newssting
BITING NEWS :
*ప్రధాని నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ.. లాక్ డౌన్ పై చర్చ *మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహరంలో తుది తీర్పు .. వెంటనే విధులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం *కొండపోచమ్మ జలాశయం ప్రారంభం. సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభం.. ఇదో ఉజ్వల ఘట్టం అన్నకేసీయార్ *కరోన ఇప్పుడే పోయేది కాదు..సౌదీ అరేబియా నుండి వందలాది మంది వస్తున్నారు..కరోన అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదు..ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి : ఈటల *ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే 50కి పైగా కేసులలో చుక్కెదురైనా పద్ధతి మార్చుకోవడం లేదు..రమేష్ ని మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం : సీఎం రమేష్ - ఎంపీ *ఏపీలో కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి.3330 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.కరోనాతో 60 మంది మృతి * చోటా కె.నాయుడు సోదరుడు అరెస్ట్..ఎస్.ఆర్.నగర్‌లో శ్యామ్ కె. నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు..ఆర్టిస్ట్ సుధను పెళ్లిపేరుతో మోసం చేశాడని ఆరోపణ..సుధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు*భారత్ లో విజృంభిస్తున్న కరోనా. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త కరోనా కేసులు. 175 మంది మృతి. దేశవ్యాప్తంగా 1,65,799 కి చేరిన కరోనా కేసులు. 89,987 యాక్టివ్ కేసులుండగా, 71,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మొత్తం 4,706 కరోనా మరణాలు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమిత్ షా బహిరంగ లేఖ

14-02-201914-02-2019 16:25:55 IST
2019-02-14T10:55:55.402Z14-02-2019 2019-02-14T10:55:50.657Z - - 29-05-2020

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమిత్ షా బహిరంగ లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!

తెలుగుదేశం నాయకుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి వీధి నాటకాలకు తెరతీశారు. ఆయన రాజకీయ భవిషత్తు రోజురోజుకీ త్వరితగతిన మృగ్యమయిపోతున్న నేపథ్యంలో, పత్రికలలో పతాక శీర్షికలలో చోటు సంపాదించుకునేందుకు నిస్పృహపూరిత ప్రయత్నాలు అందరికీ విదితమే.

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలలో విశ్వసనీయతను పోగొట్టుకున్నానని చంద్రబాబు నాయుడుగారికి బాగా తెలుసు. అందువలనే వివిధ వర్గాల ప్రజలకు వరుసగా రకరకాల తాయిలాలను ప్రకటిస్తున్నారు. రాబోయే ఎన్నికలలో ఓడిపోవటం ఖాయమని పసిగట్టి, రకరకాల యూ టర్న్ లను తీసుకోవడంతోపాటు, ప్రజల దృష్టిని మరల్చేందుకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద మరియు కేంద్ర ప్రభుత్వం మీద దురుద్దేశ పూరక ప్రచారాన్ని చేస్తున్నారు. ప్రధాన మంత్రి గారి మీద వ్యక్తిగత దాడిలో చాలాదూరం వెళ్లారు. వారు రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో వారికి స్వాగతం పలికే కనీస మర్యాదను కూడా పాటించలేదు.

ఏది ఏమైనప్పటికీ, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన పడుతున్న ఆరాటాన్ని విజ్ఞులు మరియు రాజకీయ చైతన్యం కలిగిన ప్రజలు అర్ధం చేసుకొనగలరు. రాష్ట్ర ప్రయోజనాలను మరచి ఏక పక్షంగా, అశాస్త్రీయంగా, తొందరపాటుగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినందుకు చంద్రబాబు గారికి తగిన గుణపాఠాన్ని విజ్ఞులు చెబుతారు. 1984లో అప్రజాస్వామికంగా యన్. టి. రామారావు గారిని కాంగ్రెస్ పార్టీ ఎలా పదవీచ్యుతుడ్ని చేసిందో ప్రజలు ఎపుడు గుర్తుంచుకుంటారు.

ఏ కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై యన్. టి. రామారావు గారు పార్టీని నిర్మించారో, ఆ పునాదులను తన పదవి వ్యామోహంతో ఈ తెలుగు దేశం పార్టీ నాయకుడు చంద్రబాబు గారు సమూలంగా నాశనం చేసారు. రాష్ట్ర విభజనలో ఏ కాంగ్రెస్ అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను మోసం చేసిందో, అదే కాంగ్రెసుని మరలా అధికారంలోనికి తీసుకుని వచ్చేందుకు ఈ తెలుగు దేశం పార్టీ అధినేత పనిచేస్తున్నాడు. ఆయన చేష్టలు రాజకీయ అవకాశవాదానికి పరాకాష్ట.

యన్.డి.ఎ. ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని ఆయన అసెంబ్లీలో, పార్టీ సమావేశాల్లో, బహిరంగ వేదికల మీద మరియు పత్రిక సమావేశాల్లో శ్లాఘించారు. అంతే కాకుండా, ప్రత్యేక హోదా సంజీవిని కాదు అనీ, అది ఉన్న రాష్ట్రాలు ఏమి అభివృద్ధి చెందలేదని కూడా ప్రకటించారు. ఆ సమయంలో ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్న పార్టీలను విమర్శించి, హోదా కొరకు ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ కూడా చేయించారు. అయినా, పూర్తి యూ-టర్న్ తీసుకుని, ఇపుడు ఆ అంశాన్ని ఆయనే ఎత్తుకున్నారు. రాబోయే ఎన్నికలలో అనిశ్చిత ఫలితాలతో బేజారెత్తి, హేయమైన జిమ్మిక్కులతో, వాస్తవాల వక్రీకరణతో, తప్పుడు ఆరోపణలతో బి.జె.పి. ఆధ్వర్యంలోని యన్. డి.ఎ ప్రభుత్వం మీద మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి మీద దాడి చేస్తున్నారు.

అవిభక్త ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలయిన తెలంగాణా, కోస్తా మరియు రాయలసీమ ప్రజల ఆకాంక్షల గురించి కాంగ్రెస్ ఎపుడూ ఆలోచించలేదని గుర్తించాలి. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల గురించి ఈషణ్మాత్రం శ్రద్ద, నిజాయితీ ఉన్నా, ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యస్తీకరణ చట్టంలోనే యూ. పి . ఎ . ప్రభుత్వం ప్రత్యేక హోదాని చేర్చి ఉండేది. అలానే, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్ర ప్రదేశ్ లో కలిపి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని శీఘ్ర గతిన పూర్తి చేసేందుకు యూ.పి.ఎ . ప్రభుత్వం ఎందుకు దోహద పడలేదు? ఈ మేరకు ఎందుకు ఆర్డినెన్సుని జారీ చేయలేదు? ఎవరినయినా తప్పుపట్టే ముందు చంద్రబాబు నాయుడుగారు మరియు కాంగ్రెస్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. అప్పటి దాకా , కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వారికీ లేదు.

యు.పి.ఎ. ప్రభుత్వంలా కాక, మోడీ గారి ప్రభుత్వం మే 2014 లోనే ఏడు మండలాలలో ఉన్న 222 గ్రామాలను ఆర్డినెన్సు ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో కలిపి, పోలవరం నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేసింది. కేంద్ర ప్రభుత్వం తనంతట తానే తీసికొన్న ఈ చొరవను కూడా చంద్రబాబు గారు తన ఖాతాలో వేసుకున్నారు. యన్.డి.ఎ  అధికారం చేబట్టిన తర్వాత జరిగిన మొదటి పార్లమెంట్ సమావేశంలోనే పోలవరం ఆర్డినెన్సు బిల్ ను ఆమోదించడం జరిగింది. అంతే  కాకుండా, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడింది. ఎక్కడా లేని విధంగా, ఆ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థన మేరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మీద యన్.డి.ఎ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఈ చర్యల వలన విదితమవుతోంది. కేవలం మాటలు కావనీ అర్ధమవుతుంది.

చట్టంలో పేర్కొనబడిన విధంగా, పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించబడింది. ఆ రోజుకు ఇరిగేషన్ ప్రాజెక్టుకు 1-4-2014 నుండి అయిన 6,764.70 కోట్ల రూపాయల తేడాను కూడా విడుదల చేయబడింది. ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ చట్టంలో ఉన్న వివిధ అంశాలను పూర్తి చేసే విషయంలో, చంద్రబాబు గారు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఉన్నారు. నిజానికి, మోడీ గారి ప్రభుత్వం ఇవ్వబడిన హామీలను రికార్డు సమయంలో నెరవేర్చటమే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని శీఘ్రతరం చేయడానికి చాలా ముందుకే వెళ్లారు. ఆంధ్ర ప్రదేశ్ కు చేయూత ఇచ్చే అంశానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు.

తనకున్న సహజగుణం ప్రకారం, కూటమి ధర్మాన్ని, నిమయాలను తుంగలో తొక్కి; మిత్రులను వెన్నుపోటు పొడిచి; స్వార్ధపూరిత రాజకీయ ఆరోపణలు చేపట్టారు. యన్.డి.ఎ తో సంబంధాలను తెగతెంపులు చేసుకున్న మరుసటి క్షణం నుండి తన రాజకీయ భవితవ్యం కొరకు యన్.డి.ఎ ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలను చేస్తున్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, తాను ప్రజలకు ఇచ్చిన జనాకర్షణ పధకాలను నెరవేర్చే విషయంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, అకారణంగా కేంద్రం మీద నెపం మోపుతున్నారు. ఈ సందర్భంగా చెప్పవలసిన అంశం ఏమిటంటే, 2017లో జరిగిన ఒక యన్.డి.ఎ సమావేశంలో యన్.డి.ఎ సాధించిన అభివృద్ధి ఎజండాతోనే మోడీ గారి ఆధ్వర్యంలో 2019 ఎన్నికలను ఎదుర్కోవాలనే తీర్మానాన్ని ఆయనే ప్రతిపాదించి, ఆమోదింప చేయడంలో చొరవ తీసుకున్నారు.

చంద్రబాబు గారిలో కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తుందని మనందరికీ తెలుసు. కానీ, కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాన మంత్రికి మరియు బి.జె.పి.కి వ్యతిరేకంగా ఇంత ద్వేష పూరిత ప్రచారాన్ని చేపట్టడంలో, అబద్దాలు చెప్పడంతో, అవాస్తవాలను వ్యాప్తి చేయడంలో కాంగ్రెస్ నే మించి పోతారని ఎపుడు ఊహించలేదు. తాను ఇచ్చిన ఎలెక్షన్ల హామీలను నెరవేర్చటంలో విఫలమయి రానున్న ఎన్నికలలో ఖాయంగా ఓడిపోతానని తెలిసి; తాను తీసుకున్న యూ-టర్న్ ని సమర్ధించుకునేందుకు లేనిపోని కట్టుకథలు వ్యాప్తి చేయటమే మమ్మల్ని దిగ్భ్రాంతులను చేసింది.

అంతకన్నా ఘోరం ఏమిటంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక సహాయాన్ని వక్రీకరిస్తున్న విధానం మాకు అత్యంత దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఎన్నో సందర్భాలలో, ప్రత్యేక హోదాకు బదులు ఇవ్వబడిన ప్రత్యేక ప్యాకేజీని ఆయన శ్లాఘించారు. మార్చి 16, 2017 నాడు అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించటం గుర్తు చేసుకొనవలసి ఉంటుంది. ప్రత్యేక హోదాలో వచ్చే ప్రతీ ప్రయోజనం, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ద్వారా వస్తుందని కూడా ఆయన ఆరోజు చెప్పారు. వాస్తవానికి రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ఆమోదించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానాన్ని కూడా ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ చేసింది.

ఆ సందర్భంలో, తెలుగు దేశం పార్టీకి సంబందించిన అగ్రనాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రత్యేక హోదా సంజీవని కాదనీ, ప్రత్యేక ప్యాకేజీ ద్వారానే ఎక్కువ లాభాలు కలుగుతాయని పేర్కొన్నారు. ఇదే అంశాన్ని శాసన సభలో పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా వలనే ప్రత్యేక టాక్స్ రాయితీలు వస్తాయనే ప్రతి పక్షాల వాదనను కూడా చంద్రబాబు గారు కొట్టివేసారు. వారిని తమ వాదనను రుజువు చేయమని సవాలు కూడా విసిరారు.

తనకు అనుకూలంగా ఉండే మీడియా సహాయంతో అన్ని వేదికల మీద తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. చివరకు తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ కు తాకట్టు పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగు ప్రజలకు గుర్తు చేయవలసిన అంశం ఏమిటంటే ఇదే చంద్రబాబు గారు గతంలో ఆంధ్ర ప్రదేశ్ కు ఎందుకు వస్తున్నారని, ఏ లక్ష్యం కొరకు వస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని తీవ్రంగా విమర్శించారు.

తన వైఫల్యాలు, తప్పిదాలు బయట పడతాయనే భయాందోళనలు పట్టుకున్నాయని   తేటతెల్లమవుతోంది. ఇపుడు అందుకోసమే, ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన, ప్రతి వ్యవస్థను ద్వంసం చేసిన, ఎన్నో కుంభకోణాలలో తలమునక మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అంగీకరించే స్థాయికి చంద్రబాబు గారు దిగజారిపోయారు. 1984లో ప్రజల చేత ఎన్నుకోబడిన తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి అయిన తన స్వంత మామ యన్. టి. రామారావుగారి ప్రభుత్వాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీ; ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు ఆయన చేతులు కలుపుతున్నారు..

ఏ మౌలిక సూత్రాల మీద అయితే తెలుగు దేశం పార్టీ నిర్మించబడిందో, వాటిని భూస్థాపితం చేస్తున్న ప్రస్తుత తెలుగు దేశం పార్టీ నాయకత్వపు దురాలోచనలను గమనించవలసినదిగా విజ్ఞులైన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను కోరుకుంటున్నాను. ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ చట్టంలో వివిధ అంశాలను అమలు పరచేందుకు 10 సం.ల కాలవ్యవధి ఉన్నప్పటికీ, వివిధ విద్యా సంస్థల, అభివృద్ధి పధకాల మరియు మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టులను త్వరితగతిన శాంక్షన్ చేయటమే కాకుండా, వాటిని కార్యరూపంలో పెట్టేందుకు కావలసిన నిధులను కూడా ఎన్.డి .ఏ ప్రభుత్వం విడుదల చేసింది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇన్ని ప్రాజెక్టులను శాంక్షన్ చేయలేదు. ఈ ఒక్క నిజం చాలు ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి చేసేందుకు ఎన్.డి.ఏ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వున్నదో చెప్పడానికి.

ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 93వ సెక్షన్ 13వ షెడ్యూలు ప్రకారం 10 సం.ల కాలవ్యవధిలో 2 రాష్ట్రాల ప్రగతికి పేర్కొనబడిన అన్ని అంశాలకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి వుంది. సెక్షన్ 93, 13వ షెడ్యూల్ లోని 11 విద్యా సంస్థల విషయంలో, 10 విద్యా సంస్థలు నిర్దేశింపబడిన వ్యవధి కన్నా ముందే పని చేయటం ప్రారంభించాయి. గిరిజన విశ్వవిద్యాలయం కూడా మార్గంలో వుంది. ఈ 10 సంస్థలు: IIT, NIT, IIM, IISER, IIIT, AIIMS, కేంద్రీయ విశ్వవిద్యాలయం, పెట్రోలియం విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిసాస్టర్ మేనేజ్ మెంట్ (NIDM).

చట్టంలోని 8 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో, ఆరు మాసాల లోపు సాధ్యాసాధ్యాలను (ఫీజిబిలిటీ) పరిశీలించాలని పేర్కొన బడింది. మిగిలిన రెండు ప్రాజెక్టులను 10 సం.ల  లోపల ప్రారంభించాలని చెప్పబడింది. సాధ్యాసాధ్యాల అధ్యయన అనంతరం, 5 ప్రాజెక్టుల విషయంలో చర్యలు ప్రారంభం చేయబడ్డాయి. మిగిలిన 3 ప్రాజెక్టు లకు అనుకూలమైన నివేదికలు రానప్పటికీ, ఇతర ప్రత్యామ్నాయాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.

HPCL - GAIL ఆధ్వర్యంలో కాకినాడ వద్ద గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం కాంప్లెక్స్ స్థాపించబడనున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు లక్ష కోట్ల రూపాయలకు మించి ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులను పెట్టేందుకు ప్రతిపాదించాయి. ఇందులో 39,145 కోట్ల రూపాయల వ్యయంతో గ్రీన్ ఫీల్డ్ పెట్రో కెమికల్ సముదాయం కూడా వున్నది. దీని కొరకు ఇప్పటికే HPCL మరియు GAIL సంస్థలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగిపోయింది.

విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ ను శీఘ్రగతిన చేపట్టేందుకు కేంద్రం ఇప్పటికే నిర్ణయించుకుంది. మొదటి విడతగా ఈస్టుకోస్టు ఎకనామిక్ కారిడార్ కు సంబందించిన 800 కి. మీ. ల పొడవైన విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ను చేపట్టడం జరిగింది. ఈ VCIC కొరకు ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు 631 మిలియన్ల అమెరికన్ డాలర్లను ఆమోదించింది. ఇందులో మొదటి విడతగా 370 మిలియన్ల అమెరికన్ డాలర్లను కూడా విడుదల చేయడం జరిగింది. కృష్ణపట్నం - చెన్నై - బెంగళూరు గ్రోత్ కారిడార్ ను శాంక్షన్ చేయడం జరిగింది. విజయవాడ, విశాఖపట్నం మరియు తిరుపతి విమానాశ్రయం లను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా చేయడంతోపాటు రాజమండ్రి విమానాశ్రయంలో రాత్రి సమయాలలో కూడా విమానాలు దిగే సదుపాయాన్ని కల్పించడం జరిగింది. రాజమండ్రి విమానాశ్రయంలో 'రన్ వే' ను విస్తరణ చేయడమే కాకుండా కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించడం జరిగింది.

అలానే ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని నుండి హైదరాబాద్ కు మరియు ఆంధ్ర ప్రదేశ్ లోని ఇతర ప్రముఖ పట్టణాలకు రైల్వే మరియు రోడ్ అనుసంధానం (connectivity) త్వరితగతిన చేపట్టే చర్యలు తీసుకోబడుతున్నాయి. అనంతపురం - అమరావతి ఎక్స్ ప్రెస్ రహదారి కొరకు 20 వేల కోట్లు మరియు రాజధాని అమరావతి పట్టణము ఔటర్ రింగ్ రోడ్ కు 19,700 కోట్లు ఇచ్చేందుకు నేషనల్ హై వే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అంగీకరించింది. అంతర్గత జల రవాణా సదుపాయాలను అభివృద్ధి చేసే బకింగ్ హామ్  కాలువ పునరుద్ధరణ కొరకు 7015 కోట్లతో మరొక పెద్ద ప్రాజెక్ట్. లక్ష కోట్ల రూపాయల విలువైన రోడ్ మరియు ఇన్ ల్యాండ్ రవాణా ప్రాజెక్ట్ లకు ఆమోదాన్ని ఇవ్వడం జరిగింది. వీటన్నింటికీ చంద్రబాబు గారే కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

మెరుగైన రైల్ అనుసంధానం కొరకు సుమారు 50 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లను ఆమోదించడం జరిగింది. వాటి అమలు వివిధ దశల్లో వున్నది. 23,137 కోట్ల వ్యయంతో 2,584 కి. మీ. ల రైల్వే లైనుల డబ్లింగ్ ఇప్పటికే జరుగుతోంది. కొత్తగా 20,301 కోట్ల రూపాయలతో 2,213 కి. మీ.ల కొత్త రైల్వే లైన్లు నిర్మాణం జరుగుతూ వుంది. 26,403 కోట్ల రూపాయల వ్యయంతో 15 కొత్త ప్రాజెక్ట్ లను ఆమోదించడం జరిగింది. నూతన రాజధాని అమరావతికి కనెక్టివిటీని కలుగచేసేందుకు 2679.59 కోట్ల వ్యయంతో 2017-18 సం.లో విజయవాడ నుండి రాజధాని అమరావతి మీదుగా గుంటూరుకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు 2679.59 కోట్లను కేటాయించడం జరిగింది. మిగిలిన ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులు: నడికుడి - శ్రీకాళహస్తి ల మధ్య 2289 కోట్ల రూపాయల వ్యయంతో 309 కి.మీ ల కొత్త రైల్వే లైన్; గుంటూరు - గుంతకల్లు మధ్య 3631 కోట్ల రూపాయలతో 401 కే.మీ. ల డబ్లింగ్ విద్యుదీకరణ ప్రాజెక్ట్; ఢిల్లీ - విశాఖపట్నం ల మధ్య సూపర్ ఫాస్ట్ ఏ.పి . ఎక్స్ ప్రెస్ ప్రతి రోజు; విజయవాడ - హౌరా మరియు తిరుపతి - జమ్ముతావిల మధ్య ఎక్స్ ప్రెస్ ట్రైన్లు ఇప్పటికే నడుస్తూ వున్నాయి. 

నూతన రాజధాని అత్యవసర మౌలిక సదుపాయాల కొరకు 2500 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - పట్టణ కార్యక్రమం క్రింద ఎక్కడ లేని విధంగా గరిష్టంగా 11.29 లక్షల ఇళ్లను ఇవ్వడం జరిగింది. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కొరకు అమృత్ పధకం క్రింద 4 స్మార్ట్ నగరాలు మరియు వివిధ ప్రాజెక్టులను ఇవ్వడం జరిగింది. సమగ్ర అభివృద్ధి కొరకు హృదయ్ పధకం క్రింద వారసత్వ నగరంగా అమరావతిని ఎంపిక చేయడం జరిగింది. రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర జిల్లాలకు

ఆంధ్ర ప్రదేశ్  ప్రత్యేక ప్యాకేజీని కూడా మించి అదనంగా చేసింది. ఈ పధకం కింద ఊహించనంత వేగంలో ఎన్నో ప్రాజెక్టులను శాంక్షన్ చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వమే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేక అవసరమైన ప్రతిపాదనలను కూడా పంపటంలో విఫలమైంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) మరియు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ (NIMZ) లను ఎప్పుడో ఆమోదించినా, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించక పోవడంవలన ఈ ప్రాజెక్టులు వెలుగు చూడలేకపోయాయి.

సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టుని RINL మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం.. చేసుకోవడం జరిగింది. దీనివలన 38500 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖపట్నంలో వివిధ ప్రాజెక్టులు వస్తాయి. ఈ సంవత్సరం జనవరి నుండి ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హైకోర్టు పని చేయడం ప్రారంభమైంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు రాజధాని ప్రాంతంలోని అటవీ భూమిని డీనోటిఫై చేయడం ద్వారా రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మార్గాన్ని సుగమం చేసింది.

14వ ఆర్థిక సంఘ సిఫార్సుల మేరకు ఇప్పటిదాకా 1,37,977.25 కోట్లను విడుదల చేయడం జరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన రెవెన్యూ లోటు విషయంలో రిసోర్స్ గ్యాప్ గా 4,117.89 కోట్లుగా కేంద్ర ప్రభుత్వం లెక్కించడం జరిగింది. దానికి గాను, 3979.50 కోట్లను ఆంధ్ర ప్రదేశ్ కు విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ కు వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా 3 లక్షల కోట్ల రూపాయల అదనపు ప్రాజెక్టులను ఆమోదించడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సహాయాన్ని అందించే విషయంలో ఎంత అసాధారణ పద్దతిలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందో ఈ విషయమే తెలియబరుస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ చట్టంలో లేనివి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎన్నో సంస్థలను, ప్రాజెక్టులను ఆమోదించడం, ఇవ్వడం జరిగింది. వాటి వివరాలు, పూర్తి అయ్యేదానికి వివిధ దశల వివరాలు అన్నీ ఈ క్రింద ఇవ్వడం జరిగింది.

*       అనంతపురం జిల్లా పాలసముద్రం వద్ద నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్, ఎక్సయిజ్ అండ్ నార్కోటిక్స్.

*       విజయవాడ సూరంపల్లి వద్ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాస్టిక్స్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ.

*       నెల్లూరు జిల్లా తుపిలిపల్లం వద్ద NIOT ఓషన్ రీసెర్చ్ ఫెసిలిటీ

*       నెల్లూరులో NCERT వారి రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఇంకా భూమిని కేటాయించలేదు).

*       విశాఖపట్నం పూడి వద్ద MSME టెక్నాలజీ సెంటర్.

*       నెల్లూరు జిల్లా చింతలదీవి వద్ద నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్.

*       తిరుపతిలో ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్

*       నెల్లూరులో రీజినల్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ రీహాబిలిటేషన్

*       విజయవాడలో దూరదర్శన్ కేంద్రం

*       విజయవాడలో ఆల్ ఇండియా రేడియో స్టేషన్

*       విజయవాడలో కొత్త ప్రాంతీయ పాసుపోర్టు కార్యాలయం

*       భీమవరంలో పాస్ పోర్టు సేవాకేంద్రం

*       2008లో శాంక్షన్ చేయబడిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ గత 10 సం.ల లో ఎలాంటి అభివృద్ధిని నోచుకోలేదు. అలాంటి ఈ సంస్థ విజయవాడలో ప్రారంభించబడింది.

*       నిమ్మకూరులో BEL నైట్ విజన్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ

*       రాంబిల్లిలో నావల్  ఆల్టర్నేటివ్ ఆపరేషనల్ బేస్.

*       బొబ్బిలిలో నావల్ ఎయిర్ స్టేషన్.

*       నాగయలంకలో DRDO మిస్సైల్ టెస్ట్ ఫెసిలిటీ.

*       కర్నూలు జిల్లాలో 500 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ ఎవాల్యూయేషన్ సెంటర్.

*       చిత్తూరులో 500 కోట్ల రూపాయల వ్యయంతో ట్రూప్స్ ట్రైనింగ్ సెంటర్.

*       విశాఖపట్నం లో మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్.

*       విశాఖపట్నం లో కంటైనర్ ఫ్రైట్ స్టేషన్

*       కాకినాడలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్

*       గుంటూరులో స్పైసెస్ పార్క్

*       విశాఖపట్నం లో సమీర్ (ఏ సెంటర్ ఫర్ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్

*       38,500 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖ ఉక్కు కర్మాగారం విస్తరణకు RINL మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం

*       చిత్తూరు జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్

*       కృష్ణా  జిల్లాలో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగ అండ్ నేచురోపతి

*       స్వదేశ్ దర్శన్ పధకం క్రింద కాకినాడ హోప్ ఐలాండ్ కోస్టల్ టూరిజం సర్క్యూట్ మరియు నెల్లూరు కోస్టల్ టూరిజం సర్క్యూటే

*       విశాఖపట్నంలో ఆసియా ఖండంలోనే మొట్ట మొదటి మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్

*       ఆంధ్ర ప్రదేశ్ ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేసుకున్నారని చివరగా నేను చెప్పదలచుకున్నాను. ఆయన భ్రమతో కూడిన రాజకీయాలు అంతం కానున్నాయి. మా విశ్వాసమంతా "సత్యమేవ జయతే". మనందరం కలసి ఆంధ్ర ప్రదేశ్ మరియు భారత దేశ అభివృద్ధికి పని చేద్దాం.

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

   6 hours ago


 కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

   6 hours ago


కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

   10 hours ago


నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి..  జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి.. జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

   11 hours ago


శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

   13 hours ago


జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

   13 hours ago


కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

   13 hours ago


కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

   14 hours ago


కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

   14 hours ago


ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్  2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

   15 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle