newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

అయ్యప్ప భక్తులకు సకల సదుపాయాలు

06-11-201906-11-2019 08:58:34 IST
2019-11-06T03:28:34.249Z06-11-2019 2019-11-06T03:27:50.856Z - - 05-08-2020

అయ్యప్ప భక్తులకు సకల సదుపాయాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అక్టోబర్ నుంచి జనవరి వరకూ అయ్యప్ప భక్తులు మాలధారణతో చాలా నిష్టగా వుంటారు. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు శబరిమల అయ్యప్పను దర్శించుకుంటారు.

స్వామి అయ్యప్ప ఐదు రాష్ట్రాలను కలిపారని, అయ్యప్ప భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టడం పై తిరువనంతపురం సమావేశంలో చర్చించామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

కేరళ అధికారులతో భేటీ అయిన ఏపీ మంత్రి వెల్లంపల్లి పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా అయ్యప్ప భక్తులు ప్లాస్టిక్ సంచులు వాడకం పూర్తిగా తగ్గించాలని,  కేరళలో ప్లాస్టిక్ నిషేధం అమలులో వుందన్నారు. 

ఐదు రాష్ట్రాల అయ్యప్ప భక్తులను ప్లాస్టిక్ నిషేధం కు సహకరించాలని కేరళ సీఎం పినరయి విజయన్ కోరారు. కేరళ సీఎం ఆహ్వానం మేరకు తిరువనంతపురం వెళ్లిన వెల్లంపల్లి ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు దేవదాయ శాఖ మంత్రులతో భేటీ అయ్యారు. 

ఏపీ నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాముల కోసం కొండపైన, కొండ దిగువన అతిథి గృహం, వసతి నిర్మాణానికి కేరళ ప్రభుత్వాన్ని స్థలం కేటాయించమని ఏపీ ప్రభుత్వం కోరింది.

శబరిమలలోని శ్రీధర్మశాస్త దేవాలయంలో నవంబరు 17 నుంచి మండల, మకరవిల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన, ఇతర అంశాలపై చర్చించేందకు కేరళ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేవాదాయశాఖ మంత్రులతో సమావేశం నిర్వహించింది. 

ఈసందర్భంగా అయ్యప్ప భక్తుల కోసం పలు సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం పంబ సన్నిధిలో టోల్ ఫ్రీ సర్వీస్ ఏర్పాటు చెయ్యాలని, రాష్ట్ర పోలీసులు మరియు అధికారులతో  కలిపి నీలకంఠ, పంబ బేస్ క్యాంప్ వద్ద శబరిమల సమాచార వ్యవస్థ తో  పాటు తెలుగు అయ్యప్పలకు సమాచారం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. 

పంబ మార్గములో ప్రయాణించే బస్సు బోర్డులపై పెద్దగా స్పష్టంగా తెలుగు భాషలో ఏర్పాటు చేయాలని, నీలకంఠ, పంబ సన్నిధి వద్ద అయ్యప్ప భక్తులకు తాగునీరు భోజన అల్పాహార కేంద్రాలను విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేయాలని కోరారు.

విజయవాడ నుంచి తీసుకువెళ్లిన కనకదుర్గమ్మ వారి చిత్రపటాలు, ప్రసాదాలను కేరళ సీఎంతో పాటు ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు ఏపీ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అందించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle