newssting
BITING NEWS :
* మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

అయ్యన్న నోట కూటమి మాట.. ఆ మూడుపార్టీలు కలుస్తాయా?

03-09-201903-09-2019 08:39:43 IST
Updated On 05-09-2019 16:30:00 ISTUpdated On 05-09-20192019-09-03T03:09:43.488Z03-09-2019 2019-09-03T03:09:03.794Z - 2019-09-05T11:00:00.540Z - 05-09-2019

అయ్యన్న నోట కూటమి మాట.. ఆ మూడుపార్టీలు కలుస్తాయా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చింతకాయల అయ్యన్నపాత్రుడు.. టీడీపీలో కీలక నేత, మాజీమంత్రి. ఆయన నోట ఏదైనా స్టేట్ మెంట్ వస్తే దానికి విశ్వసనీయత వుంటుందని చాలామంది టీడీపీ నేతలు భావిస్తారు.

రాష్ట్రంలో 2024లో జరిగే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలో దిగుతాయని అయ్యన్నపాత్రుడు కామెంట్ చేశారు. ఎప్పుడో జరిగే ఎన్నికల గురించి ఇప్పటినుంచే టీడీపీ నేతలు దీర్ఘాలోచనలు చేస్తున్నారు. అంతేకాదు, ముందస్తు ఎన్నికలు గ్యారంటీ అంటున్నారు.

లోక్ సభకు కూడా  ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని జోస్యం చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలపై ఆసక్తిగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

2014 తరహాలోనే బీజేపీ, జనసేన పార్టీలతో టీడీపీ దోస్తీ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది,  2014 ఎన్నికల్లో చంద్రబాబుకి మద్దతు ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెరవెనుక టీడీపీతో ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.

తాజాగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రవిమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్ తీరుపై వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నారు.  చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ పోటీచేసిన మంగళగిరిలో జనసేన అభ్యర్థిని నిలబెట్టకపోవడం ఏంటని వైసీపీ ప్రశ్నించింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు సుజనా చౌదరి. గరికపాటి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్  బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పోలవరం రీటెండరింగ్, అమరావతి విషయంలో టీడీపీ-బీజేపీ వాయిస్ ఒకేలా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా టీడీపీ-బీజేపీ టార్గెట్ గా ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ కీలకనేత అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బలమయిన ప్రత్యర్ధిని ఎదుర్కొనేందుకు ఈ మూడుపార్టీలు కలిసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు కదా.  ఏమో ఏనుగు ఎగరా వచ్చు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle