newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

అలా అయితే... విపక్షనేతగా మీరు ఫెయిలైనట్టే!

07-06-201907-06-2019 08:19:17 IST
Updated On 24-06-2019 15:25:23 ISTUpdated On 24-06-20192019-06-07T02:49:17.310Z07-06-2019 2019-06-07T02:49:13.598Z - 2019-06-24T09:55:23.373Z - 24-06-2019

అలా అయితే... విపక్షనేతగా మీరు ఫెయిలైనట్టే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉండవల్లి ప్రజావేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు కోరిన సంగతి తెలిసిందే. దీనిపై సెటైర్లు వేశారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి.

ముఖ్యమంత్రికి రాసే మొదటి లేఖలో ప్రజా సంబంధిత అంశాలు లేవని ఎద్దేవా చేసిన విజయ సాయిరెడ్డి.. "సిఎం జగన్ గారికి చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యల పైన ఉంటుందనుకున్నాం. 40 ఏళ్ల అనుభవానికి తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా,  పోతుందా అనే సంశయం తప్ప ఇంకేమీ కనిపించడం లేనట్టుంది.

Image may contain: one or more people and text

ప్రపంచం మొత్తాన్నిఅమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా?'' అంటూ ట్వీట్ చేసి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు చురకలు అంటించారు విజయసాయిరెడ్డి. ఈ సైటెర్లు టీడీపీ నేతలను ఇరుకునపెడుతున్నాయి.

గత రెండునెలలుగా విజయసాయిరెడ్డి ప్రతి అంశంలో టీడీపీ నేతలను, ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తున్నారు. ఢిల్లీలో తెగ తిరిగేసిన చంద్రబాబుని ఎద్దేవా చేశారు. పెవికాల్ బాబా అంటూ ఆయన విమర్శించిన సంగతి తెలిసిందే. 

 ఇది కూడా చదవండి... బాబుని పెవికాల్ బాబా అంటున్న విజయసాయి


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle