newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా... ఆఫ్ఘనిస్థాన్లో ఉన్నామా?’’

11-01-202011-01-2020 17:56:45 IST
Updated On 13-01-2020 13:01:49 ISTUpdated On 13-01-20202020-01-11T12:26:45.009Z11-01-2020 2020-01-11T12:25:09.596Z - 2020-01-13T07:31:49.566Z - 13-01-2020

‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా... ఆఫ్ఘనిస్థాన్లో ఉన్నామా?’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతి ఆందోళనలు 25వ రోజుకు చేరుకున్నాయి. తుళ్ళూరులో టెంట్లు వెయ్యకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనల నేపథ్యంలో తుళ్ళూరులో భారీగా పోలీసులు మోహరించారు. అలాగే.. మందడం, వెలగపూడితో పాటు రాజధాని గ్రామాల్లో భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. వైసీపీ సర్కార్ తీరుపై ఏపీ బీజేపీ మండిపడింది. 

రాజధాని కోసం శాంతియుత ఉద్యమాలు చేస్తున్న మహిళల పై పోలీసులు దాడి‌ చేసి,  అరెస్టు చేయడం అన్యాయం. ఒంగోలులో మహిళల పై మగ పోలీసులు దాడి‌చేయడం కలచి వేసింది. మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా... ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్నామా? అని ట్వీట్ చేశారు రాజ్యసభ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుజనాచౌదరి. 

ఈ ప్రభుత్వం ఆరు నెలల్లో ఆడపడుచుల‌ విశ్వాసం కోల్పోయిందని, అవసరం లేకున్నా 144 సెక్షన్ పెడుతున్నారని,  ఏ నిబంధనలు ప్రకారం అర్ధరాత్రి పోలీసులు ఇళ్లకు వెళుతున్నారని సుజనా చౌదరి ప్రశ్నించారు.

బెజవాడ రోడ్లలో మహిళలు రోడ్లపై  కనిపిస్తే చాలు అరెస్టులు చేస్తున్నారని, అమ్మవారికి మొక్కులు చెల్లించుకోకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. దేవాలయాల్లో పూజలు కూడా చేసుకోనివ్వకుండా పోలీసు రాజ్యం నడుపుతున్నారని ఆయన దుయ్యబట్టారు. 

కులాల మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని, అరెస్ట్ అయిన వారి కులాలు అడగటమేంటన్నారు. ప్రభుత్వం దిగి రావాలంటే.. 13 జిల్లాల నుంచి ప్రజలు రోడ్ల పైకి వచ్చి ఉద్యమించాలన్నారు.

కేంద్రం దృష్టి కి తీసుకెళ్లి.. అమరావతి ఇక్కడే ఉండేలా కృషి‌ చేస్తానన్నారు.  కుల, మత, ప్రాంతాలకు‌ అతీతంగా పోరాటం చెయ్యాలన్నారు. రాజధాని ర్యాలీలకు అనుమతి లేదని అరెస్టులు చేస్తున్నారని. అయితే,  వైసిపి ర్యాలీలకు మాత్రం అనుమతులిస్తున్నారన్నారు. డిజిపి రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని, అధికార పార్టీ ఒత్తిళ్ళకు లొంగి పని చేస్తే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు. 

జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

   an hour ago


తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

   an hour ago


ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

   2 hours ago


విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

   2 hours ago


 జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

   2 hours ago


  పైలెట్ ని క్షమించేద్దాం.. అశోక్ గెహ్లాట్

పైలెట్ ని క్షమించేద్దాం.. అశోక్ గెహ్లాట్

   4 hours ago


సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

   15 hours ago


తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

   16 hours ago


ఇళ్ళ పట్టాల పంపిణీ  మళ్లీ మళ్లీ వాయిదా

ఇళ్ళ పట్టాల పంపిణీ మళ్లీ మళ్లీ వాయిదా

   16 hours ago


విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

   18 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle