అవినీతి నిరోధక హెల్ప్ లైన్లో జగన్‌పైనే ఫిర్యాదు.. వర్ల రామయ్య
27-11-201927-11-2019 10:38:52 IST
Updated On 27-11-2019 12:45:31 ISTUpdated On 27-11-20192019-11-27T05:08:52.898Z27-11-2019 2019-11-27T05:08:50.405Z - 2019-11-27T07:15:31.342Z - 27-11-2019

అవినీతికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి ప్రజలకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెల్ప్ లైన్ ప్రారంభించిన 24 గంటలలోపు సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత వర్లరామయ్య అదే హెల్ప్ లైన్‌కు కాల్ చేసి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం ద్వారా సంచలనం సృష్టించారు. వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అదికారాన్ని అడ్డు పెట్టుకుని రూ. 43,000 కోట్ల డబ్బును అక్రమంగా సంపాదించారని, ఈ అంశంపై 15 రోజుల్లోగా విచారణ జరపించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు పిర్యాదు చేయడానికి 14400 నంబర్‌తో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాన్ని నేరుగా ప్రభుత్వాధినేత అవినీతిపైనే ఫిర్యాదు చేయడానికి టీడీపీ నేత ఉపయోగించుకోవడం గమనార్హం. తండ్రి హయాంలో క్విడ్ ప్రో కో పద్ధతిలో అవినీతికి పాల్పడిన జగన్ రూ. 43 వేల కోట్లను కొల్లగొట్టారని, తన అవినీతికి గాను జగన్ ఇప్పటికే 16 నెలలు జైల్లో గడిపారని రామయ్య గుర్తు చేశారు. తాను పోన్ చేయగా 14400 హెల్ప్ లైన్లో స్పందించిన వ్యక్తితో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ తాను చేసిన ఫిర్యాదును 15 రోజుల్లోగా విచారించి పరిష్కారం చేయాలని కోరారు. ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా చేసే ప్రతి ఫిర్యాదును నమోదు చేసుకుని 15 నుంచి 30 రోజుల్లోగా వాటిని పరిష్కరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రముఖ్యమంత్రే స్వయంగా 43 వేల కోట్ల అవినీతి ఆరోపణలకు గురైనందున అవినీతిని అరికడతానని ఎలా ప్రతిజ్ఞ చేస్తారంటూ వర్లరామయ్య ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తనపై ఫిర్యాదు నమోదు కాకముందే స్వచ్చందంగా ముందుకు వచ్చి తన అవినీతిపై విచారణకు సిద్ధం కావాలని రామయ్య డిమాండ్ చేశారు. గతవారం సీఎం జగన్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎమ్) అహ్మదాబాద్ సంస్థతో ఏపీలోని ప్రభుత్వ విభాగాల్లో అవినీతిని తనిఖీ చేయడం కోసం అవినీతి నిరోధక శాఖతో కలిసి పనిచేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రప్రజలకు హెల్ప్ లైన్ అందుబాటులో ఉంచింది. ఇది ఇలా ఉండగా టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఐఐఎమ్ అలహాబాద్ సంస్థకు ఉత్తరం రాస్తూ ముఖ్యమంత్రి జగన్ అవినీతి కార్యకలాపాలపై ముందుగా విచారణ జరపాలని కోరారు. జగన్ పాల్పడిన కొన్ని అవినీతి చర్యలకు సంబంధించిన ఉదాహరణలను త్వరలో సంస్థ దృష్టికి తీసుకువస్తానని, పస్తుత అధ్యయనానికి అవి చక్కగా ఉపయోగపడతాయని చెప్పారు. సీబీఐ ప్రత్యేక కోర్టులో వైఎస్ జగన్‌పై ఇప్పటికే 11 కేసులు నమోదై విచారణ క్రమంలో ఉన్నందున జగన్ సంపాదించిన అక్రమ ఆస్తులను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఐఐఎమ్ అహమ్మదాబాద్ సంస్థకు ఉందని కళా వెంకట్రావు చెప్పారు. పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 14400 కాల్ సెంటర్‌ను సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ‘ఎప్పుడైనా ఎక్కడైనా అవినీతి మీ దృష్టికి వస్తే వెంటనే గళం ఎత్తండి.. 14400 నంబర్‌కు ఫోన్ చేయండి’ అనే నినాదం ఉన్న పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నేరుగా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి, ఫిర్యాదులను స్వీకరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కాగా అదే హెల్ప్ లైన్ ఉపయోగించుకుని టీడీపీ నాయకులు వైఎస్ జగన్‌కే నేరుగా జలక్ ఇవ్వడం గమనార్హం.

రాజధాని అమరావతిలోనే.. జగన్ క్లారిటీ
14-12-2019

దిశ తండ్రి బదిలీ.. కేసీయార్‌కి థ్యాంక్స్
14-12-2019

పెద్దల సభకు కవిత... వినోద్‌కు మొండిచెయ్యేనా?
14-12-2019

జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు
14-12-2019

జగన్ ప్రకటనతో ఇరుకునపడ్డ కేసీఆర్
14-12-2019

తొలిసారి జగన్‌కు చంద్రబాబు సపోర్ట్..దిశ బిల్లుకు సభ ఆమోదం
13-12-2019

క్షమాపణలు చెప్పను.. మోడీ కూడా అదేమాటన్నారు!
13-12-2019

ఈ రంగులేంటి? వైసీపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
13-12-2019

విమర్శలను ఎదుర్కొనే దమ్ములేదా?
13-12-2019

చంద్రబాబుపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం
13-12-2019
ఇంకా