newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

అసెంబ్లీలో చర్చను 'ఖవ్వాలీ డాన్స్'తో పోల్చిన స్పీకర్!

11-12-201911-12-2019 15:29:35 IST
Updated On 11-12-2019 15:40:35 ISTUpdated On 11-12-20192019-12-11T09:59:35.520Z11-12-2019 2019-12-11T09:59:32.666Z - 2019-12-11T10:10:35.103Z - 11-12-2019

అసెంబ్లీలో చర్చను 'ఖవ్వాలీ డాన్స్'తో పోల్చిన స్పీకర్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇప్పటికే అయన స్పీకర్ ను కాకముందే ఆముదాలవలసకు ఎమ్మెల్యేను అని స్వయంగా చెప్పేశారు. అంటే దానికి అర్ధం అయన ముందు రాజకీయ నేత కాగా ఆ తర్వాతే సభాపతిని అని ఉద్దేశ్యం. అవసరమైతే రాజకీయల కోసం సభాపతి ధర్మాన్ని తప్పినా తప్పులేదని ఇప్పటికే అయన చెప్పకనే చెప్పేశారు. ఇక ఈ మధ్యనే తన స్థానాన్ని మరచి వివాదస్పద వ్యాఖ్యలు కూడా అందరూ విన్నవే.

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడవ రోజు కూడా ఈ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. అయితే ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ పార్టీ తమకు ప్రతి అంశంలో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ వేసే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సమయంలో మైకులు కట్ చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు.

కాగా తాజాగా సభలో రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం అమలు, తెలుగు మీడియం రద్దు అంశంపై చర్చ జరుగుతుంది. ఈ చర్చలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పీకర్ ను కోరారు. అందుకు స్పీకర్.. అడిగినప్పుడల్లా ఇవ్వడానికి ఇదేమైనా ఖవ్వాలీ డాన్సా కూర్చోండి అనేశారు. దీంతో చంద్రబాబు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

గౌరవమైన స్పీకర్ స్థానంలో ఉండి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరించారు. స్పీకర్ తమ్మినేని కూడా అదే స్థాయిలో రెచ్చిపోయారు. స్పీకరును ఇష్టానుసారంగా మాట్లాడితే మంచిది కాదన్నారు. స్పీకర్ స్థానానికి కనీసం గౌరవం ఇవ్వాలని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే సభలో రచ్చ మొదలైంది. సభలో 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా గోలకి లేచారు.

స్పీకరును మర్యాదగా ఉండదని అంటారా? ఇంత అనుభవం ఉండి ఏం లాభం.. స్థానానికి అయినా గౌరవం ఇవ్వాలి కదా? చంద్రబాబు స్పీకరుపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరికి చంద్రబాబు చేసిన  వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని స్పీకర్ కోరితే.. చంద్రబాబు వ్యాఖ్యలకు తనపై చర్యలు తీసుకొని సభ నుండి సస్పెండ్ చేయాలని కొందరు వైసీపీలు ఎమ్మెల్యేలు కోరారు.

స్పీకర్ చేసిన ఖవ్వాలీ డాన్స్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత గోల చేసినా 150 మంది ఎమ్మెల్యేల మద్య ఇరవై మంది ఎమ్మెల్యేల వాయిస్ తగ్గిపోయింది. మొత్తం సభలో ఇంగ్లీష్ మీడియం మీద మొదలైన చర్చ స్పీకర్ వర్సెస్ చంద్రబాబుగా మారి అసలు విషయం పక్కకి వెళ్ళింది. ఇప్పటికే తమ సవాళ్లకి సీఎంతో సహా మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబుకి స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు ఆయుధంగా మారాయి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle