newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

అసెంబ్లీ ఓకే.. మండ‌లిలో మాత్రం టీడీపీనే..!

17-07-201917-07-2019 08:48:04 IST
Updated On 17-07-2019 12:19:37 ISTUpdated On 17-07-20192019-07-17T03:18:04.785Z17-07-2019 2019-07-17T03:15:16.158Z - 2019-07-17T06:49:37.153Z - 17-07-2019

అసెంబ్లీ ఓకే.. మండ‌లిలో మాత్రం టీడీపీనే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పూర్తి ఆధిప‌త్యం చూపిస్తోంది. అసెంబ్లీలోని 175 మందిలో 151 మంది వైసీపీ స‌భ్యులే ఉండ‌టం, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి కేవ‌లం 23 మంది మాత్ర‌మే ఉండ‌టంతో స‌భ‌లో వైసీపీ వాయిస్ ఎక్కువ‌గా వినిపిస్తోంది. టీడీపీ స‌భ్యులు కొంద‌రే మాట్లాడుతుండ‌టంతో ఆ పార్టీ వెనుక‌బ‌డిపోతోంది.

మొన్న సున్నా వ‌డ్డీల‌కు టీడీపీ హ‌యాంలో రుణాలు ఇవ్వ‌లేద‌ని వైసీపీ చెప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ వెంట‌నే కౌంట‌ర్ ఇవ్వ‌లేక తెల్లారి మ‌ళ్లీ మాట్లాడాల్సి వ‌చ్చింది. ఇక‌, బ‌డ్జెట్ విష‌యంలో ఆ పార్టీ గ‌ట్టిగా మాట్లాడ‌లేక‌పోయింది. గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఒక్క‌రే మాట్లాడారు. కియా ప‌రిశ్ర‌మ విష‌యంలో, గ‌త ప్ర‌భుత్వంపై వైసీపీ ప‌దేప‌దే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న‌ప్పుడు టీడీపీ గ‌ట్టిగా కౌంట‌ర్ ఇవ్వ‌లేక‌పోతోంది. ఇందుకు సంఖ్యాబ‌లం ఎక్కువ‌గా లేక‌పోవ‌డ‌మే ఏకైక కార‌ణం.

అయితే, శాస‌న‌మండ‌లిలో మాత్రం తెలుగుదేశం పార్టీ వాయిస్‌ను గ‌ట్టిగా వినిపిస్తోంది. శాస‌న‌మండ‌లిలో ఇంకా తెలుగుదేశం పార్టీదే మెజారిటీ కావ‌డంతో ఆ పార్టీ స‌భ్యులు ఆధిప‌త్యం చూపిస్తున్నారు.

మండ‌లిలోని మొత్తం స‌భ్యుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు 28 మంది ఉండ‌గా వైసీపీ నుంచి కేవ‌లం ఆరుగురు మాత్ర‌మే ఉన్నారు. పీడీఎఫ్ నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ఇద్ద‌రు, స్వ‌తంత్రులు ముగ్గురు ఉన్నారు. టీడీపీకి ఉన్న 28 మంది స‌భ్యుల‌కు అద‌నంగా గ‌వ‌ర్న‌ర్ కోటాలో నామినేట్ అయిన ఎనిమిది మంది ఉన్నారు.

ఇలా వైసీపీ కంటే టీడీపీ సంఖ్య ఐదురెట్లు అధికంగా ఉండ‌టంతో అసెంబ్లీలో ఉన్న సీన్ రివ‌ర్స్ అవుతోంది. మండ‌లి ఛైర్మ‌న్‌, డిప్యూటీ ఛైర్మ‌న్ కూడా టీడీపీకి చెందిన వారే. శాస‌న‌మండ‌లిలో ఉన్న టీడీపీ స‌భ్యులు కూడా సీనియ‌ర్లే ఎక్కువ మంది ఉన్నారు. మాజీ మంత్రులు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌, నారా లోకేష్‌, శ‌త్రుచ‌ర్ల విజ‌య‌రామ‌రాజు శాస‌న‌మండ‌లిలో ఉన్నారు.

వీరికి తోడు గ‌ట్టిగా మాట్లాడ‌గిలిన బుద్దా వెంక‌న్న‌, రాజేంద్ర ప్ర‌సాద్, త‌దిత‌రులు కూడా మండ‌లిలో టీడీపీ స‌భ్యులుగా ఉన్నారు. వైసీపీ త‌ర‌పున బ‌లంగా వాణి వినిపించ‌గ‌లిగిన నేత‌లు ఎవ‌రూ లేరు. దీంతో శాస‌న‌మండ‌లిలో టీడీపీ వాయిస్ ఎక్కువ‌గానే వినిప‌స్తోంది. బ‌డ్జెట్‌పై చ‌ర్చ స‌మ‌యంలో ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది. శాస‌న‌స‌భ కంటే శాస‌న‌మండ‌లిలోనే టీడీపీ బ‌డ్జెట్‌పై ఎక్కువ మాట్లాడ‌గ‌లిగింది.

అయితే, ఇటీవ‌లి ఎన్నిక‌ల ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి, నారాయ‌ణ రాజీనామా చేశారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీలుగా ప‌నిచేసిన‌ ప‌య్యావుల కేశ‌వ్‌, క‌ర‌ణం బ‌ల‌రాం, వైసీపీ నుంచి కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, ఆళ్ల నాని ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం ఆరు ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి. ఈ ఆరు కూడా ఎప్పుడు భ‌ర్తీ చేసిన వైసీపీ ఖాతాలోకే రానున్నాయి. అప్పుడు కొంత వైసీపీ బ‌లం పెరుగుతోంది. అంత‌వ‌ర‌కు మాత్రం మండ‌లిలో టీడీపీ స‌భ్యులే హ‌వానే ఉండ‌నుంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle