newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

అరె సాంబ రాసుకో.. నన్ను మోసం చేశావ్!

09-04-201909-04-2019 08:39:18 IST
Updated On 09-04-2019 08:40:40 ISTUpdated On 09-04-20192019-04-09T03:09:18.544Z09-04-2019 2019-04-09T03:07:31.010Z - 2019-04-09T03:10:40.798Z - 09-04-2019

అరె సాంబ రాసుకో.. నన్ను మోసం చేశావ్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

Image result for ali and pawan kalyan in gabbar singh

పవన్ కళ్యాణ్.. అలీ.. సినిమాల్లో వీరిద్దరూ ప్రాణ మిత్రులు. పవన్ నటించిన ప్రతి సినిమాలో అలీ ఉండాల్సిందే అనేలా వీరి బంధం ఉండేది. కానీ ఇప్పుడు వీరిద్దరూ తలో పార్టీలో వున్నారు. అలీ రాజకీయాల్లోకి వస్తున్నారని, ఖచ్చితంగా పవన్ జనసేనలో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ అలీ మాత్రం సైకిల్ చుట్టూ తిరిగి.. చివరాఖరికి ఫ్యాన్ గాలి కిందకి చేరారు. రాజకీయాల్లో ఇవన్నీ కామన్. కానీ మిత్రుడు అలీ తీరుపై పవన్ కామెంట్లు చేశారు.

అలీ తనకు మిత్రుడైనా వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో చేతులు కలిపారన్నారు. అలీ చెప్పిన వాళ్లకు టిక్కెట్‌ ఇచ్చినా తనను వదిలి వెళ్లాడని పవన్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అలీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను ఎంతో అండగా ఉన్నానని, తనతో కలిసి పనిచేస్తానన్నఅలీ చెప్పా పెట్టకుండానే వైసీపీలోకి వెళ్లిపోయారన్నారు. 

అలీ లాంటి వ్యక్తుల వల్ల మనుషులపై నమ్మకం పోతుందని వ్యాఖ్యానించడం గమనార్హం. అవసరంలో తాను ఆదుకున్న అలీ లాంటి వాడే వదిలేస్తే ఇంకా ఎవరిని నమ్మాలన్నారు. అందుకే ప్రజలను తప్ప బంధుమిత్రులను కూడా నమ్మడం లేదన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఓటుకు రూ.2వేలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, అలీని జగన్‌ వాడుకొని వదిలేస్తారని పవన్‌ ఆరోపించారు. చిరకాల మిత్రుడిపై పవన్ కామెంట్లు అటు పొలిటికల్, ఇటు సినిమా సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle