంది. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు రెండు గంటలపాటు గుంటూరు పార్టు కార్యాలయంలో ఈ టాపిక్ మీదనే మీటింగ్ పెట్టారు.

కృష్ణాజిల్లా కపిలేశ్వరపురంకి చెందిన రావి కృష్ణవంశీ, ఆతుకురుకి చెందిన బొబ్బిలి శరత్‌చంద్రరాయ్‌, అదే జిల్లాకు చెందిన, శ్రీకాకుళం జిల్లా సరసనపల్లికి చెందిన పణతల హరికుమార్, తిరుపతికి చెందిన మాజీ ఎంపీపీ, గుంటూరు జిల్లాకు చెందిన ఓ మాజీ సర్పంచ్, చదువుకుంటున్న కొందరు యువకులు.. ఇలా ఎందిరిపైనో సంఘవిద్రోహ, మత కల్లోలాలు, ప్రభుత్వాలను కించపరచడం వంటి సెక్షన్ల కింద కేసులు పెట్టి వారం నుండి రెండు వారాలు బెయిల్ దొరకకుండా భయకంపితులను చేశారని చెప్పుకొచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఎక్కడో దొరికిన ప్రభుత్వ విమర్శ పోస్టును జస్ట్ షేర్ చేసిన వారే కావడం విశేషం.

ఇక ఇదే క్రమంలో ప్రతిపక్ష టీడీపీ నేతలు.. వారి మీటింగులు, మార్ఫింగులు, కొందరు మహిళా నేతలను నీచాతినీచంగా ఇదే సోషల్ మీడియాలో పోస్టులు బహిరంగగానే కనిపించాయి. సాక్షాత్తు ముఖ్యనేతల సొంతఖాతాలకే ఇష్టారీతిన బూతుపురాణాలను లంకించుకుంటున్నారు. వీటిపై టీడీపీ యాభైకి పైగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూస్తే ప్రజలను ప్రతిభావంతులను చేయాల్సిన ఇంటర్ నెట్, ప్రభావితం చేయాల్సిన సోషల్ మీడియా రాష్ట్రంలో మంటలు పెడుతున్నట్లుగా ఉంది. ఈ మంటల నుంచి ఆయాపార్టీలు చలి కాచుకోకుండా ఉంటే మంచిది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle