newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

అవాక్క‌య్యే స్టోరీ.. భూమా ఫ్యామిలీ భూ వివాదం..!

23-11-201923-11-2019 10:19:11 IST
2019-11-23T04:49:11.598Z23-11-2019 2019-11-23T04:49:07.983Z - - 15-08-2020

అవాక్క‌య్యే స్టోరీ.. భూమా ఫ్యామిలీ భూ వివాదం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం భూమా ఫ్యామిలీలో ఏం జ‌రుగుతోంది..? అక్కపై త‌మ్ముడు ఎందుకు కేసు పెట్టాడు..?  భూ వివాద‌మా..?  లేక ఫ్యామిలీ డ్రామానా..? అన్న ప్ర‌శ్న‌ల‌పై విస్తృత స్థాయి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే, మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌కు సొంత త‌మ్ముడు షాక్ ఇస్తూ ఓ భూ వివాదంలో త‌న ఇద్ద‌రు అక్క‌ల‌పై భూమా నాగిరెడ్డి కుమారుడు జ‌గ‌త్ విఖ్యాత‌రెడ్డి కోర్టుకెక్కిన సంగ‌తి తెలిసిందే.

రంగారెడ్డి జిల్లాలో రెండు ఎక‌రాల భూమిని భూమా నాగిరెడ్డి బ‌తికి ఉన్న‌ప్పుడే రూ.2 కోట్లకు అమ్మారు. అప్పుడు మైన‌ర్‌గా ఉన్న విఖ్యాత‌రెడ్డి రిజిస్ట్రేష‌న్ టైమ్‌లో వేలి ముద్ర మాత్ర‌మే వేశారు. అయితే, త‌న‌కు తెలియ‌కుండా భూమి అమ్మ‌కం జ‌రిగింద‌ని, విఖ్యాత‌రెడ్డి ఇప్పుడు కోర్టులో కేసు వేశారు.

అయితే, విఖ్యాత‌రెడ్డి ఇప్పుడు ఎందుకు కోర్టును ఆశ్ర‌యించారు..?  ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్‌గా ఉన్నార‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆళ్ల‌గ‌డ్డ ఎన్నిక‌ల టైమ్‌లో కూడా విఖ్యాత‌రెడ్డి యాక్టివ్‌గా ఉన్నారు.

అక్క అఖిల‌ప్రియ‌తో క‌లిసి ప్ర‌చారం చేశారు. ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల్లో కూడా అక్క వెంటే న‌డిచారు. ఆళ్ల‌గ‌డ్డ‌లో త‌మ వ‌ర్గానికి అక్క త‌రువాత తానే అండ‌గా ఉంటాన‌న్న ప్ర‌క‌ట‌న‌లూ చేశారు.

అయితే, అఖిల‌ప్రియ ప్లేస్‌లో ఆళ్ల‌గ‌డ్డ‌లో విఖ్యాత‌రెడ్డి రావాల‌ని కొంద‌రు కార్య‌క‌ర్త‌లు కోరుకున్నారు. ఈ విష‌యంలో ఏమైనా కుటుంబంలో విభేదాలు వ‌చ్చి ఆస్తుల గొడ‌వ జ‌రిగిందా..? అని కొంద‌రు ఆరా తీశారు. అయితే, అస‌లు విష‌యం వేరే ఉంద‌ని తెలిసింది.

అయితే, భూమా ఉన్న‌ప్పుడే త‌మ బంధువుల‌కు హైద‌రాబాద్ శివారులోని భూమిని అమ్మారు. అయితే, ఇప్పుడు మారిన సమీక‌ర‌ణాల‌తో భూమి కొనుగోళ్ల దారుల‌ను ఇబ్బంది పెట్టేందుకే విఖ్యాత‌రెడ్డి సొంత అక్క‌ల‌పై కేసు వేశార‌ని ఓ ప్ర‌చారం న‌డుస్తోంది.

న్యాయ‌వాదుల స‌హాల మేర‌కు విఖ్యాత్‌రెడ్డి కోర్టును ఆశ్ర‌యించార‌ని, కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవ‌ని తెలుస్తుంది. ఈ కేసును వాదిస్తున్న లాయ‌ర్ కూడా భూమా అఖిల‌ప్రియ బంధువేన‌ని స‌మాచారం.

ఇటు ప్ర‌స్తుతం అఖిల ప్రియ ఫ్యామిలీతో క‌లిసి దుబాయ్ టూర్‌లో ఉన్నారు. త‌న త‌మ్ముడు త‌న‌తోపాటే ఉన్నార‌ని, త‌మ మ‌ధ్య భూ వివాదాలు లేవ‌ని దుబాయ్ నుంచి అఖిల ప్రియ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. మొత్తానికి భూమా ఫ్యామిలీలో లీగ‌ల్ ఫైట్ డ్రామా అన్న క్లారిటీ వ‌స్తోంది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle