newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

అమ‌రావ‌తి భూముల చిట్టా.. ఎవరెవ‌రికి ఎన్ని ఎక‌రాలు..?

03-01-202003-01-2020 10:33:37 IST
Updated On 03-01-2020 10:34:41 ISTUpdated On 03-01-20202020-01-03T05:03:37.114Z03-01-2020 2020-01-03T05:03:34.820Z - 2020-01-03T05:04:41.130Z - 03-01-2020

అమ‌రావ‌తి భూముల చిట్టా.. ఎవరెవ‌రికి ఎన్ని ఎక‌రాలు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ‌ధాని అమ‌రావ‌తిలో టీడీపీ పెద్ద‌లు చేసిన ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక వీడియోను విడుద‌ల చేసింది. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌లో టీడీపీ నేత‌లు కొనుగోలు చేసిన భూముల వివ‌రాల‌ను మంత్రులే స్వ‌యంగా మీడియా ముందుకొచ్చి వీడియో రూపంలో వివ‌రిస్తార‌ని తొలుత ప్ర‌చారం సాగింది. అయితే, వైసీపీ ఎమ్మెల్యేలు అంబ‌టి రాంబాబు, తోపుదుర్తి ప్ర‌కాష్‌రెడ్డిలు ఈ వీడియోను మీడియా స‌మావేశంలో ప్ర‌ద‌ర్శించారు.

ఈ వీడియోలో ప‌లు కీల‌క అంశాల‌ను వైసీపీ వివ‌రించింది. చంద్ర‌బాబు సీఎం అయిన‌ప్ప‌టి నుంచి రాజ‌ధాని ప్ర‌క‌ట‌న రావ‌డం వ‌ర‌కు ప్ర‌స్తుత రాజ‌ధాని ప్రాంతంలో టీడీపీ నేత‌లు పెద్త ఎత్తున భూముల కొనుగోలు చేసిన‌ట్టు బ‌య‌ట‌పెట్టింది. వీడియోలోని వివ‌రాల ప్ర‌కారం 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు రాజ‌ధాని ప్రాంతంలో మొత్తం 4,069.95 ఎకరాల‌ను టీడీపీ నేత‌లు కొనుగోలు చేశారు.

రాజ‌ధాని ఎక్క‌డ వ‌స్తుందో ముందే తెలుసుకుని వివిధ జిల్లాల‌కు చెందిన టీడీపీ నేత‌లు రాజ‌ధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. అలా భూములు కొనుగోలు చేసిన వారిలో ఒకేసామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌లు కూడా అత్య‌ధికంగా ఉన్నారు. హెరిటేజ్ సంస్థ చంద్ర‌బాబు సీఎం అయిన నెల రోజుల‌కే తాడికొండ మండ‌లం కంతేరు గ్రామంలో 14.22 ఎక‌రాల భూమిని కొనుగోలు చేసింది. ఈ భూముల కోసం ఎన్నో రింగు రోడ్డుల‌ను చంద్ర‌బాబు దారి మ‌ళ్లించారు.

పయ్యావుల కేశ‌వ్‌, ఆయ‌న వ్యాపార భాగ‌స్వామి రాజ‌ధాని ప్రాంతంలో 15.30 ఎక‌రాలు కొనుగోలు చేశారు. మాజీ మంత్రి టీడీపీ నేత ప‌ల్లె రఘునాథ‌రెడ్డి 7.56 ఎకరాలు కొనుగోలు చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మ‌ల‌పాటి శ్రీ‌ధ‌ర్ త‌న కంపెనీ పేరున 68.6 ఎక‌రాలు కొనుగోలు చేశారు. బీజేపీలో చేరిన లంకా దిన‌క‌ర్ ఢిల్లీలో ఏపీలో ప్ర‌త్యేక ప్ర‌తినిధిగా చంద్ర‌బాబు హ‌యాంలో వ్య‌వ‌హ‌రించిన కంభంపాటి రామ్మోహ‌న్‌కూడా రాజ‌ధాని ప్రాంతంలో భూముల‌ను కొనుగోలు చేశారు.

ప‌రిటాల సునీత కుమారుడు ప‌రిటాల శ్రీ‌రామ్‌, ఆమె అల్లుడు వ‌డ్ల‌మూడి శ్రీ‌హ‌ర్ష భారీగా భూములు కొన్నారు. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి అల్లుడు పుట్టా మ‌హేష్ రాజ‌ధానిలో ఏడు ఎక‌రాల భూమిని కొన్నారు. కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు త‌న బినామీ కంపెనీ పేరు మీద 17.13 ఎక‌రాలు కొనుగోలు చేశారు. మాజీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు ఏకంగా 38.84 ఎక‌రాల భూమిని కొనుగోలు చేశారు.

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర 13.5 ఎక‌రాల భూమిని సొంతం చేసుకున్నారు. మాజీ మంత్రి నారాయ‌ణ త‌న బినామీల పేరుతో 55.27 ఎక‌రాల భూమిని కొనుగోలు చేశారు. బీజేపీలో చేరిన రావెల కిశోర్‌బాబు కూడా త‌న కంపెనీ పేరున 40.85 ఎక‌రాల భూమిని కొనుగోలు చేశారు. టీడీపీ నేత జీవీ ఆంజ‌నేయులు రాజ‌ధాని ప్రాంతంలో 53.48 ఎక‌రాలు కొన్నారు.

చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌భుత్వ ఐటీ స‌ల‌హాదారుడిగా ప‌నిచేసిన వేమూరి హ‌రిప్ర‌సాద్ సోద‌రుడు ర‌వికుమార్ బృందం 62.7 ఎక‌రాల భూమిని కొనుగోలు చేసింది. వేమూరి ర‌వికుమార్ నారా లోకేష్‌కు బినామీగా, వైసీపీ ఆరోపించింది. బాల‌కృష్ణ వియ్యంకుడికి 499 ఎక‌రాల భూమి రాజ‌ధాని ప్రాంతంలో ఉంది. ఆస‌క్తిక‌ర‌మైన అంశ‌మేమిటంటే...?  రాజ‌ధాని ప్రాంతంలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ స‌మ‌యంలో భూములు కొన్న‌వారిలో 860 మంది తెల్ల‌రేష‌న్ కార్డుదారులు ఉన్నారు.

వారిలో 60 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన‌వారు కోట్లు విలువ చేసే భూములు కొన్న తెల్ల‌రేష‌న్ కార్డు దారులు టీడీపీ నేత‌ల‌కు బినామీలుగా భావిస్తున్నారు. అసైన్డ్ భూముల‌కు ప్ర‌భుత్వం ఎలాంటి న‌ష్ట‌ప‌రిహారం అందించ‌దంటూ ద‌ళితులు, బీసీలు, పేద‌లను బెద‌ర‌గొట్టి ఆ భూముల‌ను టీడీపీ నేత‌లు తీసుకున్నారు. ఆ పేర్ల‌ను కూడా వైసీపీ వెల్ల‌డించింది.

నారా లోకేష్‌కు స‌న్నిహితులైన కొల్లి శివ‌రామ్ 47.39 ఎక‌రాల అసైన్డ్ ల్యాండ్‌ను సొంతం చేసుకున్నారు. నారా లోకేష్‌కు స‌న్నిహితుడైన మ‌రొక‌రు గుమ్మ‌డి సురేష్ 49.92 ఎక‌రాలు, నారా లోకేష్ వెంట ఉండే బ‌లుసు శ్రీ‌నివాస‌రావు 14.07 ఎక‌రాల అసైన్డ్ భూమిని ద‌ళితులు, పేద‌ల నుంచి త‌క్కువ ధ‌ర‌కే తీసుకున్నారు. అలా అసైన్డ్ భూమి త‌మ చేతికి రాగానే ఆ భూముల‌కు కూడా ప్లాట్లు ఇచ్చేలా జీవోల‌ను జారీ చేయించుకున్నార‌ని వైసీపీ వివ‌రించింది.

ద‌ళితుల నుంచి మొత్తం 3,38.8 ఎక‌రాల అసైన్డ్ ల్యాండ్‌ను టీడీపీ నేత‌లు తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ స‌రిహ‌ద్దుల‌ను మార్చ‌డం ద్వారా లింగ‌మ‌నేని ర‌మేష్‌, మాజీ ఎంపీ ముర‌ళీ మోహ‌న్‌తోపాటు ప‌లువురు టీడీపీ నేత‌ల‌కు చెందిన భూముల‌కు మేలు చేసిన‌ట్టు వైసీపీ ఆ వీడియోలో వివ‌రించింది.

లింగ‌మ‌నేని ర‌మేష్‌కు చెందిన ఎస్టేట్స్‌కు స‌రిగ్గా ప‌ది మీట‌ర్ల దూరంలోనే ల్యాండ్ పూలింగ్ ప్రాంతం ఆగిపోయింది. దాంతో లింగ‌మ‌నేని భూముల‌కు భారీగా విలువ వ‌చ్చేలా చేశారు. అందుకు ప్ర‌తిఫ‌లంగానే లింగ‌మ‌నేని ర‌మేష్ క‌ర‌క‌ట్ట వ‌ద్ద ఉన్న గెస్ట్‌హౌస్‌ను చంద్ర‌బాబు నాయుడుకు గిఫ్ట్‌గా ఇచ్చార‌ని వైసీపీ ఆరోపించింది. 

చదవండి: ఆరోప‌ణ‌లు స‌రే.. ఆధారాలేవి..?


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle