newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

అయ్య బాబోయ్ అంత ఖర్చా?

24-03-201924-03-2019 08:58:37 IST
2019-03-24T03:28:37.162Z24-03-2019 2019-03-24T03:14:18.299Z - - 22-09-2019

అయ్య బాబోయ్ అంత ఖర్చా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పోటీ పడి టిక్కెట్ సంపాదించుకున్న గుంటూరు జిల్లా టీడీపీ అభ్యర్ధులు, ఇప్పుడు ఖర్చుకు భయపడుతున్నారట. ముఖ్యంగా గుంటూరు లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో దాదాపుగా ఈ పరిస్థితే నెలకొన్నట్లు తెలుస్తోంది. గుంటూరు లోక్‌‌సభ సీటు పరిధిలో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలు ఉన్నాయి.

 ఇక్కడ టీడీపీ నుంచి లోక్ సభ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని ఆయన ఢీ కొడుతున్నారు. అయితే ఇప్పుడు గల్లాకు సొంత పార్టీ నేతల నుంచే చిక్కులు వచ్చాయట. ఎందుకంటే పొన్నూరు నుంచి పోటీ చేస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, తెనాలి నుంచి పోటీ చేస్తున్నఆలపాటి రాజేంద్రప్రసాద్, మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్ మినహా మిగిలిన అభ్యర్ధులు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేరట. 

తమ దగ్గర డబ్బులు లేవని, బాగా అప్పుల్లో ఉన్నామని గల్లా జయదేవ్ దగ్గర మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మహ్మద్ నసీర్, తాడికొండ నుంచి పోటీ చేస్తున్న తెనాలి శ్రావణ్ కుమార్, ప్రత్తిపాడు నుంచి పోటీ చేస్తున్న డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

తమ ఖర్చు కూడా మీరే పెట్టుకోవాలంటూ గల్లా జయదేవ్‌కు చెప్పారట. కనీసం 10 కోట్ల రూపాయలు ఇస్తేనే తాము ధైర్యంగా ప్రచారంలోకి దిగుతామని చెప్పడంతో, ఏం చేయాలో ఇప్పుడు గల్లాకు పాలుపోవడం లేదని సమాచారం. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle