newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

అమ్మ ఒడి.. పథకం ప్రభుత్వానిది.. డబ్బులు ప్రజలవే!

06-01-202006-01-2020 14:22:07 IST
2020-01-06T08:52:07.743Z06-01-2020 2020-01-06T08:52:00.757Z - - 11-08-2020

అమ్మ ఒడి.. పథకం ప్రభుత్వానిది.. డబ్బులు ప్రజలవే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అభివృద్ధికి కోట్లు ఖర్చు పెట్టడం కన్నా.. సంక్షేమమే మాకు ముఖ్యం. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట ఇదే. సాక్షాత్తు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డే రాష్ట్రానికి వచ్చే విమానాలకి రాయతీలు ఇవ్వాలా? తల్లులకి పోష్టికాహారం ఇవ్వాలా అంటే మా ప్రాధాన్యత తల్లులకేనని నిర్ణయించుకున్నామని.. అందుకే గత ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే ఎయిర్ లైన్స్ కి ఇచ్చే రాయితీలను నిలిపివేశామన్నారు.

ఆ ఒక్క సన్నివేశంలో చాలా అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబు సీఎంగా రాష్ట్రంలో అభివృద్ధికి సౌకర్యాల కల్పనలో భాగంగా కొత్త రాష్ట్రానికి ఎయిర్ లైన్స్ ఉండాలని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం వాటికి రాయితీలు ఇచ్చారు. జగన్ సర్కార్ అవి దండగని ఆ డబ్బులే తల్లులకు ఇస్తామంది. కానీ అభివృద్ధి ఆగిపోయి.. పెట్టుబడులు నిలిచిపోతే సంక్షేమానికి నిధులు ఎక్కడ నుండి వస్తాయని విశ్లేషకులు అప్పుడే ప్రశ్నించారు.

అనుకున్నట్లుగానే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఘోరంగా మారిపోయింది. ఒకపక్క రాజధాని గొడవలు, మరోపక్క ఆర్ధిక సంక్షోభం కలిసి రాష్ట్రానికి పెట్టుబడి వచ్చే మార్గం లేకుండా పోయింది. ఇప్పటికే అప్పులు దొరికే ప్రతి మార్గాన్ని వాడేసుకున్నారు. ఇక పైసా అప్పు దొరికే పరిస్థితి లేదు. కానీ సీఎం జగన్ తన నవరత్నాలను అమలు చేయకపోతే మాట తప్పినట్లే అవుతుందని భావించారు.

దీనికోసం ప్రజల డబ్బునే మరోమార్గం ద్వారా మళ్లించినట్లుగా చెప్తున్నారు. ముందుగా అమ్మఒడి పథకంలో డెబ్భై లక్షకు మంది తల్లులకి సాయం అందించనున్నట్లుగా చెప్పిన ప్రభుత్వం చివరికి దానిని ముప్పై ఐదు లక్షలకి కుదించింది. ఆ అర్హులకి ఇప్పుడు చెల్లింపులు మొదలు పెట్టారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లింపులు జరగలేదు. అయితే వీటి కోసం కార్పొరేషన్ నిధులని మళ్లించినట్లుగా చెప్తున్నారు.

జగన్ సర్కార్ బడ్జెట్ లో కులాల వారీగా కార్పొరేషన్ నిధులని కేటాయించింది. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, క్రిస్టియన్ కార్పొరేషన్, ముస్లిం మైనార్టీ ఇలా ఆయా వర్గాలకి సాయం చేయడం కోసం నిధులని కేటాయించింది. ఈ సాయం గత ప్రభుత్వం చేసిందే కాగా ఈ ప్రభుత్వం కూడా కేటాయింపులు చేసింది. అయితే, జగన్ ఆ నిధులనే అమ్మ ఒడి పథకానికి మళ్లించినట్లుగా ప్రచారం జరుగుతుంది.

అమ్మ ఒడి పథకం లేకపోయినా ఆ నిధులు సామజిక వర్గాల వారీగా ప్రజలకు చేరేవే. కాకపోతే ఆ నిధులనే ఇప్పుడు అమ్మ ఒడి పథకానికి మళ్లించి ఇలా విడుదల చేశారని చెప్తున్నారు. వెనుక బడిన కులాల వారి ఉపాధి కోసం కేటయించిన నిధులని ఇలా తన నవరత్నాల అమలు కోసం వాడేసుకోవడం వివాదాస్పదంగా మారుతుండగా ప్రజల సొమ్ము ప్రజలకి ఇవ్వడమే నవరత్నాల అమలు అంటారా అంటూ ప్రజలు ఊగిపోతున్నారు.

 

కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ చర్యలు భేష్

కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ చర్యలు భేష్

   2 minutes ago


భూమిపూజలో దళిత సాధువులను దూరం పెట్టారు.. కోవింద్ కూడా కనబడలేదా.. మాయావతి ధ్వజం

భూమిపూజలో దళిత సాధువులను దూరం పెట్టారు.. కోవింద్ కూడా కనబడలేదా.. మాయావతి ధ్వజం

   6 minutes ago


పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   2 hours ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   2 hours ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   2 hours ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   2 hours ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   3 hours ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   3 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   4 hours ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   4 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle