newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

అలీ షాక్.... బాబు, పవన్‌లకు దిమ్మతిరిగే పంచ్!

11-03-201911-03-2019 13:06:02 IST
2019-03-11T07:36:02.192Z11-03-2019 2019-03-11T07:15:11.925Z - - 22-09-2019

అలీ షాక్.... బాబు, పవన్‌లకు దిమ్మతిరిగే పంచ్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. గంట క్రితం వరకూ ఆయాపార్టీల్లో వున్న నేతలు... గంట తర్వాత కండువాలు మార్చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అనుంగు మిత్రుడు, నిన్నమొన్నటి దాకా టీడీపీలో సీటు గ్యారంటీ అని ప్రచారం జరిగిన కామెడీ నటుడు అలీ వైసీపీ కండువా కప్పుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. వైఎస్ జగన్‌‌ను సీఎం చేయడమే ధ్యేయంగా తాను పనిచేస్తానని సినీ  నటుడు అలీ ప్రకటించారు. స్నేహం వేరు, రాజకీయాలు వేరంటూ అర్థం చెప్పుకొచ్చారు.  

తన మిత్రుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్  అయితే తాను విజయం సాధించినట్టే అంటున్నారు అలీ. టీడీపీలో స్పష్టమైన హామీ లభించనందునే తాను వైసీపీలో చేరినట్టుగా అలీ చెప్పడం విశేషం. లోటస్‌పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ సమక్షంలో అలీ వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదన్నారు. పదవులకోసం తాను జగన్ పార్టీలో చేరలేదంటున్నారు. వైసీపీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తానని అలీ చెప్పారు.

2004 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్‌ను కలిసి మీరే ముఖ్యమంత్రి అవుతారని తాను చెప్పానని అలీ గుర్తు చేసుకొన్నారు. నాడు వైఎస్ఆర్ పాదయాత్ర ప్రభావం ప్రజల్లో ఎలా ఉందో... ఇవాళ జగన్ పాదయాత్ర ప్రభావం కూడా ప్రజల్లో ఉందని చెప్పారు. గుంటూరు సిటీలోని ఓ స్థానం నుండి పోటీ చేసేందుకు టీడీపీ నుండి తనకు ఆఫర్ వచ్చిన విషయం వాస్తవమేనని అలీ అంగీకరించారు. అయితే తనకు టికెట్ ఇవ్వడం స్థానిక నేతలకు ఇష్టంలేదన్న సంగతి తనకు తెలిసిందని, అందుకే తాను టికెట్ కోసం ఎవరిపైన వత్తిడి తేవడం ఇష్టంలేక వైసీపీలో చేరానన్నారు. 

అలీ రాకతో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయంటున్నారు. అలీతో పాటు మరికొందరు సినీప్రముఖులు వైసీపీలో చేరతారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మరో హాస్యనటుడు థర్డ్ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీపీలో సినీ గ్లామర్ మెరుపులు కనిపిస్తున్నాయి. వీరి గ్లామర్ జగన్‌కి ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle