newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

‘‘అవినీతిపరులు అరెస్టయితే ఎందుకిన్ని డ్రామాలు?’’

16-06-202016-06-2020 09:47:27 IST
Updated On 16-06-2020 10:57:02 ISTUpdated On 16-06-20202020-06-16T04:17:27.851Z16-06-2020 2020-06-16T04:16:18.730Z - 2020-06-16T05:27:02.345Z - 16-06-2020

‘‘అవినీతిపరులు అరెస్టయితే ఎందుకిన్ని డ్రామాలు?’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో టీడీపీ నేతల అరెస్టులపై రచ్చ రేగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు టీడీపీ నేతల తీరుని విమర్శిస్తున్నారు. అవినీతిపరుల అరెస్ట్‌లపై చంద్రబాబు, లోకేశ్‌ డ్రామాలు ఆడుతున్నారని, తాడిపత్రిలో లోకేశ్‌ మాటలు హాస్యాస్పదంగా వున్నాయని మంత్రి అనిల్ తీవ్రంగా మండిపడ్డారు. 

మేం వస్తున్నాం... వడ్డీతో సహా చెల్లిస్తామంటూ లోకేశ్‌ బీరాలు పలకటమా? కరోనా దెబ్బకు 3 నెలలుగా చంద్రబాబు, లోకేశ్‌ ఇంటి నుంచి బయటకు రాలేదని, కనీసం ఈ రాష్ట్రంలో వుండలేక భయంతో హైదరాబాద్‌లో దాక్కున్నారన్నారు. గతంలో చంద్రబాబు అవినీతిపై ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకం వేశామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ మాట్లాడారు. 

సచివాలయ నిర్మాణం, ఇసుక, సదావర్తీ భూములు, చంద్రన్న కానుకలు, ఫైబర్ గ్రీడ్, విశాఖ ల్యాండ్ స్కాం, క్యాపిటల్ ల్యాండ్ స్కాం... ఇలా టిడిపి హయాంలో జరిగిన దోపిడీని బయటపెట్టామని.. అనిల్ గుర్తు చేశారు. చంద్రబాబు అన్ని స్కీంలను స్కాంలుగా మార్చేశాడని ఆరోపించామని అనిల్‌ గుర్తు చేశారు. ఆనాడే మీకు చిత్తశుద్ది వుంటే... వాటిపై విచారణ జరిపి నిజాయితీని నిరూపించుకునేవారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అవినీతిపై విచారణ జరిపిస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆనాడే చెప్పారని అనిల్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు.

మాట ఇచ్చిన విధంగానే ఇప్పుడు ఈ అవినీతి కుంభకోణాలపై విచారణ జరిపిస్తున్నాం. ఏడాది కాలంలో మాపై ఎవరూ ఏం చేయలేకపోయారంటూ లోకేశ్ సవాల్ చేశారు. ఇప్పుడు అవినీతిపరులపై చర్యలు తీసుకుంటూ వుంటే... తట్టుకోలేకపోతున్నారు. కార్మికుల మందుల్లో రూ.151 కోట్లు దోచేసిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని సమర్థిస్తారా? నకిలీ పత్రాలతో 150 పై చిలుకు బస్సులు నడిపి ఎంతోమంది ప్రాణాలను బలికొన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి చంద్రబాబు అండగా నిలుస్తారా? వీరిద్దరూ చంద్రబాబు, లోకేశ్‌లకు సత్యహరిశ్చంద్రులా కనిపిస్తున్నారా అని అనిల్ కుమార్  యాదవ్ ప్రశ్నించారు. ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని అక్రమాలు, అవినీతి చేసే ఇలాంటి వారికి చంద్రబాబు వత్తాసు పలుకుతున్నాడని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో బీసీలకు, అగ్రవర్ణాలకు వేర్వేరుగా చట్టాలు వున్నాయా? తప్పు చేసింది ఎవరైనా సరే వారికి చట్టం ఒకే విధంగా వుంటుందని రూ.151 కోట్ల స్కాం చేసిన వ్యక్తిని స్వాతంత్ర సమరయోధుడు, బిసిలను ఉద్దరించిన వ్యక్తిగా కీర్తిస్తారా? అసలు లోకేశ్‌కు కొంచెమైనా బుద్దీ, జ్ఞానం వుందా అని అనిల్ ప్రశ్నించారు. చంద్రబాబు అండదండలతో కార్మికుల మందుల సొమ్మను పందికొక్కులా తింటే.. వారిని అరెస్ట్ చేస్తే... బిసిలు ఏకం కావాలని లోకేశ్‌పిలుపునివ్వటం ఏంటని అనిల్ మండిపడ్డారు. 

లోకేశ్‌ ఇక నైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. మరోసారి బిసిలకు సిగ్గు వుందా అని మాట్లాడితే.. దానికి తగిన విధంగా జవాబు ఇస్తామని అనిల్ హెచ్చరించారు. లోకేశ్‌ తన వయస్సుకు తగట్టు మాట్లాడటం లేదని. సవాల్ విసరడం, ఇంట్లోకి వెళ్లి దాక్కోవడం.. లోకేశ్‌కు అలవాటని అనిల్ ఎద్దేవా చేశారు. సవాల్ విసరడం నా పని... సమాధానం మా నాయన చూసుకుంటాడని లోకేశ్‌ అనుకుంటున్నాడన్నారు.

టీడీపీ పరిస్థితి రోజురోజుకు అధ్వాన్నంగా తయారవుతోందని అనిల్ తెలిపారు. కనుచూపు మేరలో అధికారం లేదు. తమ హయాంలో జరిగిన స్కాంలు బయటపడుతున్నాయి. భవిష్యత్తులో పార్టీ వుంటుందో.. లేదో ననే భయం చంద్రబాబు, లోకేశ్‌లకు పట్టుకుందిని.. ఇప్పటికే పార్టీ నేతలు కొందరు వైయస్‌ఆర్‌సీపీకి, మరికొందరు బిజెపికి, మరికొందరు శ్రీకృష్ణ జన్మస్థానంకు వెళ్ళిపోతున్నారని అనిల్ అన్నారు. 

ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలు చేసిన వారిని ఎవరినీ విడిచి పెట్టమని, అందరిపైన విచారణ జరిపి అరెస్ట్ చేస్తున్నామని అనిల్ తెలిపారు.  ఇప్పటికే రెండు వికెట్లు పడ్డాయి.... ఇంకా చాలా వికెట్లు వున్నాయి. టిడిపి హయాంలో అక్రమాలకు పాల్పడిన వారు శిక్షలకు సిద్ధంగా ఉండాలని అనిల్ హెచ్చరించారు. మీరు అక్రమాలకు పాల్పడకుండా వుంటే... మేం న్యాయపోరాటం చేస్తామని ధైర్యంగా ముందుకు రావాలన్నారు. అంతేకాని వడ్డీతో సహా చెల్లిస్తామని సవాల్ చేస్తారా? లోకేశ్‌ చిప్పకూడ గురించి ఎక్కువ మాట్లాడితే తదాస్తు దేవతలు దీవిస్తారు జాగ్రత్త అని అనిల్ అన్నారు. అధికారంలో వున్నప్పుడు అవినీతి చేసి ఇప్పుడు అధికారుల మీదికి నెట్టేందుకు ప్రయత్నిస్తారా అని అనిల్ మండిపడ్డారు. 

 

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

   3 hours ago


కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

   10 hours ago


మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

   10 hours ago


ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

   11 hours ago


టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

   a day ago


వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

   24-07-2021


మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

   24-07-2021


కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

   24-07-2021


ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

   24-07-2021


AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

   23-07-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle