newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

అసందర్భ వ్యాఖ్యలకు కేరాఫ్ పవన్ కల్యాణ్

04-12-201904-12-2019 16:40:17 IST
Updated On 04-12-2019 17:40:35 ISTUpdated On 04-12-20192019-12-04T11:10:17.641Z04-12-2019 2019-12-04T11:10:13.443Z - 2019-12-04T12:10:35.654Z - 04-12-2019

అసందర్భ వ్యాఖ్యలకు కేరాఫ్ పవన్ కల్యాణ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత కొద్ది రోజులుగా యాక్టర్ కమ్ పొలిటీషియన్ అవతారమెత్తిన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే అసందర్భ వ్యాఖ్యలకు కేరాప్‌గా జనసేనాధిపతి మారిపోయినట్లు కనిపిస్తోంది. దిశ హత్యాచార ఘటననుంచి మొదలుకుని  వివిద సందర్భాల్లో పవన్ చేస్తున్న ప్రసంగాలు, వ్యాఖ్యలు ఒకే ఒక్కడిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. ఎక్కడ ఏది జరిగినా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకునే వవన్ వ్యాఖ్యానించడం విశేషం. విమర్శించడం మనందరి జన్మహక్కే కావచ్చు కానీ అదేదో వ్యక్తిగత కసి పెట్టుకున్న స్థాయిలో ప్రతిదానికీ ఏపీ సీఎంను టార్గెట్ చేయడం సభ్యత హద్దులనుకూడా దాటిపోయినట్లే మరి. పైకి చాలా మేధోవంతంగా ప్రకటనలు చేస్తున్నట్లు కనిపిస్తున్నా ప్రతి సందర్బంలోనూ అసందర్భ వ్యాఖ్యలు చేయడంలో పవన్ అందిరినీ మించిపోయారనిపిస్తోంది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం.

హైదరాబాద్‌ శివార్లలోని శంషాబాద్‌లో డాక్టర్ దిశపై హత్యాచార ఘటనపై పవన్ ఎప్పటిలాగే విరుచుకుపడ్డాడు. బహిరంగ వేదికల పైనుంచి కయ్ మనడం పవన్‌కి సహజమే అని అందరికీ తెలుసు. కానీ దిశ ఘటనపై చేసిన వ్యాఖ్యలు చివరలో మోతాదు మించిపోయాయి. మన సొంత సమాజంలోనే మనం అభద్రత ఫీలవుతున్నాం. మన చుట్టూ అనేకమంది ఉంటున్నా ఒంటరిగా ఉంటున్నట్లు అనిపిస్తోంది.  లేకుంటే రద్దీగా ఉండే జాతీయ రహదారి పక్కనే ఒక మహిళను నలుగురు ఉన్మాదులు ఎలా అత్యాచారం చేసి చంపుతారు అని పవన్ ప్రశ్నించారు. ఇద్దరు బిడ్డల తండ్రిగా దిశ తల్లి శోకాన్ని అర్థం చేసుకోగలనని అన్నారు. నేనూ చెల్లెళ్ల మధ్యే పెరిగాను. ఇంటి బయటకు వెళ్లి వారు తిరిగి వచ్చేవరకు నేను కూడా ఎంతో ఒత్తిడికి గురయ్యేవాడినని చెప్పారు. 

ఇంతవరకు పవన్ వ్యాఖ్యలు బాగానే ఉన్నాయి. కానీ ఆ తర్వాతే పవన్ మాటలు తూలారు. ప్రభుత్వం మన సోదరిల ఆత్మగౌరవానికి, జీవితానికి భద్రత చేకూర్చలేనప్పుడు 151 సీట్లు గెల్చుకుంటే మాత్రం ఏం ఉపయోగం అంటూ పవన్ దెప్పిపొడిచారు. వైకాపా అధినేత వైఎస్ జగన్ 151 సీట్లను గెల్చుకుని ఏపీ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం నెలకొల్పిన విషయం తెలిసిందే. జగన్ సాధించిన 151 సీట్లకు, శంషాబాద్ అత్యాచార ఘటనకు ఏం సంబంధం ఉంది అంటూ జనం విస్తుపోతున్నారు. పనిలో పనిగా వైకాపా నేతలు బూతులకు లంకించుకుంటున్నారని, అందుకే సమాజం హింసాత్మకంగా మారి ప్రజలు నేరాలకు పాల్పడుతున్నారని పవన్ శెలవిచ్చేశారు. తలా తోకా లేని వ్యాఖ్యలంటే ఇవే కదా..

అలాగే తనకు కుల భావాలు లేవని, కులానికి ఆమడ దూరంగా ఉంటానని పవన్ చెబుతూనే ఏపీ ముఖ్యమంత్రిని ఉద్దేశపూర్వకంగా జగన్ రెడ్డి అని పదే పదే పిలవడం చూసి జనం నవ్వుకుంటున్నారు. కులానికి అతీతుడినంటూనే ఇతర కులాలకు చెందిన నాయకులను కులం పేర్లతో పిలిచి ఎద్దేవా చేయడం, మత విషయాల పట్ల విమర్శలు చేయడం చూస్తుంటో పవన్ రాజకీయ ప్రపంచంలో ఉనికి సమస్యతో బాధపడుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకుల వ్యాఖ్య. మతాలపై వ్యాఖ్యానించి రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నాడా అనే అనుమానాలు కూడ బయలు దేరుతున్నాయి. 

హిందూ మతోద్ధారకుడిలా తాజాగా పోజిచ్చిన పవన్ కల్యాణ్.. హిందూ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, ఇతర మతాలకు చెందిన రాజకీయ నేతలు అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనలేదని చెబుతూ దుమారం లేపారు. బీజేపీ, వీహెచ్‌పీ, ఆరెస్సెస్‌తో సహా హిందుత్వ పార్టీలు, శక్తులు పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడమే కాకుండా కబడ్డార్ అంటూ హెచ్చరించాయి. ఇక్కడ కూడా రాజకీయంగా ఇతర మతాలవారిని ఆకర్షించే ఎత్తుగడే పవన్‌కు ఉందని స్పష్టమైంది. ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత తననెవరూ గుర్తించలేదేమోనన్న ఒత్తిడి పవన్ చేత ఇలాంటి అసందర్భ వ్యాఖ్యలు చేయిస్తోందేమోనని జనం భావిస్తున్నారు.

ఇక ఉల్లిపాయల ధర దేశవ్యాప్తంగా పెరగడం వాస్తవమైతే, జగన్ ప్రభుత్వం ఎందుకు ఉల్లిధరలను నియంత్రించడం లేదంటూ పరమ హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేశారు పవన్. గత ప్రభుత్వంపై సాకు చూపి సమస్యలనుంచి పారిపోవద్దు అంటూ ఏపీ ప్రభుత్వానికి ఉచిత సలహా కూడా పారేశారు. ఉల్లి ధరలు తగ్గించలేనప్పుడు పదవి ఎందుకు పట్టుకుని వేలాడుతున్నారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి తాజాగా ఎన్నికలకు వెళితే మంచిది అన్నారు. నాణ్యతలేని ఉల్లిని కిలో 80 రూపాయలకు అమ్ముతున్నారంటూ ఆరోపించారు. వాస్తవానికి ఉల్లి ఇప్పుడు దేశం సమస్యగా మారిపోయింది. ఉల్లి ధరలను ఎలా నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వమే మల్లగుల్లాలు పడుతోంది. కానీ ఏపీలో కూడా ఉల్లి ధరలు  అలాగే ఉంటే దానికి జగన్ ప్రభుత్వాన్ని దెప్పుతున్నారు పవన్. కాని ఏపీ ప్రభుత్వం గత వారం రోజులుగా రైతు బజార్లలో కిలో ఉల్లిని 25 రూపాయలకు అందిస్తూ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తున్న మాట నిజం. ఉల్లి ధరల నియంత్రణ కేంద్రం చేతుల్లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజీనామా చేయడం రాజకీయ పరిపక్వత అనిపించుకుంటుందా?

అన్నిటికంటే మించి తిరుపతి పర్యటన సందర్భంగా జైలుకెళ్లిన జగన్ ముఖ్యమంత్రి కాగా లేనిది తాను ముఖ్యమంత్రి కాకూడదా అంటూ పవన్ చేసిన వ్యాఖ్య పెద్ద కామెడీగా మారింది. కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించాడన్న కోపంతో అటు యూపీఏ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌పై అక్రమాస్తుల కేసు పెట్టిన మాట వాస్తవం. కానీ తదనంతంరం 3,600 కిలోమీటర్ల దూరం మరాథన్ పాదయాత్ర చేసి జనం విశ్వాసం పొందిన జగన్ అధికారంలోకి వచ్చారు. విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ పేరుతో కనీసం రెండు కిలోమీటర్లు నడవలేకపోయిన పవన్ ముఖ్యమంత్రి పదవికి అర్రులు చాచడం ఏంటని జనం నవ్వుకుంటున్నారు.

పైగా జగన్ రెడ్డి ఒక కులానికే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి తనను సీఎంగా పిలువబోనని పవన్ చేసిన వ్యాఖ్య పిల్ల చేష్ట్యను మాత్రమే తలపిస్తోంది. అందుకే జగన్ రాష్ట్ర ప్రజలు మెచ్చి ఎన్నుకున్న సీఎం. నువ్వు తనను సీఎం అని పిలిస్తే ఎంత, పిలవకపోతే ఎంత అంటూ వైకాపా మంత్రులు వవన్‌తో చెడుగుడు ఆడేశారు. ఈ సందర్భంలోనూ పరువు పోగొట్టుకున్నది పవన్ మాత్రమే.

ఇలా సందర్భ రహితంగా చేస్తున్న వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్ ఉన్న విలువను కూడా పోగొట్టుకుంటన్నారని రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle