newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

అవంతి ఎందుకు పార్టీ మారారంటే...!

15-02-201915-02-2019 15:28:38 IST
2019-02-15T09:58:38.677Z15-02-2019 2019-02-15T09:58:31.082Z - - 17-07-2019

అవంతి ఎందుకు పార్టీ మారారంటే...!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరిక వెనుక అనేక కారణాలున్నాయా? ఆయనపై వచ్చిన వత్తిడికే తలవొగ్గారా? అంటే అవుననే అంటున్నారు. అవంతి శ్రీనివాస్‌కి హైదరాబాద్‌లో విద్యాసంస్థలు, అనేక ఆస్తులు ఉన్నాయి. బెదిరించి వైసీపీలో చేర్చుకున్నారని చంద్రబాబు అన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ, టీఆర్ఎస్ హస్తం కూడా ఉందని చంద్రబాబే ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. నిన్నమొన్నటి వరకూ ఢిల్లీలో తనతో కలిసి ఉన్న అవంతి శ్రీనివాస్ హఠాత్తుగా ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారో అర్థం కావడం లేదన్నారు. 

పార్టీ కీలకనేతలతో కలిసి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు అవంతి పార్టీ మారడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, ప్రధాని మోదీ అంటే జగన్‌కి భయం అన్నారు. ఇద్దరినీ కాదని ఏం చేసినా జగన్ వెంటనే జైలుకెళ్తారని అన్నారు. ఈ ముగ్గురి కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను మించి అమరావతి అభివృద్ధి చెందితే మనుగడ ఉండదనేది జగన్, కేసీఆర్, మోడీ భయమని అన్నారు. స్థానిక పరిస్థితులు నేతలకు తెలుస్తుంటాయన్న టీడీపీ అధినేత... పార్టీకి నష్టం చేకూర్చే చర్యలు ఎక్కడ జరుగుతున్నా చెప్పాలని సూచించారు. 

ఆస్తులు, స్వప్రయోజనాల కోసం పార్టీని బలిచేయకూడదన్నారు. తమ కుటుంబానికి చెందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో ఉన్నారని, ఆయన భార్య పురందేశ్వరి బీజేపీలో ఉన్నారన్నారు. కుటుంబం వేరు, రాజకీయాలు వేరు అనే విషయాన్ని నేతలు గుర్తుంచుకోవాలని చంద్రబాబు సూచించారు. రాజకీయాల్లో ఉన్నా కుటుంబ సంబంధాలు ముఖ్యమన్నారు. పార్టీకి నష్టం చేకూర్చేవారిని ఉపేక్షించనన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle