newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

అయ్యో బాబూజీ అంతలేదక్కడ..!

14-03-201914-03-2019 12:27:25 IST
Updated On 14-03-2019 19:57:10 ISTUpdated On 14-03-20192019-03-14T06:57:25.677Z14-03-2019 2019-03-14T06:57:23.641Z - 2019-03-14T14:27:10.737Z - 14-03-2019

అయ్యో బాబూజీ అంతలేదక్కడ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జగన్- మోడీల మధ్య సంబంధం ఉందని ఒక ఛానల్ స్టింగ్ ఆపరేషన్‌లో నిరూపించినందుకు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెగ సంబరపోతున్నట్లే కనిపిస్తోంది. ఆయన తనకు తప్ప అందరికీ మోడీతో సంబంధాలున్నట్లు చాలాకాలం నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. ముందుగా కెసిఆర్, జగన్ ఇద్దరూ మోడీతో  కుమ్మక్కైయ్యారని చెప్పిన బాబు... ఆ తరువాత కొన్ని రోజులపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరును కూడా వాటితో జత చేశారు. ఈ మధ్య కాలంలో ఏమైందో ఏమోకానీ ఆ లిస్టులో నుంచి పవన్ పేరు తొలగించారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ గురించి ఎవరూ ఏమీ మాట్లాడొద్దంటూ పార్టీ నాయకులకు తాఖీదులు కూడా జారీ చేశారు. 

ఇప్పుడు జగన్ వైస్సార్సీపీకీ మోడీకి సంబంధాలున్నాయని, ఈడీ కేసుల్ని సిబిఐ నీరు కార్చడానికి అసలు కారణం మోడీ ప్రభుత్వమేనంటూ కొన్ని పాత కాగితాల్ని బయటకుతీసారు బాబు. ఇదేదో కొత్తగా కనిపెట్టిన విషయమూ కాదు... దీని మూలంగా చంద్రబాబుకు ఎన్నికల్లో రాజకీయంగా చెప్పుకోదగిన ప్రయోజనం కూడా కలగదన్నది విశ్లేషకుల మాట. గతంలో బాబు-మోడీల మధ్య సంబంధానికి జనం ఎంత విలువనిచ్చారో ఇప్పుడు జగన్-మోడీల మధ్య సంబంధానికి కూడా అంతే విలువను ఇస్తారు. 

గత ఏడాది విజయసాయి రెడ్డి పదేపదే ప్రధానిని కలవడానికి పార్లమెంటు హౌసులో పడ్డ తాపత్రయాల్ని మీడియా చూపించింది కూడా ! కేసుల నుంచి తమను బయటపడేస్తే అందుకు ప్రతిగా మోడీ ప్రభుత్వాన్ని సమర్థిస్తామని జగన్ చెప్పినట్లుగా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే మోడీ-జగన్‌ల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రశాంత్ కిశోర్ సంధానకర్తగా వ్యవహరించాడన్నది నిజమో కాదో కానీ ఈ విషయంలో విజయసాయి రెడ్డి తనకున్న సంబంధాలను వినియోగించారని చెప్తారు. 

తాజాగా ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ బయటపెట్టిన స్టింగ్ ఆపరేషన్ ఒక స్థానిక నాయకుడికి సంబంధించిన చిన్నపాటి ఇంటర్వ్యూ మాత్రమే ! వైస్సార్సీపీ-బీజేపీలమధ్య సయోధ్య కొనసాగుతోందన్న విషయం పెద్ద వార్తేమీ కాదు. కాకపోతే దాన్ని ఎస్టాబ్లిష్ చెయ్యడానికి బాబు పడిపోతున్న ఆపసోపాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. విభజన హామీలను నెరవేర్చని మోడీతో జగన్ కుమ్మక్కయ్యాడన్న దాని కంటే ప్రజలు జగన్ కెసిఆర్‌తో కుమ్మక్కయ్యాడన్న విషయాన్నే సీరియస్‌గా తీసుకుంటారు. మోడీని పదేపదే బూచిగా చూపించడం వలన బాబుకు ఒనగూరే రాజకీయ ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదన్నది అందరూ అనుకుంటున్న మాట! 

కెసిఆర్ తన ప్రచార రథాన్ని జగన్ వాడుకోవడానికి ఇచ్చిన వార్త ఇంకా టైమ్స్ నౌ చేసిన స్టింగ్ ఆపరేషన్ కంటే ప్రభావం ఎక్కువగా ఉండే వార్త. అది కూడా ఎక్కడో నెల్లూరు జిల్లాలో మారుమూల కుగ్రామంలో దానికి జగన్ పార్టీ రంగులు మార్చుతున్నారన్న వార్త మీడియాలో వచ్చింది. ఇటువంటి వార్తలు జగన్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉందన్నది వాస్తవం. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle