newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 108 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 2099 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

అమ్మఒడితో 43 లక్షల మంది తల్లులకు లాభం..

22-09-201922-09-2019 12:54:24 IST
Updated On 23-09-2019 14:09:41 ISTUpdated On 23-09-20192019-09-22T07:24:24.709Z22-09-2019 2019-09-22T07:24:22.738Z - 2019-09-23T08:39:41.988Z - 23-09-2019

అమ్మఒడితో 43 లక్షల మంది తల్లులకు లాభం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు నాంది పలికిన అమ్మ ఒడి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవశ్యకత ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,456 కోట్ల నిధులు వెచ్చిస్తోందని, ఈ పథకానికి కేంద్రం తరఫున కూడా తగిన సాయం చేయాలని కోరారు. నూతన విద్యా విధానం ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రుల సమావేశంలో ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌ పాల్గొని అమ్మఒడి పథకం గురించి వివరించారు. 

చదువుకు పేదరికం అడ్డుకారాదన్న ఉద్దేశంతో ఏపీలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం రాష్ట్ర విద్యావ్యవస్థను మౌలికంగా మార్చివేయనుందని మంత్రి తెలిపారు. ఈ పథకంలో 43 లక్షల మంది తల్లులు ఉన్నారని, ఒక్కో తల్లికి రూ.15 వేల చొప్పున ఏడాదికి ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా అందజేస్తున్నామని తెలిపారు.

ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వ సాయం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర బడ్జెట్‌లో 16 శాతం నిధులతో సుమారు రూ. 33 వేల కోట్లను ప్రభుత్వం విద్యాశాఖకు కేటాయించిందని చెప్పారు. విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయమని మంత్రి పేర్కొన్నారు. 

ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు రూ. 5 వేల కోట్ల నిధులు కావాలని మంత్రి ఢిల్లీలో జరిగిన విద్యాశాఖ మంత్రుల సమావేశంలో విజ్ఞప్తి చేశారు. మూడో తరగతి నుంచి కంప్యూటర్ బోధన జరిగేలా ఉండాలని సూచనలు చేస్తూ.. టెక్నాలజీని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలి తెలిపారు. విద్యావిధానంలో లౌకిక వ్యవస్థ పునాదిగా ఉండాలని, దీన్ని భంగం కలిగించే నిర్ణయాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

భారీ వ్యయంతో కూడిన అమ్మఒడికి కేంద్రప్రభుత్వం సహకరిస్తే ఆంద్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకోవడం ఖాయం. కానీ గతంలో ఏపీ ప్రభుత్వం వెచ్చించిన భారీ ప్రాజెక్టుల వ్యయాన్ని చెల్లింపు చేయడానికే కొర్రీ పెడుతున్న కేంద్రం ఈ విషయంలో ఏపీకి ఏమేరకు సహకరిస్తుందన్నది సందేహమే.. 

Image result for 43 lakh mothers profit with Ammavodi

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

   11 hours ago


బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో  ఘటన

బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో ఘటన

   11 hours ago


మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

   13 hours ago


ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

   16 hours ago


మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

   17 hours ago


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

   19 hours ago


ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   a day ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   a day ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   a day ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle