newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

ఆంధ్రా పాలిటిక్స్‌లో 'సోషల్ మీడియా' మంట!-1

05-10-201905-10-2019 13:15:02 IST
2019-10-05T07:45:02.702Z05-10-2019 2019-10-05T07:44:59.026Z - - 06-12-2019

ఆంధ్రా పాలిటిక్స్‌లో  'సోషల్ మీడియా' మంట!-1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు సోషల్ మీడియా మంట పెడుతుంది. గతంలో వార్తా పత్రికలు, టీవీ ఛానెళ్ల ద్వారా మాత్రమే ప్రజలు ప్రభావితమయ్యేవారు. క్రమేపీ వాటి వాటాలో కొంతభాగం వెబ్ మీడియా ఆక్రమించింది. చదువుకున్న యువత మాత్రమే వెబ్ మీడియా మీద దృష్టి పెడతారు కనుక దాని ప్రభావంలో హెచ్చుతగ్గులు లేకుండా కొనసాగుతుంది. అయితే గత ఐదేళ్లుగా సోషల్ మీడియా అన్నిటిని మించి రాజ్యాన్ని ఆక్రమించేంసింది. మంచైనా చెడైనా ఇక్కడ సెకండ్ల వ్యవధిలో కోట్ల మందికి చేరగలిగే సత్తా ఈ మీడియా సొంతం చేసుకుంది. అందుకే ఎక్కడైనా ప్రభుత్వాలు అణచివేయాలంటే ముందుగా సోషల్ మీడియా మీద దృష్టి పెట్టి ఎక్కడిక్కడ కత్తిరించి పారేస్తోంది.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండు ముక్కలైన తర్వాత జరిగిన తొలి ఎన్నికలలో కొద్దిమేర ప్రభావం (అది టీడీపీకి అనుకూలం) చూపిన ఈ సోషల్ మీడియా మొన్నటి 2019 ఎన్నికలలో మాత్రం కీలక పాత్ర పోషించింది. ఇందుకోసం అన్ని ప్రధాన పార్టీలు బయటకు చెప్పుకోలేనంత మొత్తంలో కోటానుకోట్ల ఖర్చుపెట్టేశాయి. పేస్ బుక్, వాట్స్ యాప్, ఇనిస్ట్రాగ్రామ్, ట్విట్టర్, బ్లాగ్స్ ఫ్లాట్ ఫామ్ ఏదైనా సరే ముందుగా గ్రూపులు క్రియేట్ చేసి, వాటిని నెమ్మదిగా జనంలోకి వదిలి, వ్యతిరేకమైనా, అనుకూలమైనా గట్టిగా జనాలలో ముద్రవేసేయడం వీటి వృత్తి. ఇందుకోసం ప్రతిపార్టీలో ఎక్సపర్ట్స్ లను నియమించుకొని మరీ సోషల్ మీడియా వింగ్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారంటే దీని ప్రభావం ఎంతవరకు వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఏపీ విషయానికి వస్తే మొన్నటి సాధారణ ఎన్నికలలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా ప్రచారం మీద గట్టిగానే దృష్టి పెట్టింది. 2014 ఎన్నికలలో జగన్ అవినీతి కేసులు విస్తృతంగా ప్రజలలోకి వెళ్ళింది ఈ సోషల్ మీడియా ద్వారానే అని కొందరు వైసీపీ నేతలకు నమ్మకం. అందుకే మొన్నటి ఎన్నికలలో ఎప్పటికప్పుడు అధికార టీడీపీ వైఫల్యాలను, స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల దగ్గర నుండి సామాన్య కార్యకర్త వరకు టీడీపీ వాళ్ళపై ఫోకస్ పెట్టి ఎండగట్టింది.

ఒక్కమాటగా చెప్పాలంటే  ప్రభుత్వం ఏంచేసినా అందులో నెగటివ్ వెతికి చాపకింద నీరులా రాష్ట్రం మొత్తం వ్యాపింపచేసేసింది. ఇందుకోసం అప్పుడు పదుల సంఖ్యలో టీమ్స్ పనిచేస్తే అందుకు పీకే గ్రూప్ నేతృత్వం వహిస్తోందని అప్పుడే టీడీపీ నేతలు గగ్గోలు పెట్టేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి పడ్డాక కూడా సోషల్ మీడియా మీద దృష్టి పెట్టాలని కొందరు నేతలు చీఫ్ చంద్రబాబుకి మొత్తుకుంటున్నా పెద్దగా పట్టించుకోవడం లేదని ఆ పార్టీలో నేతలు కొందరు విసుక్కుంటున్నారు కూడా. కానీ స్థానికంగా ఉండే గ్రూపులు, కొద్దిమేర జిల్లాల నేతలు మెయింటైన్ చేస్తున్న సోషల్ మీడియా వింగ్స్, అడపాదడపా హైకమాండ్ ద్వారా నడుస్తున్న కొద్దిపాటి వింగ్స్ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిన తొలి రోజు నుండే ఫోకస్ చేశాయి. (ఇంకా ఉంది)


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle