newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

అమ్మ ఒడి: పేద తల్లులకు లాభమా? ప్రైవేట్ స్కూళ్ళకు వ్యాపారమా?

24-06-201924-06-2019 15:54:58 IST
Updated On 24-06-2019 15:55:38 ISTUpdated On 24-06-20192019-06-24T10:24:58.038Z24-06-2019 2019-06-24T10:24:51.549Z - 2019-06-24T10:25:38.992Z - 24-06-2019

అమ్మ ఒడి: పేద తల్లులకు లాభమా? ప్రైవేట్ స్కూళ్ళకు వ్యాపారమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'అమ్మ ఒడి' అనే పథకాన్ని రూపొందించారు. కానీ ఈ పథకానికి నియమావళిపై రకరకాల సందేహాలు నెలకొన్నాయి. చివరకు జగన్ స్వయంగా ప్రభుత్వ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కూడా వర్తిస్తుందని చెప్పాడంతో ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. ఈ పథకం పేద తల్లులకు లాభమా? ప్రైవేట్ పాఠశాలలకు వ్యాపారమా? అనే అంశంపై ఎడతెగని చర్చ జరుగుతోంది. అమ్మ ఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. 

ఈ పథకం వల్ల ఇప్పటికే కునారిల్లుతున్న కొన్ని ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మూత పడే అవకాశం ఉందని ఉపాధ్యాయులు కొందరు అభిప్రాయపడుతున్నారు. అసలు అమ్మ ఒడి పథకం కింద ప్రతి విద్యార్థి తల్లికి డబ్బులు ఇవ్వడం ఎందుకు? విద్యార్థి తల్లి కావలసింది రూ. 15వేల  ఆదాయమా?

ఆ విద్యార్థికి నాణ్యమైన చదువు సౌకర్యవంతమైన పాఠశాల అవసరం లేదా? 15 వేలు ఇచ్చినంత మాత్రాన విద్యార్ధికి బాగా చదువు అబ్బుతుందా? విద్యార్థి జ్ఞాన సంపన్నుడు అవుతాడా? తల్లికి ఇచ్చే ఆమొత్తాన్ని తల్లి విద్యార్ధి చదువుకోసం ఖర్చుచేస్తుందా? ప్రైవేట్ పాఠశాలలు ఆమాత్రం ఫీజుతో మేము మీ పిల్లల చదువు చెబుతాం అంటూ గ్రామాలలో ఆ పాఠశాల యొక్క బ్రాంచ్ లు నెలకొల్పితే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా తయారవుతుందో ప్రభుత్వం నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉంది.

అమ్మ ఒడి పథకం కింద తల్లులకు 15వేలు ఇవ్వకుండా ఆయా ప్రభుత్వ పాఠశాలల ఖాతాలకు జమచేస్తే అవి బలోపేతం అవుతాయి. ఉదాహరణకు 100 మంది విద్యార్థులు ఉన్న ఒక పాఠశాలను తీసుకుంటే ఒక్క విద్యార్థికి పదిహేనువేలు చొప్పున వంద మందికి 15 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇవ్వవలసి ఉంటుంది.

అదే 15 లక్షలు ఒక పాఠశాల మౌలిక వసతులకు కనీస అవసరాలకు వినియోగిస్తే ఆ పాఠశాల ఎంత బలోపేతం అవుతుంది. అనేక పాఠశాలల్లో స్వీపర్లు లేరు. ఈ డబ్బు ద్వారా స్వీపర్లను ఏర్పాటుచేసుకోవచ్చు. ఔట్ సోర్సింగ్ విధానంలో స్వీపర్ ని నియమిస్తే ఐదు వేల నుండి ఆరు వేల రూపాయలకు స్వీపర్ లభిస్తారు.అంటే సంవత్సరానికి వాళ్ల కోసం చేసే ఖర్చు 72వేలు మాత్రమే.  అలాగే పాఠశాలల్లో ఫర్నిచర్ కొరత వేధిస్తోంది. 50 వేలు ఖర్చు పెడితే ఫర్నిచర్ సమకూర్చుకోవచ్చు. విరాళాల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. అలాగే పిల్లలకు ప్రైవేటు స్కూళ్ళలో ఇస్తున్నట్టు వర్క్ బుక్ లు ఇవ్వవచ్చు. తరగతి గదుల్లో టీవీ స్క్రీన్లు ఏర్పాటుచేసి డిజిటల్ క్లాస్ రూములుగా మార్చవచ్చు. 

ప్రతి తరగతి గదిని అందమైన పెయింటింగ్స్, పిల్లలకు ఉపయుక్తకరమైన పాఠ్యాంశాలతో తీర్చిదిద్దడానికి తరగతి గదికి 25 వేల రూపాయల చొప్పున లక్షా 25 వేలు ఖర్చవుతుంది. పాఠశాలలో వివిధ అవసరాల కోసం ప్రింటర్, కంప్యూటర్ కూడా ఏర్పాటుచేసుకోవచ్చు. దీనికి అయ్యే ఖర్చు కేవలం రూ. 30 వేలు మాత్రమే.

పిల్లలకు సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, కరాటే వంటి ఇతర కార్యక్రమాలు నిర్వహించడానికి ఏడాదికి లక్షరూపాయలు ఖర్చుపెట్టవచ్చు.  పాఠశాలలో విద్యార్థులు క్రీడా నైపుణ్యాలను పెంపొందించడానికి అన్ని రకాల క్రీడా సామాగ్రిని అందుబాటులో ఉంచవచ్చు. ఇందుకోసం అయ్యే ఖర్చు 20 వేల రూపాయలు మాత్రమే. అలాగే విద్యార్ధులకు సురక్షితమయిన తాగునీటి కోసం చిన్న మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు లక్షా యాభై వేలు. 

ప్రతి తరగతికి ఒక టీచర్,ప్రతి స్కూల్ కి ఓ జూనియర్ అసిస్టెంట్ , ఒక స్వీపర్, ప్రతి విద్యార్థికి ఫర్నిచర్, కార్పొరేట్ పాఠశాల మాదిరిగా స్టడీమెటీరియల్స్,ప్రతి తరగతిలోనూ డిజిటల్ క్లాసులు, నాణ్యమైన ఆహారం,నాణ్యత కలిగిన యూనిఫాం,క్రీడలు, సంగీతం,నాట్యం.. ఇలా ఎన్నో సౌకర్యాలు సుమారు 6లక్షల నుండి ఎనిమిది లక్షలు ఖర్చు చేస్తే ఆ పాఠశాలలు బలోపేతం అవుతాయి‌.

వీటిలో ప్రతిఏటా చేయాల్సినవి తక్కువ ఉంటాయి. వందమంది విద్యార్థులుండే పాఠశాలకు 15 లక్షలు ప్రభుత్వం ఇస్తే అవి బలోపేతం అవుతాయి. ప్రతి తల్లి కోరుకునేది 15 వేల రూపాయల ఆదాయం కాదు.విద్యార్థికి నాణ్యమైన చదువు,మంచి సౌకర్యాలు కలిగిన పాఠశాల.ఈ విషయం గ్రహిస్తే చాలా మంచిదని  ఉపాధ్యాయులు సోషల్ మీడియా సాక్షిగా అభిప్రాయపడుతున్నారు. అమ్మ ఒడి పథకం మంచిదే ఈ పథకాన్ని ప్రభుత్వ స్కూళ్ళకు మాత్రమే పరిమితం చేయాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle