newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ఆంధ్రప్రదేశ్ లో అణు విద్యుత్ కేంద్రం

22-09-202022-09-2020 15:19:33 IST
2020-09-22T09:49:33.424Z22-09-2020 2020-09-22T09:49:15.020Z - - 30-10-2020

ఆంధ్రప్రదేశ్ లో అణు విద్యుత్ కేంద్రం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అణు విద్యుత్ కేంద్రం అతి త్వరలోనే రాబోతోంది. అణు విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో నిర్మించనున్నట్టు  కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అణు విద్యుత్ కేంద్ర ఏర్పాటుకు సంబంధించి రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్రం స్పష్టతను ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద ఈ ప్లాంటును నిర్మించబోతున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పలు పరిశోధనలు, పరిశీలనలు నిర్వహించిన తర్వాతనే తాము ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు సూచించిన అర్హతల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ప్లాంటులో ఏర్పాటు చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్మించబోయే పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం అమెరికాకు చెందిన 'వెస్టింగ్ హౌస్ ఎలెక్ట్రిక్' సంస్థతో చర్చలు జరుపుతున్నామని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. 

అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు సూచించిన అర్హతల ప్రకారమే శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేశామని కేంద్రం చెప్పింది. ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసింది. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశ పర్యటనకు వచ్చిన సందర్భంలో కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఇప్పటికే 2,700 ఎకరాలను సేకరించారు. నిర్మాణంలో భాగంగా ఆరు అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 61 వేల కోట్ల అంచనాలతో ప్రతిపాదనలను రూపొందించారు.


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle