newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

అసెంబ్లీపై ఆశ‌లు వ‌దులుకున్న‌ట్లే..!

25-03-201925-03-2019 08:29:28 IST
2019-03-25T02:59:28.695Z25-03-2019 2019-03-25T02:59:04.511Z - - 25-05-2020

అసెంబ్లీపై ఆశ‌లు వ‌దులుకున్న‌ట్లే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నామ‌మాత్రంగా ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి 2014 ఎన్నిక‌లు బాగా క‌లిసివ‌చ్చాయి. న‌రేంద్ర మోడీ ఛ‌రిష్మా, తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేనతో పొత్తు ఆ పార్టీకి బాగా ఉప‌యోగ‌ప‌డింది. ఆ ఎన్నిక‌ల్లో ఏపీలో రెండు పార్ల‌మెంటు స్థానాల‌తో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాల‌ను ద‌క్కించుకుంది. విభ‌జ‌న దెబ్బ‌కు ప‌లువురు కాంగ్రెస్ సీనియ‌ర్లు కూడా బీజేపీలో చేర‌డంతో ఏపీలో ప్ర‌త్యామ్నాయంగా బీజేపీ ఎదిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంతా ఊహించుకున్నారు.

నాలుగేళ్ల పాటు రాష్ట్రంలో బీజేపీ ప‌రిస్థితి బాగానే గడిచింది. బీజేపీతో తెలుగుదేశం పార్టీ తెగ‌దెంపులు చేసుకున్నాక సీన్ రివ‌ర్స్ అయ్యింది. బీజేపీ విభ‌జ‌న హామీలు అమ‌లు చేయ‌లేద‌ని, రాష్ట్రానికి న‌మ్మ‌క ద్రోహం చేసింద‌ని, రాష్ట్రానికి వ్య‌తిరేకంగా కుట్ర చేసింద‌ని తెలుగుదేశం పార్టీ ప్ర‌జ‌ల్లోకి బాగా తీసుకెళ్లింది. ఏడాది కాలంగా బీజేపీని ప్ర‌జ‌ల్లో విల‌న్ గా చూపించ‌గ‌లిగింది. దీంతో బీజేపీ ప‌రిస్థితి పూర్తిగా త‌ల‌కిందులైంది. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వంటి ముఖ్య‌మైన హామీని అమ‌లు చేయ‌క‌పోవ‌డం, నెర‌వేర్చిన హామీల‌నూ ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌లేక‌పోవ‌డంతో ఆ పార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది.

ఈ ఎన్నిక‌ల్లో ఒంట‌రి పోరుకు దిగుతున్న‌ ఆ పార్టీ అతి క‌ష్ట‌మ్మీద అన్ని స్థానాల‌కూ అభ్య‌ర్థులను నిల‌బెట్టింది. అయితే, బీజేపీ అభ్యర్థుల ఎంపిక‌ను ఓసారి ప‌రిశీలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీపై ఆ పార్టీ పూర్తిగా ఆశ‌లు వ‌దులుకున్న‌ట్లే క‌నిపిస్తోంది. అసెంబ్లీలో సీట్లు గెల‌వ‌క‌పోయినా ఒక‌టో రెండో పార్ల‌మెంటు స్థానాలైనా గెల‌వాల‌ని భావిస్తోంది. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన సిట్టింగ్ స్థానాల‌ను ద‌క్కించుకోవాల‌నుకుంటోంది.

పార్టీలో మిగిలి ఉన్న కాస్త గుర్తింపు క‌లిగిన నేత‌ల‌ను పార్ల‌మెంటు బ‌రిలో నిలిపింది ఆ పార్టీ. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ‌ప‌ట్నం పార్ల‌మెంటు స్థానం నుంచి వైసీపీ అభ్య‌ర్థి వైఎస్ విజ‌య‌మ్మ‌పై బీజేపీ అభ్య‌ర్థి హ‌రిబాబు సంచ‌ల‌న విజ‌యం సాధించారు. న‌ర్సాపురం పార్ల‌మెంటులోనూ 85 వేల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్య‌ర్థి గోక‌రాజు గంగ‌రాజు గెలుపొందారు. దీంతో ఈ రెండు సిట్టింగ్ స్థానాల‌ను కాపాడుకోవాల‌ని బీజేపీ భావిస్తోంది.

విశాఖ‌ప‌ట్నం నుంచి మాజీ కేంద్ర మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిని బ‌రిలో నిలిపింది. ఇక‌, న‌ర్సాపురం నుంచి తాడేప‌ల్లిగూడెం సిట్టింగ్ ఎమ్మెల్యే పైడికొండ‌ల మాణిక్యాలరావును, న‌ర‌స‌రావుపేట నుంచి  ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను పోటీ చేయిస్తోంది. ఇలా గుర్తింపు క‌లిగిన నేత‌లను పార్ల‌మెంటుకు పోటీ చేయించి అసెంబ్లీపై పెద్ద‌గా ఆశ‌లు పెట్టుకోలేదు. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, మాణిక్యాల‌రావు అసెంబ్లీకి పోటీ చేస్తే గ‌ట్టి పోటీ చేసే అవ‌కాశం ఉన్నా అలా చేయ‌లేదు. వీరు ముగ్గురు ఎంపీ స్థానాల‌కు కొంత పోటీ ఇచ్చే అవ‌కాశం ఉంది. మొత్తానికి, బీజేపీ 2019లో ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్ట‌డం క‌ష్టంగానే ఉంది.

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   15 minutes ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   2 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   2 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   2 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   3 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   3 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   3 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   a day ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   24-05-2020


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   24-05-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle