newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

ఆంధ్రాకు అప్పు రెడీ

29-12-201829-12-2018 17:42:30 IST
2018-12-29T12:12:30.150Z29-12-2018 2018-12-29T11:48:08.868Z - - 27-05-2020

ఆంధ్రాకు అప్పు రెడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ‘అమరావతి’ అభివృద్ధి కోసం ఏపీ సర్కారు ప్రపంచ బ్యాంకు రుణంపై భారీ ఆశలే పెట్టుకుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రుణం త్వరలో విడుదల కానుంది. మొత్తం 500 మిలియన్ల అమెరికన్ డాలర్లు (రూ.3500 కోట్లు) రుణంగా అందనుంది. ప్రపంచ బ్యాంకు ఏపీ నూతన రాజధానికి 500 మిలియన్ డాలర్ల రుణం మంజూరు చేయటానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. అందులో 200 మిలియన్ డాలర్లు ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు (ఏఐఐబి) కో ఫైనాన్స్ చేయనుంది. గత ఏడాది మే 25న కొంతమంది రైతులు ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారు. అమరావతి రాజధాని నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలో తమ జీవనాధారం దెబ్బతినటంతో పాటు…పర్యావరణం, ఆహార భద్రతకు కూడా ముప్పు ఉంటుందని ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచే ఈ రుణ ప్రక్రియ నిలిచిపోయింది. ఇఫ్పటికే అమరావతిలో మౌలికసదుపాయాల కల్పనకు ఏపీ సర్కారు భారీ ఎత్తున అప్పులు తీసుకువస్తోంది. ప్రపంచ బ్యాంకు రుణం అయితే తక్కువ వడ్డీ ఉంటుంది. త్వరలో ఈ రుణానికి సంబంధించిన ప్రకటన త్వరలో విడుదల కానుందని సీఆర్డీయే అధికారి ఒకరు వెల్లడించారు. 

ఏపీసీఆర్డీయే 2016లోనే 1 బిలియన్ డాలర్ల వరల్డ్ బ్యాంకు రుణం కోసం ప్రతిపాదన పంపించింది. ఆ తర్వాత ఆ మొత్తాన్ని 500 మిలియన్ డాలర్లుగా సవరించింది. అమరావతి కోసం ఏపీ సర్కారు ల్యాండ్ పూలింగ్ మోడల్ కింద రికార్డు స్థాయిలో 33 వేల ఎకరాలు సేకరించిన విషయం తెలిసిందే. దీనిపైన రైతుల నుంచి పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇక్కడ కొత్త రాజధాని నిర్మించటం వల్ల పర్యావరణంపై…అక్కడి ప్రజల జీవన స్థితిగతులపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశాలను మదింపు చేసిన తర్వాత కానీ ప్రపంచ బ్యాంకు తుది నిర్ణయం తీసుకోలేదు. రైతుల ఫిర్యాదుని క్షుణ్ణంగా పరిశీలించిన వరల్డ్ బ్యాంకు ఒక బృందాన్ని అమరావతికి పంపించింది. రైతులనుంచి వచ్చిన ఆరోపణలపై నవంబర్ 2017లో...ఆరునెలల పాటు విచారణ నిర్వహించారు. జూలై 2018లో నివేదిక పంపారు. సంతృప్తి చెందిన వరల్డ్ బ్యాంకు ప్రస్తుతం 500 మిలియన్ డాలర్లు రుణానికి అంగీకారం తెలిపింది. ఈ రుణం మంజూరైతే.. మరికొద్ది రోజుల తర్వాత మరో  500 మిలియన్ డాలర్లు కోసం దరఖాస్తు చేయనున్నారు.

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   12 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   14 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   17 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   18 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   19 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   20 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   20 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   21 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   21 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle