newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

అమ‌రావ‌తిలోని 33 వేల ఎక‌రాల‌పై ప్ర‌భుత్వం మాస్ట‌ర్ ప్లాన్..!

04-01-202004-01-2020 12:09:05 IST
Updated On 04-01-2020 13:07:36 ISTUpdated On 04-01-20202020-01-04T06:39:05.002Z04-01-2020 2020-01-04T06:39:02.634Z - 2020-01-04T07:37:36.849Z - 04-01-2020

అమ‌రావ‌తిలోని 33 వేల ఎక‌రాల‌పై ప్ర‌భుత్వం మాస్ట‌ర్ ప్లాన్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో ప‌రిపాల‌న‌ను వికేంద్రీక‌రించేంద‌కు ప్ర‌భుత్వం సిద్ధ‌మైన‌వేళ అమ‌రావ‌తిలోని 33 వేల ఎక‌రాల భూమిని ప్ర‌భుత్వం ఏ చేస్తుంది..? అన్న‌దానిపైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌లో అమ‌రావ‌తి ప్రాంతాన్ని స్పెష‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ జోన్‌గా మారుస్తారంటూ ప్ర‌చారం మొద‌లైంది. రాష్ట్రంలోనే వ్య‌వ‌సాయానికి అత్యంత అనువైన ప్రాంతంగా ఉంటూ వ‌చ్చిన అమ‌రావ‌తి ప్రాంతం కాంక్రీట్ జంగిల్ కాకుండా తిరిగి నాలుగైదు పంట‌లు పండే అన్న‌పూర్ణ‌గా ఈ ప్రాంతాన్ని మార్చేందుకు  ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ప‌చ్చని పొలాల‌తో విరాజిల్లిన అమ‌రావ‌తి ప్రాంతం రాజ‌ధాని ప్ర‌క‌ట‌న త‌రువాత బీడుగా మారింది. ఇప్పుడు అక్క‌డ స్పెష‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ జోన్ ఏర్పాటుచేస్తే తిరిగి ప‌చ్చ‌ద‌నం ప‌రుచుకునే అవ‌కాశం ఉంది. భూములు తిరిగి ఇచ్చేస్తే వ్య‌వ‌సాయం చేసుకుంటామ‌ని ఇప్ప‌టికే ప‌లువురు రైతులు ముందుకు వ‌స్తున్నారు. స్పెష‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ జోన్ ఏర్పాటుచేస్తే అత్యాధునిక ప‌ద్ధ‌తుల‌తో అన్ని ర‌కాల పంటలు పండించ‌వ‌చ్చు. వ్య‌వ‌సాయానికి అవ‌స‌ర‌మైన సాంకేతిక ప‌రిజ్ఞానం, ఇత‌ర అనుమ‌తులు ఒకేచోట ల‌భ్య‌మ‌య్యేలా చ‌ర్య‌లు తీసుకుంటారు. భూములు ఇచ్చిన రైతుల‌ను కూడా ఈ జోన్‌లో భాగ‌స్వాముల‌ను చేస్తారు.

దీనిపై ప్ర‌భుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పంద‌న రాక‌పోయినా అధికార‌పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఈ ఆలోచ‌న‌ను స్వాగ‌తిస్తున్నారు. చంద్ర‌బాబు ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో రాజ‌ధాని ప‌రిధిలోని 29 గ్రామాల‌పై విడుద‌ల చేసిన శ్వేత‌ప‌త్రాన్ని కూడా అధికార పార్టీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. రాజ‌ధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఒక్క వ్య‌వ‌సాయం ద్వారానే ఏటా వెయ్యి కోట్ల రూపాయ‌ల ఆదాయం వ‌స్తుంద‌ని గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఇలా వ్య‌వ‌సాయం ద్వారానే వెయ్యి కోట్ల ఆదాయం స‌మ‌కూర్చే అరుదైన ప్రాంతాన్ని స్పెష‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ జోన్‌గా ప్ర‌క‌టిస్తే త‌ప్పేంట‌ని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే మీడియా స‌మావేశంలో ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం వ‌ద్ద ఇలాంటి ప్ర‌తిపాద‌న ఉందో..?  లేదో..?  త‌న‌కు తెలియ‌ద‌ని, ఒక‌వేళ అగ్రిక‌ల్చ‌ర్ ఏర్పాటు చేసే యోచ‌న ఉంటే ఆ దిశ‌గా అడుగులు వేయాల్సిందిగా ముఖ్య‌మంత్రిని తాను కూడా కోరుతాన‌ని చెప్పారు.

ఒక‌వేళ ప్ర‌భుత్వం నిజంగానే రాజ‌ధాని భూముల్లో అగ్రిక‌ల్చ‌ర్ జోన్‌ను ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో పంట‌ల‌ సిరులు మ‌ళ్లీ ఖాయం. కాక‌పోతే రాజ‌ధాని కోస‌మంటూ భూములు ఇచ్చిన రైతులంతా ఇప్పుడు స్పెష‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ జోన్ ఏర్పాటులో భాగం అయ్యేందుకు అంగీక‌రిస్తారా..?  లేదా..? అన్న‌ది కూడా కీల‌క‌మైన అంశ‌మే. భూములు ఇచ్చిన రైతుల‌ను ఒప్పించ‌చే విధానంపైనే ఈ స్పెష‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ జోన్ ఏర్పాటు ఆధార‌ప‌డి ఉంటుంది.

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle