newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

అసభ్య పోస్టులపై ఇప్పుడు వంతు వైకాపాది.. ఎన్నాళ్లిలా?

08-10-201908-10-2019 12:05:21 IST
2019-10-08T06:35:21.073Z08-10-2019 2019-10-08T06:35:11.017Z - - 19-02-2020

అసభ్య పోస్టులపై ఇప్పుడు వంతు వైకాపాది.. ఎన్నాళ్లిలా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత కొన్ని రోజులుగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో సహా ఆ పార్టీ నేతలంతా ఎక్కని మెట్టు, దిగని మెట్టు లేదన్నంత స్థాయిలో సోషల్ మీడియోలో తమ పార్టీవాళ్లపై సాగుతున్న అసభ్య ప్రచారం గురించి మీడియాను బీభత్సంగా వాడేసుకున్నారు. రాష్ట్రంలో మరేమీ సమస్యలు లేవన్నట్లుగా.. అధికార పార్టీ సానుభూతిపరులు, కేడర్లు ప్రతిపక్ష నేతలపై బూతులకు దిగుతూ  ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల్లో తమపై అవమానపూర్వకంగా నిందిస్తున్నారని, కుటుంబాలను, కులాలను ముగ్గులోకి లాగి దూషిస్తున్నారని చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు వీరంగమాడేశారు.

దీనికి ప్రతిస్పందనగా సీనియర్ వైకాపా నేత, మంత్రి బొత్సా సత్యనారాయణ మీడియా సాక్షిగా సోషల్ మీడియాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా వస్తున్న  అసభ్య పోస్టులను తీవ్రంగా ఖండించారు. అదే సమయంలో చంద్రబాబు తన గొయ్యిన తానే తవ్వుకుంటున్నందు వల్లే ఇలా జరుగుతోందని సెలవిచ్చేశారు కూడా.

గతవారం సోషల్ మీడియాలో నాయకులు వారి కుటుంబాలపై బూతుల పురాణం గురించి ఫిర్యాదుల మోత టీడీపీది కాగా ఈ సోమవారం నుంచి వైకాపా తన వంతుగా ముందుకొచ్చింది. అది టీడీపీ దాడికి ఒకరకంగా ప్రతిదాడి అనే చెప్పాలి.  వైకాపా నేతలపై టీడీపీ కార్యకర్తలు అత్యంత అసభ్య వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కథనాలు వండి వారుస్తున్నారని, సాక్షాత్తూ టీడీపీ అధినేత, ఆయన కుమారుడు లోకేష్ బాబులే ఇలాంటి దూషణ ప్రచారానికి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని వైకాపా ఎమ్మెల్యేలు జోగి రమేష్, సుధాకర బాబు, ఉండవల్లి శ్రీదేవి తదితరులు డీజీపీ ఆఫీసుకువచ్చి మరీ ఫిర్యాదు చేశారు.

సీఎం వైఎస్‌ జగన్, ఆయన కుటుంబ సభ్యులు, మహిళా ఎమ్మెల్యేలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని, చంద్రబాబు, లోకేష్‌ డైరెక్షన్‌లోనే ఈ విష ప్రచారం మొత్తంగా జరుగుతోందని వారు ఆరోపించారు. పైగా సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆఫీసులోనుంచే ఇలాంటి అశ్లీల పోస్టులు పుంఖానుపుంఖాలుగా గతంలోనే వెలువడ్డాయని, ఆయన ఆఫీసును తనిఖీచేస్తే టీడీపీ భండారం మొత్తంగా బయటపడుతుందని వైకాపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఎన్‌బీకే బిల్డింగ్‌లోనూ,టీడీపీ కార్యాలయాల్లోనూ సోదాలు చేయాలని వీరు డీజీపీని అభ్యర్థించారు.

వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరో అడుగు ముందుకేసి.. అసెంబ్లీలో కూర్చున్న వైఎస్సార్‌సీపీ మహిళా ఎమ్మెల్యేల ఫొటోలతో సోషల్‌ మీడియాలో టీడీపీ వాళ్లు అసభ్య పోస్టింగ్‌లు పెట్టారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో తనపై టీడీపీ వాళ్లు దాడిచేశారని, ఎమ్మెల్యే అయ్యాక వినాయక ఉత్సవాల్లో కులం పేరుతో దూషించి తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు ఇంట్లో మహిళలు లేరా వారికి ఇటువంటి అవమానాలు జరిగితే ఊరుకుంటారా అంటూ ఆమె ప్రశ్నించారు.

నాలుగురోజుల ముందు చంద్రబాబు తమ పార్టీ నాయకురాలు అనూరాధపై సోషల్ మీడియాలో వస్తున్న అసభ్య కామెంట్ల గురించి మీడియా ముందు చదివి మరీ వినిపించారని కానీ ఇప్పుడు వైకాపా అధినేత కుటుంబ సభ్యుల గురించి, పార్టీ ఎమ్మెల్యేల గురించి వస్తున్న అసభ్య వ్యాఖ్యలకు టీడీపీ ఏం సమాధానం చెబుతుందని వైకాపా ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. హైదరాబాదులోని టీడీపీ ఆఫీసు అయిన ఎన్‌బీకే భవన్‌లోనుంచి వైకాపా నేతలకు, ఎమ్మల్యేలకు వ్యతిరేకంగా ఇలాంటి పోస్టులు పెడుతున్నారని, దాదాపు 2,000 మంది సోషల్ మీడియా ఆపరేటర్లను చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారని వీరు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని కూడా వీరు ఫిర్యాదు చేశారు.

గత వారంరోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ ఒక్కసమస్య తప్ప రాష్ట్రం పరమ ప్రశాంతంగా ఉందని, ఈ సినిమా తప్ప మరే గొడవలూ రాష్ట్రంలో లేవని తలపించే స్థాయిలో సోషల్ మీడియా వ్యాఖ్యల దుమారంతో మీడియా హోరెత్తిపోయింది. భాషను, వ్యక్తీకరణను పవిత్రంగా కాకపోయినా కాస్త మర్యాదగా, సభ్యతగా వాడాలి అనే విషయాన్ని ఏనాడో మర్చిపోయిన ప్రస్తుత తరం యువత సోషల్ మీడియా అనే ఆధునిక ప్రజాస్వామ్య వేదికను అసభ్య, అశ్లీల వేడుకగా మార్చేయడం జరిగిపోయాక ఇక పవిత్రత, సభ్యత గురించి పట్టించుకునే సంస్కారవంతులు కరువైపోయారు కదా.. రాష్ట్ర మౌలిక సమస్యలను కూడా పక్కన పెట్టి సోషల్ మీడియా టపాల గురించి ఇల్లెక్కి పందరి వేయడం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోనే జరుగుతోంది.

దీనికి కారకులెవరు అంటే ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం చేసయినా సరే తమది పైచేయి అనిపించుకోవాలనుకుంటున్న రాజకీయ నేతలదే. ఒకరి కొంపను ఒకరు ఇలా తిట్లతో, అశ్లీల కంపుతో తగులబెట్టుకోవడం ప్రారంభించేసిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేయగలరు.. ఎవరికి వారుగా అనుభవించాల్సిందే. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle