newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 108 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 2099 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

ఆంధ్రాబ్యాంకు ఇక కనుమరుగేనా?

31-08-201931-08-2019 08:57:58 IST
Updated On 31-08-2019 11:29:24 ISTUpdated On 31-08-20192019-08-31T03:27:58.083Z31-08-2019 2019-08-31T03:27:50.600Z - 2019-08-31T05:59:24.054Z - 31-08-2019

ఆంధ్రాబ్యాంకు ఇక కనుమరుగేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రాబ్యాంకు...తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్న ఆర్థిక సంస్థ. త్వరలో ఆంధ్రాబ్యాంకు పేరు దేశంలో ఎక్కడా కనిపించకపోవచ్చు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం మీడియా సమావేశంలో ప్రభుత్వ బ్యాంకుల విలీనం గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విలీన ప్రతిపాదనలు అమల్లోకి వస్తే తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో బ్యాంకు కనుమరుగు కానుంది. 

Image result for andhra bank founder

ఇప్పటికే  తెలుగు రాష్ట్రాలకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ...స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనంతో తన ఉనికిని కోల్పోయింది. అదే బాటలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో విలీనమైతే ఆంధ్రా బ్యాంకు కూడా కనుమరుగు కావచ్చు.

మొండిబాకీల భారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విలీనాలకు తెర తీసిన సంగతి తెలిసిందే. దక్షిణాదిలో గట్టి పట్టు ఉన్న బ్యాంకులను విలీనం చేసుకునేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ గతేడాదే ప్రయత్నాలు చేసింది. 

అయితే పీఎన్బీ కంటే యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనం చేయాలని కేంద్రం నిర్ఱయించింది. దీంతో ఇక ఆంధ్రాబ్యాంక్ అనే పేరు కనిపించదు. ఆంధ్రాబ్యాంకుకి ఘనమయిన చరిత్రే వుంది.

భారత దేశపు వాణిజ్య బ్యాంకులలో ఆంధ్రా బ్యాంకు ఒకటి. ఈ బ్యాంకును 1923, నవంబరు 20 న ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, మేధావి భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో స్థాపించారు.

1980లో ఈ బ్యాంకుని జాతీయం చేశారు. 1981లో క్రెడిట్ కార్డులను జారీ చేయుటం ద్వారా భారత దేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను ఈ బ్యాంకు పరిచయం చేసిన ఘనతను సాధించింది. 2003 నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించింది. 2007లో బయోమెట్రిక్ ఏటిఎంలను భారతదేశానికి పరిచయం చేసింది ఆంధ్రాబ్యాంకే కావడం విశేషం. 2007 సెప్టెంబర్ నాటికి ఈ బ్యాంకు 1,289 శాఖలను కలిగి ఉంది. అందులో గ్రామీణ శాఖలే ఎక్కువగా వున్నాయి. 

అంతేకాదు, వందలాది ఎక్స్‌టెన్షన్ శాఖలతో, 37 శాటిలైట్ ఆఫీసులతో, 505 ఏటిఎంలతో, 22 రాష్ట్రాలలో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉంది. పెట్టుబడులను రాబట్టటంలో ఈ బ్యాంకు ఆసియాలోనే ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశం మొత్తంలో ఈ బ్యాంకుకు 1,30,000 షేర్‌హోల్డర్స్, 1.4 కోట్ల ఖాతాదారులు ఉన్నారు. ప్రారంభం నుండి నేటి వరకు మొత్తం ఋణాలలోకనీసం 50 శాతానికి తగ్గకుండా ఋణాలను గ్రామీణ భారతానికే అందిస్తున్నబ్యాంక్ ఆంధ్రాబ్యాంక్. 

మన దేశంలో బ్యాంకుల జాతీయం చేసిన తర్వాత క్రమబద్దంగా నడుస్తున్న జాతీయ బ్యాంకులలో ఇది ప్రధానమైనది.ఆంధ్రాబ్యాంకు ద్వారా వ్యవసాయదారులకు రుణాలిచ్చి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడిన ఘనత భోగరాజు పట్టాభి సీతారామయ్యకే దక్కింది.

చిన్న మొత్తంలో డిపాజిట్లు సేకరించి పొదుపును ప్రోత్సహించారాయన. ఆయన స్థాపించిన ఆంధ్రాబ్యాంకు దినదిన ప్రవర్థమానమై... వేలాదిమందికి ప్రత్యక్షంగా లక్షలాదిమందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఆంధ్రాబ్యాంకు విలీనం వల్ల 20 వేలమంది యూనియన్ బ్యాంకు ఉద్యోగులుగా మారతారు. ఆంధ్రాబ్యాంకు కనుమరుగు అవుతుందన్న వార్తతో తెలుగు రాష్ట్రాల్లోని ఆబ్యాంకు ఖాతాదారులు ఆవేదన చెందుతున్నారు. 

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

   11 hours ago


బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో  ఘటన

బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో ఘటన

   11 hours ago


మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

   13 hours ago


ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

   17 hours ago


మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

   17 hours ago


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

   19 hours ago


ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   a day ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   a day ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   a day ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle