newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

అశోక్ గజపతిరాజుకి మోడీ బంపర్ ఆఫరా?

20-06-201920-06-2019 08:06:17 IST
Updated On 21-06-2019 14:48:54 ISTUpdated On 21-06-20192019-06-20T02:36:17.525Z20-06-2019 2019-06-20T02:34:22.757Z - 2019-06-21T09:18:54.998Z - 21-06-2019

అశోక్ గజపతిరాజుకి మోడీ బంపర్ ఆఫరా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రమాజీ మంత్రి పూసపాటి అశోక గజపతిరాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? రాజకీయాల్లో కూతుర్ని కూడా తీసుకువచ్చిన రాజుగారు టీడీపీ ప్రస్తుత పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నారా? రాజకీయాల్లో కొనసాగాలంటే మరో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారా?ఈ ఎడతెగని ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీలోనే ఉంటే తనకు భవిష్యత్తు ఉండదని అశోక్ గజపతిరాజు భావిస్తున్నారు.

మోడీ హయాంలో ఎన్డీయేలో ఉన్న తెలుగుదేశం పార్టీ...విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజుని కేబినెట్లోకి తీసుకోవాలని కోరడంతో, మోడీ రాజుగారికి పౌరవిమానయాన శాఖమంత్రిగా కీలకమయిన బాధ్యతలు అప్పగించారు. తనకు అప్పగించిన బాధ్యతలను ఆయన సమర్థవంతంగానే నిర్వర్తించారు. రాజుగారి హుందాతనం, సింప్లిసిటీ, మాటకారితనం అన్నీ నచ్చిన మోడీ ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చే వారని చెబుతారు. కీలకనిర్ణయాలు తీసుకునే సమయంలో మోడీ అశోకగజపతిరాజుని సంప్రదించేవారని చెబుతారు. 

2018లో టీడీపీ కేంద్రమంత్రివర్గం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా మోడీతో అశోక్ గజపతిరాజుకి సత్సంబంధాలుండేవి. మీరు టీడీపీకి రాజీనామా చేయండి, మంత్రివర్గంలో కొనసాగండి.. అని మోడీ సలహా ఇచ్చారని సమాచారం. ఒకవేళ టీడీపీకి రాజీనామా చేస్తే.. ఏదో రాష్ట్రం నుంచి ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చి మంత్రివర్గంలో కొనసాగించేవారని అంటున్నారు.

కానీ తాను టీడీపీలో నిబద్ధత కలిగిన నేతనని చెబుతూ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశారు అశోక గజపతిరాజు. అప్పటినుంచి ఇప్పటివరకూ ఆయన టీడీపీలోనే కొనసాగారు. మోడీతో ఆయన అనుబంధం ఇంకా కొనసాగుతూనే ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన  నేపథ్యంలో అశోక గజపతిరాజు చాలా అసహనంగా ఉంటున్నారు.

ఎన్నికల సమయంలో, ఆతర్వాత తన అసంత‌ృ‌ప్తిని బయటపెట్టారు అశోక గజపతిరాజు. బాబు టెక్నాలజీ, టెలికాన్ఫరెన్సులుపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన వేల మందితో కాన్ఫరెన్సుల వల్ల  వాస్తవాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. 

తాజాగా మరోమారు అశోక్ గజపతిరాజు అంశం తెరమీదకు వచ్చింది. రెండవసారి ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన నరేంద్ర మోడీ టీడీపీ సీనియర్ నేత అయిన అశోక గజపతిరాజుకి బంపర్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. టీడీపీని వీడి బయటకు వస్తే కీలక పదవి ఆయనకు ఇవ్వడానికి మోడీ అంగీకరించారని ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈశాన్య రాష్ట్రాల్లో ఏదో ఒకదానికి అశోక్ గజపతిరాజుని గవర్నర్‌గా పంపే అవకాశం ఉందని ఢిల్లీలో చెప్పుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి భవిష్యత్తు లేదని అశోక్ గజపతిరాజు భావిస్తున్నారని, ఆయన ఏ క్షణంలోనైనా కీలక నిర్ణయం తీసుకోవడం ఖాయమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా పంపితే మాత్రం అశోక్ గజపతిరాజు రాజకీయంగా క్రియాశీలకం కావడం ఖాయం. గవర్నర్ పదవి కాకుంటే అంతకంటే కీలకమయిన పదవి ఆయన కోసం ఎదురుచూస్తోందని అంటున్నారు. ఒకవేళ అశోక్ గజపతిరాజు టీడీపీని వీడితే మాత్రం ఉత్తరాంధ్రలో టీడీపీ క్యాడర్ బలహీనపడుతుందని ఆందోళన చెందుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle