newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

అలా మాట్లాడింది చంద్ర‌బాబేనా..?

30-09-201930-09-2019 09:34:42 IST
Updated On 30-09-2019 14:49:06 ISTUpdated On 30-09-20192019-09-30T04:04:42.866Z30-09-2019 2019-09-30T04:04:38.277Z - 2019-09-30T09:19:06.718Z - 30-09-2019

అలా మాట్లాడింది చంద్ర‌బాబేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుని గ్రామ వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను అమ‌లులోకి తీసుకువ‌చ్చారు. గ్రామాల్లో గ్రామ వాలంటీర్‌, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో వార్డు వాలంటీర్ల పేరుతో ల‌క్ష మందికి పైగా నిరుద్యోగుల‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించారు. వీరి ద్వారా ప్ర‌భుత్వం అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు నేరుగా ల‌బ్ధిదారుల ఇళ్ల‌కే చేర్చాల‌నేది జ‌గ‌న్ ఉద్దేశ్యం. ఈ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌స్తాన‌ని జ‌గ‌న్ పాద‌యాత్ర‌లోనే ప్ర‌క‌టించారు. చెప్పిన‌ట్లుగానే అధికారంలోకి వ‌చ్చిన వంద రోజుల్లోపే అమ‌లు చేశారు.

అయితే, గ్రామ వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పై ప‌లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. గ‌తంలో తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను పెంచి పోషించింద‌ని, ఆ క‌మిటీలు అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాయ‌నే ఆరోప‌ణలు వైసీపీ స‌హా మిగ‌తా పార్టీలు చేశాయి. ఇప్పుడు జ‌గ‌న్ కూడా జ‌న్మ‌భూమి క‌మిటీల త‌ర‌హాలోనే గ్రామ వాలంటీర్ల‌ను తీసుకువ‌చ్చార‌నేది ప్ర‌తిప‌క్షాల వాద‌న‌. త‌మ పార్టీ వారికే ఈ ఉద్యోగాలు ఇచ్చార‌ని టీడీపీ ఆరోపిస్తోంది.

కొంద‌రు వైసీపీ నేత‌లు కూడా నోరుజారి ఈ విష‌యం చెప్ప‌డం ఈ విమ‌ర్శ‌ల‌కు మ‌రింత బ‌లాన్నిచ్చింది. అయితే, పార‌ద‌ర్శ‌కంగా వాలంటీర్ల ఎంపిక ప్ర‌క్రియ జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం స‌మ‌ర్థించుకుంది. ఇక‌, గ్రామ వాలంటీర్లకు సంబంధించిన విధుల‌పై కూడా టీడీపీ స‌హా ఇత‌ర పార్టీలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. గ్రామ వాలంటీర్లు రిక్షాల ద్వారా రేష‌న్ బియ్యం స‌ర‌ఫరా చేయాల‌ని టీడీపీ, జ‌న‌సేన శ్రేణులు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశాయి. చ‌దువుకున్న వారు చేసే ఉద్యోగ‌మా ఇది అని ప్ర‌శ్నించాయి. అయితే, ఇదంతా త‌ప్పుడు ప్ర‌చారం అని ప్ర‌భుత్వం చెప్పింది.

ఈ విమ‌ర్శ‌ల‌న్నీ ఎలా ఉన్నా తాజాగా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు గ్రామ వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పై చేసిన వ్యాఖ్య‌లు మాత్రం సంచ‌ల‌నంగా ఉన్నాయి. ఓ మ‌హిళ‌పై గ్రామ వాలంటీర్ వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌నే ఆరోప‌ణ చేసిన బాబు వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను త‌ప్పుప‌ట్టారు. గ్రామ వాలంటీర్ వ్య‌వ‌స్థ తీసుకురావాల‌ని ఎవ‌రు అడిగార‌ని ప్ర‌శ్నించారు. ఇళ్ల‌ల్లో మ‌గ‌వారు లేన‌ప్పుడు వాలంటీర్లు వెళ్లి త‌లుపులు కొడుతున్నార‌ని విమ‌ర్శించారు. గొనె సంచులు మోసే ఉద్యోగం ఇచ్చి పెద్ద ఘ‌న‌త‌గా వైసీపీ చెప్పుకుంటోంద‌ని ఎద్దేవా చేశారు.

చంద్ర‌బాబు చేసిన‌ వ్యాఖ్య‌లు మాత్రం వివాదాస్ప‌దంగా ఉన్నాయి. వైసీపీ శ్రేణులు సోష‌ల్ మీడియా వేదిక‌గా బాబు వ్యాఖ్య‌ల‌పై మండిప‌డుతున్నాయి. గ్రామ వాలంటీర్లు ఇళ్ల‌ల్లో మగ‌వారు లేన‌ప్పుడు త‌లుపులు కొడుతున్నార‌ని బాబు చేసిన వ్యాఖ్య‌లు మ‌హిళ‌ల‌ను, వాలంటీర్ల‌ను తీవ్రంగా అవ‌మానించేలా ఉన్నాయ‌ని వైసీపీ ఆరోపిస్తోంది. డోర్ డెలివ‌రీ వ్య‌వ‌స్థ అంతటా ఉంద‌ని, ముంబైలో డ‌బ్బావాలాల‌ను ఉద‌హ‌రిస్తోంది. ఈ కామ‌ర్స్ సైట్లు కూడా డోర్ డెలివ‌రీ చేస్తున్నాయి క‌దా అని వైసీపీ ప్ర‌శ్నిస్తోంది.

వైసీపీ విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా ఒక్క సంఘ‌ట‌న ఆధారంగా చంద్ర‌బాబు ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డం మాత్రం స‌రికాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ వ్య‌వ‌స్థ‌లో లోపాలు ఉంటే ప్ర‌తిప‌క్ష నేత‌గా స్పందించ‌డంలో త‌ప్పు లేదు గానీ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు మాత్రం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చేలా ఉన్నాయి. ఎప్పుడూ ఆచితూచి మాట్లాడే చంద్ర‌బాబు నోటి వెంట ఇటువంటి వ్యాఖ్య‌లు రావ‌డం కొంత ఆశ్చ‌ర్య‌క‌ర‌మే.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle