newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు ఆయనే..!

22-09-202022-09-2020 15:40:36 IST
Updated On 22-09-2020 18:37:27 ISTUpdated On 22-09-20202020-09-22T10:10:36.875Z22-09-2020 2020-09-22T10:10:27.526Z - 2020-09-22T13:07:27.678Z - 22-09-2020

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు ఆయనే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టీడీపీ కొత్త కమిటీని ఏర్పాటు చేసేందుకు తెలుగు దేశం  అధినేత చంద్రబాబు కసరత్తు పూర్తీ చేశారు. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 27న అచ్చెన్న నియామకానికి సంబంధించి చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేయనున్నారు. తెలుగు దేశం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉండగా.. ఆయన స్థానంలో మళ్లీ బీసీకే అవకాశాన్ని కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటివరకు 13 జిల్లాల ప్రతిపాదికన పార్టీ అధ్యక్షులు ఉండగా.. కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్‌గా తీసుకుని అధ్యక్షులను నియమించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. ఏపీలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 25 మంది అధ్యక్షులు నియామకం చేపట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఇటీవలే భగ్గుమన్నాయి. ప్రస్తుతం టీటీడీపీ అధ్యక్షుడుగా ఉన్న ఎల్‌.రమణ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పా​ర్టీ నేతలు తిరుగుబాటును ప్రకటించారు. తెలంగాణ పార్టీ నాయకత్వ మార్పు కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. గత ఏడేళ్లుగా ఒకే వ్యక్తి అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారని, రాష్ట్రంలో పార్టీ ఉనికి ఆందోళనలో పడిందని, ఇప్పటికైనా అధ్యక్షుడిని మార్చాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో, దీనికి సంబంధించి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

తెలంగాణలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంటోంది. 2014లో తెలంగాణలో టీడీపీకి 15 సీట్లు కాగా, 2019లో 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు పార్టీ సీనియర్లు లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి కూడా నెలకొందన్నారు సీనియర్లు. తెలంగాణలో పార్టీ పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోందని చెప్పారు.


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle