newssting
BITING NEWS :
* మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

అవినీతిపై జగన్ సమరం ఫలించేనా?

11-06-201911-06-2019 08:38:45 IST
Updated On 24-06-2019 12:29:51 ISTUpdated On 24-06-20192019-06-11T03:08:45.333Z11-06-2019 2019-06-11T03:08:12.056Z - 2019-06-24T06:59:51.547Z - 24-06-2019

అవినీతిపై జగన్ సమరం ఫలించేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో కొత్త మంత్రిమండలి తొలి సమావేశం వాడివేడిగా సాగిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్ తనదైన మార్కుని ఈ సందర్భంగా చూపించారు. మంత్రి అయిపోయా.. హ్యాపీగా సంపాదించుకోవచ్చనే ధోరణికి ఆదిలోనే అడ్డుకట్ట వేశారు సీఎం జగన్. మంత్రిమండలి సమావేశం సాక్షిగా దిశానిర్దేశం చేశారు.

తమది రైతు రాజ్యమనే పేరు వచ్చిందని, అందుకోసం రైతు సంక్షేమానికి పెద్దపీట వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రైతులు, మహిళల వల్లే తమకు అంత మెజారిటీ వచ్చిందనే భావన జగన్మోహన్ రెడ్డిలో ఉందనే చెప్పాలి.

రైతులకు ఇచ్చిన హామీలు సత్వరం అమలు చేయాలని జగన్ నిర్ణయించారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేత, రైతు భరోసా, ప్రకృతి విపత్తుల నిధి, కనీస మద్దతు ధరకు స్థిరీకరణ నిధి, రైతు మిషన్‌ ఏర్పాటు తదితర అంశాలపై రైతులకు వివరించాలని సూచించారు.

ప్రస్తుతం మంత్రివర్గంలోకి తీసుకున్న మంత్రులకు రెండున్నరేళ్ల పదవీకాలం ఉంటుందని, ఈ రెండున్నరేళ్ల పదవీకాలం ఉందికదా అని ఎవరు ఇష్టానుసారంగా వారు వ్యవహరిస్తే మాత్రం మరుక్షణమే ఆపదవి నుండి తొలగించేస్తామని హెచ్చరించారు. 

ఒక్క అవినీతి మరక కూడా మంత్రులపై రాకూడదన్నారు. మనచుట్టూ ఉండేవారు, అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, వారుచేసే పనులకు మనం బాధ్యత వహించే పరిస్థితి రాకూడదని చెప్పారు.

రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణమే అయినప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగానే అప్రమత్తం చేస్తున్నానంటూ సీఎం మంత్రులకు చెప్పడం విశేషం. దీనిద్వారా మంత్రులతోపాటు, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఒక సంకేతాన్ని పంపేందుకు సీఎం చేసిన ప్రయత్నం ఫలించిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

కేబినెట్ భేటీ తర్వాత బయటకు వచ్చిన మంత్రుల్లో ఎక్కువమంది, ముఖ్యంగా తొలిసారి మంత్రులు అయినవారు అవినీతిమీదే చర్చించుకోవడం ఇందుకు నిదర్శనంగా కనిపించింది. ఈ క్రమంలోనే మంత్రులు కూడా ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి సీఎం ఆలోచనలను వారికి పూర్తిస్థాయిలో వివరించాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు.

అవినీతి మరకలు అంటితే తమ పదవులకే ఎసరువచ్చే పరిస్థితి ఉన్నందున ఆయా శాఖల్లో అవినీతి తిమింగలాలపై కూడా మంత్రులు దృష్టిసారించాలని నిర్ణయించుకున్నారు. తొలిరోజు సీఆర్డీయే అధికారులతో ఆ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా అవినీతిమీదే పెద్ద చర్చ నడిచింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలను తిరిగి తవ్వడం ప్రారంభమయిందని అంటున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle