newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

అమ్మ... చెల్లి... ఒక జగన్

14-03-201914-03-2019 15:18:24 IST
Updated On 14-03-2019 19:55:41 ISTUpdated On 14-03-20192019-03-14T09:48:24.866Z14-03-2019 2019-03-14T08:10:59.248Z - 2019-03-14T14:25:41.998Z - 14-03-2019

అమ్మ... చెల్లి... ఒక జగన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈసారి కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలనే పట్టుదలతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3600 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఆయన ఎన్నికల ప్రచారపర్వంలోకి దిగనున్నారు. 16వ తేదీ ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ప్రారంభించనున్నారు.

హెలికాఫ్టర్ ద్వారా ప్రతీరోజు 4 - 5 నియోజకవర్గాల చొప్పున ఆయన ప్రచారం కొనసాగనుంది. జగన్‌కు తోడుగా ఆయన కుటుంబసభ్యులు కూడా ప్రచారపర్వంలోకి దిగనున్నారు. ఆయన తల్లి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో పాటు ఆయన సోదరి షర్మిళ కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధమవుతోంది. వైఎస్ ఉన్నంతవరకూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న వీరిద్దరు ఆయన మరణం తర్వాత నెలకొన్న పరిస్థితుల్లో ప్రజల్లోకి రావాల్సి వచ్చింది.

వైఎస్ జగన్ 16 నెలలు జైళ్లో ఉన్నప్పుడు పార్టీ గౌరవాధ్యక్షురాలి హోదాలో ఉమ్మడి రాష్ట్ర పార్టీ బాధ్యతలను విజయమ్మ చూసుకున్నారు. పార్టీ తరపున దీక్షలు, ధర్నాలూ చేశారు. అప్పుడే వచ్చిన ఉప ఎన్నికల్లో విజయమ్మ, షర్మిల ప్రచార బాధ్యతలు నిర్వర్తించి పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని విజయం సాధించారు. తర్వాత షర్మిళ ఉమ్మడి రాష్ట్రంలో పరామర్శ యాత్ర, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. జగన్ జైలు నుంచి వచ్చాక వీరు తెరమరుగయ్యారు. గత ఎన్నికల వేళ విజయమ్మ విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కూడా నిర్వహించారు. 

వైఎస్ షర్మిల కూడా పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఎన్నికల తర్వాత పార్టీ ప్లీనరీలో తప్ప ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో ఆమె పాల్గొనలేదు. ఈ ఎన్నికలవేళ వారు మరోసారి జగన్‌కు అండగా ప్రజల్లోకి వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి వాహనాలు కూడా సిద్ధమయ్యాయి. జగన్ ఈసారి ఎక్కువగా కోస్తా, ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో షర్మిళ, విజయమ్మ ఎక్కువగా రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై ఫోకస్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. 

షర్మిళ పార్లమెంటుకు కూడా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నా ఇంకా స్పష్టత రాలేదు. విజయమ్మ ఈసారి పోటీకి దూరంగా ఉండనున్నారు. విజయమ్మ, షర్మిళకు ప్రజల్లోకి వెళ్లడం, ప్రసంగాలు చేయడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా షర్మిళ తన ప్రసంగంతో ఆకట్టుకుంటారు. ప్రత్యర్థులపై నేరుగా మాటలతూటాలు పేలుస్తుంటారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి యాసలో, ఆయన స్టయిల్లో మాట్లాడతారనే పేరుంది. విజయమ్మ పట్ల కూడా ప్రజల్లో మంచి ఆదరణ ఉంటుందని వైసీపీ భావిస్తోంది. 

దీంతో వీరిద్దరి ప్రచారం పార్టీకి మేలు చేస్తుందని పార్టీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. వీరిద్దరూ సీమతో పాటు ప్రకాశం, నెల్లూరు ప్రచార బాధ్యతలు తీసుకుంటే గత ఎన్నికల్లో వైసీపీ పెద్దగా ప్రభావం చూపని మిగతా జిల్లాలలో జగన్ ప్రచారం చేయనున్నారు. జగన్ జైళ్లో ఉన్న సమయంలో పార్టీని కాపాడుకోవడంలో కీలకంగా వ్యవహరించిన వీరిద్దరు ఇప్పుడు జగన్ అధికారంలోకి రావడానికి ఎంత వరకు తోడ్పడతారో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle